మంత్రి తలసానిపై దాసోజు శ్రవణ్‌ తీవ్ర విమర్శలు | Congress Leader Dasoju Sravan Fires On Talasani Srinivas Yadav | Sakshi
Sakshi News home page

మంత్రి తలసానిపై దాసోజు శ్రవణ్‌ తీవ్ర విమర్శలు

Published Sat, Feb 27 2021 5:53 PM | Last Updated on Sat, Feb 27 2021 6:04 PM

Congress Leader Dasoju Sravan Fires On Talasani Srinivas Yadav - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌.. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తలసాని ఓ ఆకురౌడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పదో తరగతి ఫెయిల్ అయ్యి గల్లీల్లో తిరిగే ఆకు రౌడీ తలసాని. కేటీఆర్‌! నీకు చర్చకు వచ్చే దమ్ము లేదు కానీ, నీ ఆలుగడ్డల శ్రీనివాస్‌తో నన్ను తిట్టిస్తావా..?.  ఉద్యోగాలు అడిగితే మేము గొట్టం గాళ్లం అయ్యామా..?.  ఈ గొట్టం గాని కోసమే కేటీఆర్ నా ఇంటికి మూడు సార్లు వచ్చాడు.. టీఆర్‌ఎస్‌లో చేరు అని. తలసాని ఓ సన్నాసి. 

పదో తరగతి ఫెయిల్ అయినోడివి.. నీకు నిరుద్యోగుల బాధ ఎట్లా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన నువ్వు...టీఆర్‌ఎస్‌కి చెంచావి. పైసలిచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన నువ్వా.. నన్ను గొట్టం గాడు అనేది..? నీ లెక్క పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమకారుల పార్టీలో తలసాని లాంటి లఫంగిలు చేరారు. నేను గొట్టంగాన్నో.. కాదో కేసీఆర్‌ని అడుగు’’ అంటూ మండిపడ్డారు.

చదవండి : ఆ విషయంలో కేటీఆర్‌ తండ్రిని మించిపోయాడు 

చిన్నారికి ఉపరాష్ట్రపతి అభినందనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement