
గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి తథ్యం: దాసోజు
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్‌లో ఓడిపోవడం తథ్యమని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్‌లో ఓడిపోవడం తథ్యమని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఆయునకు ఈ విషయుం అర్థవుయ్యే తీవ్ర నిరాశ, నిస్పృహలతో రెచ్చగొట్టే రాజకీయూనికి తెరతీశారని వివుర్శించారు. గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘సామంత రాజ్యం కావాలా? స్వతంత్ర రాజ్యం కావాలా? అని కేసీఆర్ అడుగుతున్నాడు. తెలంగాణ సమాజం మాత్రం సామాజిక న్యాయం కావాలా? కేసీఆర్ కుటుంబ సపరివార దోపిడీ పాలన కావాలా? అని ప్రశ్నిస్తోంది’ అని పేర్కొన్నారు.