
హోం మంత్రి రాజీనామా చేయాలి: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: మహిళలకు భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లా వీణవంక ఘటనకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఈ కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు.