
హైదరాబాద్: ప్రస్తుతం మన ప్రభుత్వంలో ఉన్నామని, పేదవాడి కోసం పని చేయాలన్నారు తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్., ఈరోజు హైదరాబాద్ లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఇప్పుడు మనం ప్రభుత్వం లో ఉన్నాం.. పేద వాడి కోసం పని చేయాలి.
పేదల మొఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్టు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉంది.. అనేక రకాలుగా పోరాటాలు చేసాము.. అందుకే తెలంగాణ లో అధికారంలోకి వచ్చాము.రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు.
మనం దాని కోసం పోరాటం చేయాలి. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో మనం ఇక్కడ పోరాటం చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది... కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలి పదేళ్లు గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేసారు. వారికి న్యాయం జరగాలి.. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలి. మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలి. దేశంలో ఎక్కడా లేని విదంగా ఇక్కడ కులఘనన చేపట్టాము.. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. గ్రామ గ్రామన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ఈ విషయంలో పీసీసీ ఒక పకడ్బందీగా కాలెండర్ సిద్ధం చేయాలి’ అని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment