
పార్టీ విధానమే తెలియని వ్యక్తి ముఖ్య ప్రతినిధా?
టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్‌ను నియమించడం పట్ల కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
{శవణ్ నియామకంపై నిరంజన్ మండిపాటు
హైదరాబాద్: టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్‌ను నియమించడం పట్ల కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు పూర్తిగా తెలియని వ్యక్తికి టీఆర్‌ఎస్ నుంచి వచ్చీరాగానే ముఖ్యమైన పదవి ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. మల్లు రవి, కమలాకరరావు వంటి సీనియర్లు ఎన్నోఏళ్లుగా అధికార ప్రతినిధులుగా కొనసాగుతుండగా నిన్నటిదాకా టీఆర్‌ఎస్‌లో ఉండి వచ్చిన శ్రవణ్‌ను ముఖ్య అధికార ప్రతినిధిని చేయడం సీనియర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల పునరాలోచించుకోవాలని, లేనిపక్షంలో తాము అధికార ప్రతినిధులుగా కొనసాగే విషయంలో తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన మాజీ నక్సలైట్: రెండు దశాబ్దాలకుపైగా నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన శ్రీహరి యాదవ్ శనివారం కేంద్రమంత్రి జైరాం రమేశ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. విద్యార్థిదశలో పీడీఎస్‌యూ, ఆ తరువాత జనశక్తి వీరన్న దళంలో ఆయన పనిచేశారు. నక్సలైట్లతో శాంతి చర్చల్లో ప్రతినిధిగా వ్యవహరించారు. తెలంగాణ కల సాకారం చేసినందుకే కాంగ్రెస్‌లో చేరానని శ్రీహరియాదవ్ పేర్కొన్నారు.