భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికీ, సీడబ్ల్యూసీ సభ్యు లకూ –తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలని మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలను సైతం వదిలి, హైదరాబాద్ నగరంలో నిర్వ హించాలని నిర్ణయించడం, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న కీలక నాయకులు సైతం ఈ సమావేశాలకు రావడం హర్షణీయం. మీరు పొలిటికల్ టూరిస్టులుగాకాకుండా, తెలంగాణ అభివృద్ధిపై అధ్యయనం చేయ డానికి వస్తున్న పరిశోధకులుగా, ఈ పర్యటనను ఒక స్టడీ టూర్‌గా సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.
ముందుగా మీరు ‘విశ్వనగరం’ హైదరాబాద్‌లోకి అడుగుపెడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నివసిస్తున్న సబ్బండ వర్గాల ప్రజలకూ, పరిశ్ర మలకూ సకల వసతులూ కల్పిస్తూ, విభిన్న జీవన శైలు లకు నిలయమైన హైదరాబాద్ కున్న ‘గంగా జమునా తెహజీబ్’ ప్రత్యేక వారసత్వ సంస్కృతిని కేసీఆర్ ఎలా కాపాడుతున్నారో గమనించండి. మంత్రి కేటీఆర్ సార థ్యంలో ఐటీ రంగం విప్లవాత్మకమైన ప్రగతి సాధిస్తూ దూసుకుపోతున్న తీరు పరిశీలించండి. మీ పర్యటనలో తెలంగాణ కొత్త సచివాలయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125 అడుగుల అతి పెద్ద విగ్ర హాన్ని చూసి తరించండి. తెలంగాణ అమరవీరులస్మృత్యర్థం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రపంచ స్థాయి అమరవీరుల స్మారకకేంద్రాన్ని సందర్శించండి.మీ పర్యటనలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చెరువులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిందో చూడండి. మీరు ‘మిషన్ భగీరథ’ ఘనత తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 24 వేల పల్లెలకు, 121 నగర ప్రాంతాలలో ఉన్న ప్రతి ఇంటికీ పైపు లైనులు ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తూ, ప్రజల దాహార్తిని తీరుస్తోంది ప్రభుత్వం.
దాదాపు 80 వేల కోట్ల రూపాయలతో కేవలం 3–4 ఏళ్లలో రికార్డ్ స్థాయిలో నిర్మించిన అతి పెద్ద బహుళ దశల ఎత్తి పోతల పథకం ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ను సందర్శించండి. అంతే కాదు ఒక పక్క మీరు రాజకీయాలు చేస్తుంటే మరోపక్క కేసీఆర్ ‘పాలమూరు– రంగారెడ్డి’ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించి– 13 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి బీళ్లు పడ్డ భూములను కృష్ణా నదీ జలాలతో తడుపుతున్న విషయాన్ని గుర్తించండి.
‘రైతుబంధు’, రైతులకు బీమా, పంటరుణాల రద్దు, ఇన్‌పుట్ సబ్సిడీ, ‘ఉచిత విద్యుత్’ సరఫరా వంటి పథకాలు రైతులను ఎలా ఆదుకొంటున్నాయో తెలుసు కోండి.బీఆర్‌ఎస్ ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులా లను ఏర్పాటు చేసింది. ఆ విద్యాలయాలకు వెళ్ళండి. వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సాగే బోధనను గమనించండి. ‘కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ’, తెలంగాణ ‘గిరిజన సంక్షేమ గురుకులాల’నూ దర్శించండి.
ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు, కొత్త జూని యర్ కళాశాలల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పన లాంటి కార్యక్రమాలని ప్రభుత్వం ఎంత నిబద్ధతతో చేపడుతుందో గ్రహించండి. ‘మన ఊరు– మనబడి’, ‘మన బస్తీ–మన బడి’ పథకంలో నిర్మించిన స్కూల్స్ ని సందర్శించండి. ‘కేసీఆర్ కిట్’, ‘బస్తీ దవాఖానాలు’, ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్’, ‘ఆరోగ్యశ్రీ’ ఇలాంటి అద్భుతమైన పథకాల అమలూ; 34 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన గణనీయమైన వృద్ధిని అధ్యయనం చేయండి. తండాలు, గూడేల్ని పంచాయతీలుగా మార్చా లని ఎన్నో ఏళ్లనుంచి కోరుకుంటున్న గిరిజనుల కలని కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చింది.
అత్యంత ప్రతిష్ఠా త్మకంగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం దళితుల జీవితాలు ఎంత అద్భుతంగా మార్చిందో మీరు తెలుసుకోవాలి. వ్యవసాయం తరువాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధి ఇస్తున్న వృత్తి చేనేత. నేతన్నల జీవితాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుత మైన మార్పుని పరిశీలించండి. దేశంలో ఎక్కడాలేని విధంగా గొల్ల, కురుమలకు వేలకోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ‘సబ్సిడీ గొర్రెల పంపిణీ’ పథకం, అదే విధంగా కోట్లకొద్దీ చేప పిల్లలను పంపిణి చేసి మత్స్యకారుల ఆదాయానికి తోడ్పడ్డ విషయం తెలుసుకోండి. అలాగే మీ పర్యటనలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ‘డబుల్ బెడ్ రూమ్’ ఇళ్ళని సందర్శించండి.
పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తున్న ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలు తెచ్చిన కల్యాణ కాంతులు చూడండి. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల గాథ గురించి చెప్పలంటే ఇంకా చాల విషయాలు ఉన్నాయి. మీ సీడబ్లు్యసీ సమావేశాల్లో తెలంగాణలో పదేళ్ళలో జరిగిన అభివృద్ధి దేశంలో అరవై ఏళ్లలో ఎందుకు జరగలేదో లోతుగా చర్చించండి. ఒక విశాల దృక్పథంతో ఆలో చించి, తెలంగాణ అభివృద్ధి సంక్షే మాన్ని మీ రాష్ట్రాలలో అమలు చేసి మీ ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించండి.
ఇట్లు మీ
శ్రవణ్
వ్యాసకర్త బీఆర్‌ఎస్ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment