CWC Committee
-
కాంగ్రెస్ పెద్దలకు బహిరంగ లేఖ
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికీ, సీడబ్ల్యూసీ సభ్యు లకూ –తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలని మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలను సైతం వదిలి, హైదరాబాద్ నగరంలో నిర్వ హించాలని నిర్ణయించడం, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న కీలక నాయకులు సైతం ఈ సమావేశాలకు రావడం హర్షణీయం. మీరు పొలిటికల్ టూరిస్టులుగాకాకుండా, తెలంగాణ అభివృద్ధిపై అధ్యయనం చేయ డానికి వస్తున్న పరిశోధకులుగా, ఈ పర్యటనను ఒక స్టడీ టూర్‌గా సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ముందుగా మీరు ‘విశ్వనగరం’ హైదరాబాద్‌లోకి అడుగుపెడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నివసిస్తున్న సబ్బండ వర్గాల ప్రజలకూ, పరిశ్ర మలకూ సకల వసతులూ కల్పిస్తూ, విభిన్న జీవన శైలు లకు నిలయమైన హైదరాబాద్ కున్న ‘గంగా జమునా తెహజీబ్’ ప్రత్యేక వారసత్వ సంస్కృతిని కేసీఆర్ ఎలా కాపాడుతున్నారో గమనించండి. మంత్రి కేటీఆర్ సార థ్యంలో ఐటీ రంగం విప్లవాత్మకమైన ప్రగతి సాధిస్తూ దూసుకుపోతున్న తీరు పరిశీలించండి. మీ పర్యటనలో తెలంగాణ కొత్త సచివాలయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125 అడుగుల అతి పెద్ద విగ్ర హాన్ని చూసి తరించండి. తెలంగాణ అమరవీరులస్మృత్యర్థం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రపంచ స్థాయి అమరవీరుల స్మారకకేంద్రాన్ని సందర్శించండి.మీ పర్యటనలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిందో చూడండి. మీరు ‘మిషన్ భగీరథ’ ఘనత తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 24 వేల పల్లెలకు, 121 నగర ప్రాంతాలలో ఉన్న ప్రతి ఇంటికీ పైపు లైనులు ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తూ, ప్రజల దాహార్తిని తీరుస్తోంది ప్రభుత్వం. దాదాపు 80 వేల కోట్ల రూపాయలతో కేవలం 3–4 ఏళ్లలో రికార్డ్ స్థాయిలో నిర్మించిన అతి పెద్ద బహుళ దశల ఎత్తి పోతల పథకం ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ను సందర్శించండి. అంతే కాదు ఒక పక్క మీరు రాజకీయాలు చేస్తుంటే మరోపక్క కేసీఆర్ ‘పాలమూరు– రంగారెడ్డి’ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించి– 13 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి బీళ్లు పడ్డ భూములను కృష్ణా నదీ జలాలతో తడుపుతున్న విషయాన్ని గుర్తించండి. ‘రైతుబంధు’, రైతులకు బీమా, పంటరుణాల రద్దు, ఇన్పుట్ సబ్సిడీ, ‘ఉచిత విద్యుత్’ సరఫరా వంటి పథకాలు రైతులను ఎలా ఆదుకొంటున్నాయో తెలుసు కోండి.బీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులా లను ఏర్పాటు చేసింది. ఆ విద్యాలయాలకు వెళ్ళండి. వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సాగే బోధనను గమనించండి. ‘కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ’, తెలంగాణ ‘గిరిజన సంక్షేమ గురుకులాల’నూ దర్శించండి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు, కొత్త జూని యర్ కళాశాలల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పన లాంటి కార్యక్రమాలని ప్రభుత్వం ఎంత నిబద్ధతతో చేపడుతుందో గ్రహించండి. ‘మన ఊరు– మనబడి’, ‘మన బస్తీ–మన బడి’ పథకంలో నిర్మించిన స్కూల్స్ ని సందర్శించండి. ‘కేసీఆర్ కిట్’, ‘బస్తీ దవాఖానాలు’, ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్’, ‘ఆరోగ్యశ్రీ’ ఇలాంటి అద్భుతమైన పథకాల అమలూ; 34 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన గణనీయమైన వృద్ధిని అధ్యయనం చేయండి. తండాలు, గూడేల్ని పంచాయతీలుగా మార్చా లని ఎన్నో ఏళ్లనుంచి కోరుకుంటున్న గిరిజనుల కలని కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చింది. అత్యంత ప్రతిష్ఠా త్మకంగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం దళితుల జీవితాలు ఎంత అద్భుతంగా మార్చిందో మీరు తెలుసుకోవాలి. వ్యవసాయం తరువాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధి ఇస్తున్న వృత్తి చేనేత. నేతన్నల జీవితాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుత మైన మార్పుని పరిశీలించండి. దేశంలో ఎక్కడాలేని విధంగా గొల్ల, కురుమలకు వేలకోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ‘సబ్సిడీ గొర్రెల పంపిణీ’ పథకం, అదే విధంగా కోట్లకొద్దీ చేప పిల్లలను పంపిణి చేసి మత్స్యకారుల ఆదాయానికి తోడ్పడ్డ విషయం తెలుసుకోండి. అలాగే మీ పర్యటనలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ‘డబుల్ బెడ్ రూమ్’ ఇళ్ళని సందర్శించండి. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తున్న ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలు తెచ్చిన కల్యాణ కాంతులు చూడండి. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల గాథ గురించి చెప్పలంటే ఇంకా చాల విషయాలు ఉన్నాయి. మీ సీడబ్లు్యసీ సమావేశాల్లో తెలంగాణలో పదేళ్ళలో జరిగిన అభివృద్ధి దేశంలో అరవై ఏళ్లలో ఎందుకు జరగలేదో లోతుగా చర్చించండి. ఒక విశాల దృక్పథంతో ఆలో చించి, తెలంగాణ అభివృద్ధి సంక్షే మాన్ని మీ రాష్ట్రాలలో అమలు చేసి మీ ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించండి. ఇట్లు మీ శ్రవణ్ వ్యాసకర్త బీఆర్ఎస్ నాయకుడు -
CWC: ఐదు అంశాలే ఎజెండాగా కాంగ్రెస్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)’ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో శని, ఆదివారాల్లో జరగనున్న ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులంతా పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. శనివారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యులకు టీపీసీసీ విందు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ మొదలవుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఐదు కీలక అంశాలు ఎజెండాగా.. సీడబ్ల్యూసీ భేటీ ముగిసే మరునాటి నుంచే పార్లమెంటు ప్రత్యేక భేటీ జరుగుతుండటం, ఆ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెడుతుందన్న అంచనాల నేపథ్యంలో.. హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఏం చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. శని, ఆదివారాల్లో జరిగే ఈ సమావేశాల్లో ఐదు కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. ‘త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, భారత్ జోడో యాత్ర–2 నిర్వహణ, 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి’పై కాంగ్రెస్ కీలక నేతలు చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే సమయంలో దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతృత్వంలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కోవాల్సిన తీరు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ పార్టీలో జోష్ కోసం త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్‌లో జోష్ నింపడం, బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది. చదవండి: నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి తుమ్మల శుక్రవారమే చేరుకున్న 52 మంది సీడబ్ల్యూసీలోని సాధారణ సభ్యులతోపాటు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 84మంది సమావేశాలకు హాజరుకానున్నారు. శుక్రవారమే 52 మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్ చెన్నితాల, కొడుక్కునిల్ సురేశ్, శశిథరూర్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా, రాజీవ్‌శుక్లా, పవన్‌ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్ సింగ్ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభా సింగ్, మనీశ్ తివారీ, గౌరవ్ గొగోయ్, భక్తచరణ్‌దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్‌సింగ్, కుమారి షెల్జా తదితరులు ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, సిద్ధరామయ్య, భూపేశ్ భగేల్, మరికొందరు నేతలు శనివారం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ, విజయభేరి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచి్చన కాంగ్రెస్ జాతీయ నేతలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. బహిరంగ సభ.. నియోజకవర్గ పర్యటనలు సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాక 17న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో కాంగ్రెస్ ‘విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఆ సభా వేదికపై నుంచి కాంగ్రెస్ ఎన్నికల హామీలుగా గ్యారంటీ కార్డు స్కీంలను సోనియాగాంధీ ప్రకటించనున్నారు. ఇక ఈ నెల 18న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు జాతీయ స్థాయి నేతలు వెళ్లి.. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. బొట్టు పెట్టి.. మంగళ హారతి పట్టి.. సీడబ్ల్యూసీ, విజయభేరి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ నేతలకు టీపీసీసీ ఘనంగా స్వాగతం పలికింది. కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఇతర నేతలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి జాతీయ నేతలు తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకోగా.. మహిళా నేత కత్తి కార్తీకగౌడ్ వారందరికీ బొట్టు పెట్టి, మంగళ హారతి ఇచ్చి ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: డేంజర్ జోన్లో భారత్, తీవ్రవైన కరువు దేశంగా.. -
బాలికపై రెండేళ్లుగా స్వామీజీ అత్యాచారం!
(విశాఖ తూర్పు): అనాథ మైనర్ బాలికకు(15) అశ్రయం కల్పించిన నిర్వాహకుడే రెండేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన అసల్యంగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ వేల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గొలనుగొండకు చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో సమీపంలో ఉండే ఒక మహిళ బాలికను ప్రభుత్వ హాస్టల్లో ఉంచి చదివించేది. ఆ మహిళా అధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉండటంతో బాలికను గత రెండేళ్ల క్రితం విశాఖలోని వెంకోజీపాలెం జాతీయ రహదారిని ఆనుకొని జ్ఞానానంద, రామానంద ఆశ్రమం (సాధు మఠం) చేర్పించింది. ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామీజీ బాలికతో పాటు మరో 13 మంది మైనర్ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని ఏడవటంతో బాలిక కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు. ఈనెల 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో అక్కడ పనిచేసే ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయి ఆటోలో రైల్వేస్టేషన్ వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో విశాఖ నుంచి విజయవాడ వస్తున్న ఒక కుటుంబం బాలికను చూసి వివరాలు అడిగి తెలుసుకుంది. తమతో పాటు కంకిపాడు తీసుకువెళ్లి కొన్ని రోజులు వాళ్ల ఇంట్లోనే ఉంచి సోమవారం కంకిపాడు పోలీసుల సహకారంతో విజయవాడలోని సీడబ్ల్యూసీ సభ్యులకు అప్పగించింది. వారు బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికపై జరుగుతున్న వరుస లైంగిక దాడులు తెలుసుకుని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అశ్రమం పేరుతో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై బాలిక చేత దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. విజయవాడ పోలీసుల సమాచారం మేరకు ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆశ్రమానికి చేరుకొని కీచక స్వామీజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎంవీపీ సీఐ మాట్లాడుతూ విజయవాడలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైందని, దీంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. అయితే స్వామీజీని అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బాలిక మిస్సింగ్‌పై ఫిర్యాదు అసలు విషయాన్ని పక్కనపెట్టి సాధు ఆశ్రమం స్వామీజీ ఎంవీపీ పోలీసులను బోల్తాకొట్టించారు. ఏమీ తెలియనట్లు సాధు ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్లు ఈనెల 15న ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆశ్రమం వద్ద గల సీసీ కెమెరాలు పరిశీలించినా బాలిక వివరాలు తెలియరాలేదు. -
సీడబ్ల్యూసీకి కొత్త టీమ్! తెలంగాణ నుంచి ఒకరికి చాన్స్?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పునర్వ్యవస్థీకరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దృష్టి సారించారు. ఈ ఏడాది డిసెంబర్లోనే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండటం, మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవాల్సిన దృష్ట్యా సీడబ్ల్యూసీ నియామకాలను పూర్తి చేసే కసరత్తులో పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన పార్టీ మూడు రోజుల ప్లీనరీ సమావేశంలో, వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ నామినేట్ చేసేందుకు పార్టీ అధ్యక్షుడికే పూర్తి అధికారం ఇవ్వాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కుల, ప్రాంత, రిజర్వేషన్ల ప్రాతినిధ్యం ఆధారంగా సభ్యుల ఎంపికను మొదలుపెట్టినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్‌పూర్ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు సీడబ్ల్యూసీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, 50 ఏళ్లలోపు యువకులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో వీటి ఆధారంగా ఇప్పటికే కొన్ని పేర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ లిస్ట్‌పై చర్చలు చేసి నెలలోగా తుది ప్రకటన చేస్తారని సమాచారం. ఇక సీడబ్ల్యూసీలోకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది చివరన జరుగనున్న ఎన్నికల దృష్ట్యా తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ పార్టీలో అత్యున్నత పార్లమెంటరీ బోర్డుతో పాటు, కేంద్ర ఎన్నికల కమిటీలో సీనియర్ నేత కె.లక్ష్మణ్‌కు ఆ పార్టీ అవకాశం ఇచ్చింది. మరోపక్క పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగుతున్నారు.తెలంగాణ నేతలకు బీజేపీ ఇచ్చిన ప్రాధాన్యత మాదిరే రాష్ట్ర నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ సీడబ్ల్యూసీలో ప్రాధాన్యమిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ చోటు కల్పించాలని నిర్ణయిస్తే షార్ట్‌లిస్ట్‌లో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పదేళ్ల కింద తెలంగాణ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావు సీడబ్ల్యూసీలో సభ్యునిగా ఉండగా, ఆ తర్వాత రాష్ట్రం నుంచి కొత్త సభ్యుడిగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. -
ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..
అనంతపురం సెంట్రల్/చిలమత్తూరు: ఐదు నెలల ఉత్కంఠకు తెరపడింది. అనాథ శిశువుగా శిశుగృహకు చేరుకున్న చిన్నారి ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అసలేం జరిగిందంటే... సరిగ్గా ఐదునెలల క్రితం (జూన్ 7న) చిలమత్తూరులో ముళ్లపొదల మధ్యన నవజాత మగ శిశువు లభ్యమైంది. స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు వెంటనే స్పందించారు. శిశువును వెంటనే కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అనంతపురంలోని శిశుగృహకు చేర్చారు. ఉత్కంఠకు తెర పెనుకొండ నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన దంపతులు బతుకు తెరువు కోసం చిలమత్తూరుకు చేరుకున్నారు. అప్పటికే ఆమె నిండు గర్భిణి. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెకు ప్రసవమైంది. ఆ సమయంలో ఆమె మతిస్థిమితం లేక నవజాత శిశువును వదిలేసి ఇంటికి చేరుకుంది. అదే రోజు సాయంత్రం విషయం తెలుసుకున్న భర్త వెంటనే చిలమత్తూరు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే శిశువును శిశుగృహకు అప్పగించినట్లు పోలీసులు తెలపడంతో అనంతపురం చేరుకుని ఐసీడీఎస్ అధికారులను సంప్రదించాడు. అయితే తమ బిడ్డేననే ఆధారాలు చూపలేకపోవడంతో శిశువు అప్పగింతకు అధికారులు అంగీకరించలేదు. దీంతో తండ్రి జిల్లా న్యాయసేవాప్రాధికార సంస్థను ఆశ్రయించాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు శిశువుకు ఐసీడీఎస్ అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన నివేదిక గురువారం ఐసీడీఎస్ అధికారులకు అందింది. అందులో శిశువు తల్లిదండ్రులు వారేనని రుజువైంది. దీంతో తల్లిదండ్రులకు గురువారం సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రామలక్ష్మి సమక్షంలో ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి అప్పగించారు. శిశుగృహ సిబ్బందికి అభినందన తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన తరుణంలో ముళ్లపొదల మధ్య నుంచి నేరుగా తమ చెంతకు చేరుకున్న శిశువును శిశుగృహ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. దాదాపు ఐదు నెలల పాటు బిడ్డ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు తల్లిదండ్రులకు శిశువును అప్పగిస్తున్న తరుణంలో శిశుగృహ సిబ్బంది కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారిని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రామలక్ష్మీ, సభ్యులు ఓబుళపతి, కామేశ్వరి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ కృష్ణమాచారి తదితరులు అభినందించారు. తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శిశుగృహ మేనేజర్ శ్రీలక్ష్మీ, ఐసీపీఎస్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు వెంకటేశ్వరి, చంద్రకళ, చిలమత్తూరు పోలీసులు పాల్గొన్నారు. (చదవండి: వరద గుప్పిట్లో అనంతపురం) -
సీడబ్ల్యూసీ ఎదుట కరాటే కల్యాణి .. ‘అవమానించిన వారిని వదిలేది లేదు’
సాక్షి, హైదరాబాద్: అక్రమ దత్తత ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి కరాటే కల్యాణి బుధవారం యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాంగణంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయంలో చంటిబిడ్డతో సహా అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ అధికారులు ఆమెను ప్రశ్నించి సమాచారం రాబట్టారు. అనంతరం కరాటే కల్యాణి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా, ఎదుగుతున్న తనను కావాలని కొందరు అసత్య ఆరోపణలతో బయటకు లాగారన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. నిరాధార ఆరోపణలు చేసి తనను అవమానించిన వారిని వదిలేది లేదని, న్యాయపరంగా వారిపై పోరాడతానన్నారు. అధికారులు తన వాదనను నమ్మారని, తాను తప్పు చేయలేదని చెప్పడానికి అది చాలన్నారు. రెండు రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. ఇంతవరకు తాను చంటిబిడ్డను దత్తత తీసుకోలేదని, భవిష్యత్‌లో తీసుకుంటానా లేదా అనే విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నారు. చదవండి: ఓటీటీలో సామ్, నయన్‌ల మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? నిబంధనలు పాటించాల్సిందే.. పిల్లలను దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సీడబ్ల్యూసీ అధికారులు కరాటే కల్యాణికి స్పష్టం చేశారు. ఆమె వద్ద ఉన్న పాపను చిన్నారి తల్లి స్వప్నకు అప్పగించారు. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారైనందున భవిష్యత్‌లో దత్తత తీసుకోవాలంటే రంగారెడ్డి వెల్ఫేర్ అధికారులను సంప్రదించాలని స్పష్టం చేసినట్టు సమా చారం. ప్రస్తుతం కల్యాణి వద్ద ఉంటున్న 11 ఏళ్ల బాలుడికి సంబంధించిన తల్లిదండ్రుల వివరాలు కూడా సీడబ్ల్యూసీకి అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శైలజతో పాటు సభ్యులు లలిత, ప్రమోద తదితరులు పాల్గొన్నారు. -
చివరికి అనాథను చేశారు!
అభం శుభం తెలియని ఆ పాపను విధి వంచించింది. చిన్న వయసులోనే తనను కన్న తల్లిదండ్రులు కన్నుమూశారు. అల్లారు ముద్దుగా పెంచేవారు దూరమయ్యారనే బాధతో ఉన్న ఆ బాలికను నేనున్నానంటూ చిన్నాన్నా చేరదీశాడు. 12ఏళ్ల వరకు పెంచి పోషించారు. చదివించారు కూడా. కానీ నా అన్నవారు, చేరదీసిన వారు ప్రస్తుతం తమకు ఆర్థిక స్థోమత లేదని, పెంచి పోషించలేమంటూ దూరం చేసి చివరకు బాలికను అనాథను చేశారు. సోమవారం ఆ బాలికను వెంట తీసుకువచ్చి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించి వెల్లిపోయారు. తల్లి దండ్రులు లేని సమయంలో ఆదుకున్న వారు కూడా తనను ఇలా దూరం చేశారని పుట్టెడు దు:ఖంతో బాల సదనంలో చేరింది. ఇది చూసిన అధికారులు ఇంతటి కష్టం ఇంకెవ్వరికి ఇవ్వకు దేవుడా అంటూ వేడుకున్నారు. * 12 ఏళ్ల బాలిక ఐసీడీఎస్ అధికారులకు అప్పగింత * తల్లి దండ్రులు చనిపోవడంతో చిన్నాన్న వద్దే ఉండిపోయిన బాలిక * ప్రస్తుతం పెంచి పోషించే స్థోమత లేదని దూరం చేసుకున్న కుటుంబసభ్యులు ఇందూరు: ఆ బాలిక పేరు శ్రుతి. వర్ని మండల కేంద్రం వడ్డెపల్లికి చెందిన తన తల్లిదండ్రులు తన చిన్న తనంలోనే ప్రమాదవశాత్తు మరణించారు. ఒంటరిగా ఉన్న బాలికను తన చిన్నాన్నా చేరదీసి పెంచి పోషించాడు. తన సొంత కూతురు మాదిరిగా చూసుకున్నాడు. ఊళ్లోనే ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివించాడు. కానీ చిన్నాన్నా కుటుంబానికి రానురాను ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో తన కుటుంబాన్నే నడిపించడం కష్టంగా మారింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చేరదీసిన బాలికను దూరం చేసుకోలేక తప్పలేదు. తెలిసిన వారికి దత్తతన్వికుండా ఐసీడీఎస్ అధికారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వెల్లిన అధికారులు బాలికకు, చిన్నాన్నాకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామ పెద్దలతో,సర్పంచుతో మాట్లాడారు. బాలికను అప్పగిస్తున్నామని అంగీకారం తెలుపుతూ బాండ్ పేపర్‌పై చిన్నాన్నా, వారి కుటుంబ సభ్యుల, గ్రామ పెద్దల సంతకాలు తీసుకున్నారు. అయితే బాలికను తీసుకుని సోమవారం రోజు ఐసీడీఎస్ కార్యాలయాని రావాలని సూచించారు. బాలికతో వచ్చిన చిన్నాన్నా ఐసీడీఎస్ అధికారులకు బాలికను అప్పగించి వెళ్లాడు. స్వాధీనం చేసుకున్న అధికారులు సీడబ్ల్యూసీ కమిటీ ముందు బాలికను హాజరు పరిచి వసతికల్పన కోసం బాల సదనంకు తరలించారు. బాలికకు ఉచిత వసతితో పాటు విద్యను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తల్లి దండ్రులు చనిపోయారనే ఒక బాధ, ఆర్థిక స్థోమత లేక చిన్నాన్నా వాళ్లు కూడా చివరకు అనాథను చేశారనే మరో బాధతో సదరు బాలిక పట్టరాని దు:ఖంతో ఏడ్చింది. పాపం ఇన్ని రోజులు అందరితో కలిసిమెలిసి ఉండి నేడు అనాథలుండే భవనంలో ఒకరిగా చేరింది. ఊహ తెలిసిసోచ్చిన వయసులో బాలికకు నా అన్న వారు కూడా లేరంటే పాపం ఎంతగా బాధపడిందో చెప్పనక్కర్లేదు.