‘స్థానిక’ పోరు తప్పదు.. | 'Local' is fighting .. | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ పోరు తప్పదు..

Published Sat, Mar 15 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

'Local' is fighting ..

  •     విచారణ వాయిదాతో అనివార్యం
  •      17న యథావిధిగా ఎన్నికల నోటిఫికేషన్
  •      ఆర్‌ఓ, ఏఆర్‌ఓల నియామకం పూర్తి
  •      సామగ్రి పంపిణీలో జెడ్పీ సిబ్బంది బిజీ
  •   జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల పోరు తప్పేలా లేదు. స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ... విచారణను సుప్రీంకోర్టు ఈనెల 24వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో పోరు తప్పదని జిల్లా ఎన్నికల అధికారులు భావిస్తున్నా రు. ఈ మేరకు  ఎన్నికల నిర్వహణకు సం బంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు.

    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు ఈనెల 10వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) షెడ్యూల్‌ను జారీ చేసింది. అప్పటికే మునిసిపాలిటీ, ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ కూ డా విడుదలైంది. ఇప్పటివరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్, సాధారణ ఎన్నికలు ఒకేసారి వచ్చిన పరిస్థితులు లేవు.

    ఈఎన్నికలను నిర్వహించేందుకు సిబ్బందిని నియమించడం కష్టంగా ఉంటుందని భావించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్... రాజకీయ పార్టీలతోపాటు కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వార్షిక పరీక్షలు, సార్వత్రిక ఎన్నికల వల్ల జరిగే ఇబ్బందులను వారు ఎస్‌ఈసీకి విన్నవించారు. జిల్లాల వారీగా వచ్చిన నివేదికలను ఎస్‌ఈసీ సహాయ కమిషనర్ నవీన్‌మిట్టల్ శుక్రవారం సుప్రీంకోర్టుకు అందజేశారు. వివరాలను పరిశీలించిన సుప్రీం కోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేయడంతో ఎన్నికలు నిర్వహిం చక తప్పని పరిస్థితులు ఏర్పడ్డారుు.
     
    17న నోటిఫికేషన్
     
    స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసి న ప్రకారం ఈనెల 17వ తేదీన జిల్లా స్థారుు లో కలెక్టర్ స్థానికంగా నోటిఫికేషన్ జారీ చేయూలి. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది. సుప్రీం కోర్టు లో విచారణ చేపట్టనున్న 24వ తేదీ నాటికి బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఈమేరకు ఎన్నికలు నిర్వహించ క తప్పదని అధికారులు పేర్కొంటున్నారు.
     
    సామగ్రి పంపిణీలో యంత్రాంగం
     
    స్థానిక ఎన్నికలపై విచారణను  సుప్రీంకోర్టు 24వ తేదీకి వాయిదా వేయడం... ఎస్‌ఈసీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో జిల్లా పరిషత్ అధికారులు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే... ఎంపీడీఓలు, తహసీల్దా ర్లు ఒకేసారి రెండు బాధ్యతలు నిర్వర్తిం చాల్సి వస్తోంది. స్థానిక ఎన్నికలకు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు(ఏఆర్‌ఓ)గా పని చేస్తూనే సార్వత్రిక ఎన్నికలకు మోడల్ కోడ్ అధికారులుగా వ్యవహరించాల్సి రావడం వారికి ఇబ్బందిగా మారింది.

    ఈ నేపథ్యం లో  మోడల్ కోడ్ అమలు చేసే బాధ్యతను ఇతర శాఖలకు చెందిన అధికారులకు అప్పగించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.  క్రమంలో మండల కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు రిటర్నిం గ్, సహాయ రిటర్నింగ్ అధికారులుగా మండల ప్రత్యేక అధికారుల ను నియమించినట్లు తెలిసింది. నియూమకాలు దాదాపుగా పూర్తికా గా...  ఎన్నికల సామగ్రిని మండలాల వారీగా చేరవేసే పనుల్లో జెడ్పీ ఎన్నికల విభాగం సిబ్బంది నిమగ్నమయ్యూరు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement