సాక్షి, హైదరాబాద్ : విద్యార్ధులకు గల అనంతమైన అవకాశాలను వివరించేందుకు, సోమవారం మహీంద్రా ఇకోల్ సెంట్రల్ కళశాలలో మొదటి సెంట్రల్ కనెక్ట్ కాన్‌క్లేవ్‌ను నిర్వహించారు. ‘అనంతమైన అవకాశాల దిశగా’ అనే ట్యాగ్‌లైన్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ డా. సతీష్ రెడ్డి పాల్గొన్నారు. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా ఆవశ్యకతను వివరించారు. గత 40 సంవత్సరాలుగా భారత్ అంతరిక్ష పరిశోధనల్లో సాధించిన విజయాలు, అభివృద్ధిని విద్యార్థులకు వివరించారు.
కాలేజ్ డైరెక్టర్ యాజులు మేధూరి మాట్లాడుతూ.. గ్లోబలైజేషన్ ప్రభావం, విద్యార్థుల్లో సాహసవంతమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కల్పించడంపై చర్చించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. భారతదేశంలో గల ఉద్యోగ అవకాశాల గురించి వాటిని ఏ విధంగా విద్యార్థులు అందిపుచ్చుకోవాలి అనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment