సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండానే, తనకు లేని అధికారాలను విని యోగించుకుని కొన్ని కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్‌ఓసీ లు ఇచ్చారని వచ్చిన ఆరోపణలను ఆయన తోసి పుచ్చారు. ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్ అధికా రాన్ని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు కట్టబె డుతూ 2014 ఏప్రిల్ 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి న ఉత్తర్వుల ఆధారంగా ఎన్‌ఓసీలు జారీ చేశాన న్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు సమానమేనని, ఏ ఒక్క కళాశాలకూ అనుకూలంగా వ్యవహరించలేదన్నారు. తాము కేవలం ఎన్‌ఓసీలు మాత్రమే ఇస్తామని, కళాశాలల షిఫ్టింగ్‌కు ఏఐసీటీఈ అనుమతిస్తుందన్నారు.
తన అధికారాన్ని వినియోగించుకుని 5 ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్‌ఓసీలు జారీ చేశానని, మరో మూడు నాన్ టెక్నికల్ కళాశాలల షిఫ్టింగ్ ప్రతిపాద నలను ప్రభుత్వానికి పంపించానన్నారు. ఇంజనీ రింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్‌ఓసీలు ఇవ్వడం రొటీ న్ అంశమని, పెద్ద విషయం కాదన్నారు. ఇంజనీరిం గ్ కళాశాలల యాజమాన్యాల మధ్య విభేదాల కారణంగానే తనపై లేనిపోని విమర్శలు సృష్టించా రన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమతూకాన్ని కాపాడా లని, ఈ నేపథ్యంలో షిఫ్టింగ్‌ను ప్రోత్సహించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అన్నారు. ఈ నేపథ్యంలో 5 కళాశాలలకు జారీ చేసిన ఎన్‌ఓసీలను రద్దు చేశాన న్నారు. ఎన్‌ఓసీలు రద్దు చేసిన విషయాన్ని ఏఐసీటీ ఈకు సైతం తెలిపామన్నారు. ఇంజనీరింగ్ కళాశా లల షిఫ్టింగ్‌కు ఎన్‌ఓసీలు జారీ చేసే అధికా రాన్ని తన పరిధి నుంచి తొలగిస్తూ ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులకు, ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
నాన్‌ఎయిడెడ్‌గా మార్చలేదు
రాష్ట్రంలోని ఏ ఒక్క ఎయిడెడ్ కళాశాలను నాన్ ఎయిడెడ్ కళాశాలగా మార్చలేదని నవీన్ మిట్టల్ తెలిపారు. విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉన్న కోర్సులను, విద్యార్థులు ఉండి లెక్చరర్లు లేని కోర్సులను అన్ ఎయిడెడ్‌గా మార్చామన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో కొత్తగా నియామకాలు చేపట్టవద్దని 2005లో ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుందని, దాంతో పదోన్నతులు పొందిన వారి స్థానాలు, బదిలీలపై వెళ్లిన వారి పోస్టులు రద్దు అవుతున్నాయన్నారు. దీంతో ఎయిడెడ్ కళాశాలలు నడపడం ఆర్థికంగా సాధ్యం కావడం లేదన్నారు. దీంతో విద్యార్థులు లేని కోర్సులను అన్ ఎయిడెడ్‌గా మార్చి, ఒకరో, ఇద్దరో ఫ్యాకల్టీ ఉంటే వారిని ప్రభుత్వ కాలేజీల్లో బోధనకు ఉపయోగిస్తున్నామన్నారు.
ఎయిడెడ్ కళాశాలల్లో కోర్సులు రద్దు కావడం వల్ల కొన్ని కాలేజీలు ఆన్ ఎయిడెడ్ కోర్సులను నిర్వహిస్తున్నాయన్నారు. కోర్సుల రద్దు నిర్ణయం వల్ల జూన్ నుంచి మార్చి వరకు రూ.16.53 కోట్ల ప్రభుత్వ నిధులు ఆదా అయ్యాయన్నారు. ఎయిడెడ్ కళాశాలలకు ఉన్న భూములపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిట్లు తెలిపారు. ఈ కమిటీ ఈ నెల 30 వరకు అధ్యయనం జరిపి నివేదిక ఇస్తుందన్నారు. రాష్ట్రంలో సుమారు 65 వరకు ఎయిడెడ్ కళాశాలలున్నాయని, వాటిలో 5 కళాశాలలు పూర్తిగా మూతబడ్డాయన్నారు. మిగిలిన కళాశాలల్లో సైతం చాలా వరకు కోర్సులు సరిగ్గా నిర్వహించడం లేదన్నారు. కొన్ని ఎయిడెడ్ కళాశాలలకు ప్రభుత్వం భూమి కేటాయించిందని, మరి కొన్నింటికి భవన నిర్మాణం కోసం నిధులు, ఫ్యాకల్టీ నియామకం జరిపిందన్నారు. ఎయిడెడ్ కళాశాలల బోధన, బోధన సిబ్బందిని ప్రభుత్వ కళాశాలలకు సర్దుబాటు చేశామన్నారు.
జూన్‌లో రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్
జూన్‌లో రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని నవీన్ మిట్టల్ తెలిపారు. పాలిటెక్నిక్ సీట్ల భర్తీలో పదో తరగతి పాసైన విద్యార్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, మిగిలిన సీట్లను అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పాసైన విద్యార్థులకు కేటాయిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment