Technical Education Department
-
14 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈసెట్–2023 కౌన్సెలింగ్‌ను ఈ నెల 14 నుంచి ప్రారంభిస్తున్నట్టు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆమె కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసెట్‌లో అర్హత సాధించినవారు ఈ నెల 14 నుంచి 17 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సూచించారు. అనంతరం 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 19 నుంచి 21 వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుందన్నారు. 22న అభ్యర్థులు ఆప్షన్లను మార్చుకోవచ్చని తెలిపారు. 25న సీట్లు కేటాయిస్తామన్నారు. సీట్లు పొందినవారు 25 నుంచి 30లోగా ఆయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 14 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థులు ఈసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, పదో తరగతి మార్కుల సర్టిఫికెట్, పాలిటెక్నిక్ డిప్లొమా మార్కుల జాబితా, ప్రొవిజినల్ సర్టిఫికెట్, ఏడో తరగతి నుండి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2020 జనవరి 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, రిజర్వుడ్ అభ్యర్థులు.. అందుకు తగిన పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సిద్ధం చేసుకోవాలన్నారు. కాగా ఈ ఏడాది 38,181 మంది ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 34,503 మంది పరీక్ష రాశారన్నారు. ఇందులో 31,933 (92.55 శాతం) మంది అర్హత సాధించారని తెలిపారు. మరిన్ని వివరాలకు 7995681678, 7995865456, 9177927677 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు. -
పాలిటెక్నిక్ విద్యలో నవోదయం
ఈ చిత్రంలోని విద్యార్థి పేరు కె. తరుణ్. రావులపాలేనికి చెందిన ఓ రైతు కొడుకు. మూడేళ్ల క్రితం పాలిసెట్‌లో ర్యాంకు సాధించి కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్‌లో చేరాడు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో విప్రో కంపెనీలో రూ.3.50 లక్షల వేతనంతో ఉద్యోగంతో పాటు నాలుగేళ్ల సర్వీసు అనంతరం బిట్స్ పిలానీ నుంచి బీటెక్ డిగ్రీ ఇచ్చేందుకు కంపెనీ ఆఫర్ ఇచ్చింది. కానీ, ‘పదో తరగతిలో నా స్నేహితులు 10 మంది పాలిసెట్ రాశాం. నలుగురికి ర్యాంకులు వచ్చాయి. నేరు డిప్లొమాలో చేరితే మిగతా వారు ఇంటర్, తర్వాత ఇంజినీరింగ్‌లో చేరారు. వారింకా చదువుల్లో ఉంటే నేను 18 ఏళ్లకే మంచి ప్యాకేజీతో ఉద్యోగం అందుకున్నా. డిప్లొమా వదిలేసినందుకు వారిప్పుడు బాధపడుతున్నారు’.. అని తరుణ్ అంటున్నాడు. ఈ విద్యార్థి పేరు ప్రేమ్‌సాయి. ఊరు ప్రొద్దుటూరు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఇతను విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ డిప్లొమా కోర్సులో చేరాడు. ఇటీవల క్యాంపస్ ప్లేస్మెంట్లో రూ.6.25 లక్షల వేతనంతో మెట్సో ఒటోటెక్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కానీ, ఈయన సోదరి ఇంకా బీటెక్ మూడో ఏడాది చదువుతుండగానే ప్రేమ్‌సాయి ఉద్యోగం సాధించేశాడు. విశాఖపట్నానికి చెందిన పి. నవ్యశ్రీని ఆమె తల్లి చిరుద్యోగం చేస్తూ కుమార్తెను చదివించింది. భీమునిపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈసీఈ డిప్లొమా మూడో ఏడాది చదువుతోంది. రూ.4.06 లక్షల ప్యాకేజీతో స్క్లంబర్గర్ కంపెనీలో కొలువు సంపాదించింది. కంచరపాలేనికి చెందిన జి. గీతాభవాని తండ్రి ఓ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గీత విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పెట్రో కెమికల్స్‌లో డిప్లొమా చేసింది. ఇటీవల క్యాంపస్ ఎంపికల్లో రూ.4 లక్షల వేతనంతో అల్ట్రాటెక్ కంపెనీలో కొలువును సొంతం చేసుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు ఏడాదికి సగటున రూ.2.80 లక్షల వేతనంతో కొలువులతో పాటు, ఉన్నత విద్యావకాశాలు కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాంగణ ఎంపికల్లో మరో రెండు వేల మందికి పైగా ఉద్యోగాలు సాధిస్తారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి. నాగరాణి గర్వంగా చెబుతున్నారు. ఇదంతా గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, ప్రోత్సాహంతోనే సాధ్యమైందంటున్నారు. సాక్షి, అమరావతి: పదో తరగతి తర్వాత పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల గమ్యం మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు. చదువుతో పాటే క్యాంపస్ ప్లేస్మెంట్లలో రూ.లక్షల వేతనాలతో విద్యార్థులు ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు. 2022–23 బ్యాచ్‌కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు 4,000 మందికి పైగా ఇంకా పరీక్షలు పూర్తికాకుండానే మంచి వేతనాలతో క్యాంపస్ కొలువులను సొంతం చేసుకున్నారు. గరిష్టంగా రూ.6.25 లక్షలు, సరాసరి రూ.2.80 లక్షల వార్షిక వేతనాలతో బహుళజాతి సంస్థల్లో ఆఫర్ లెటర్లు అందుకున్నారు. ఇంటర్, ఇంజినీరింగ్ కోర్సులతో ఆరేళ్లు చదివి పూర్తిచేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే అందుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం 400 దాటని అవకాశాలు.. ఇçప్పుడు వేలమందికి అందడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంస్కరణల ప్రభావం ఎంతో ఉంది. దీంతోపాటు ఏపీ సాంకేతిక విద్యాశాఖ చూపిన చొరవతో డిప్లొమా బోధనలోను మార్పులు చేశారు. ప్రభుత్వ కాలేజీల్లోనే అధిక కొలువులు రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, 175 ప్రైవేటు, ఒక ఎయిడెడ్ కాలేజీ ఉన్నాయి. వీటిల్లో గత దశాబ్ద కాలంలో ఏనాడు కొలువులు 450 దాటలేదు. 2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652, 2021–22లో 780 ఉద్యోగాలు అందుకుంటే.. ఈసారి 2022–23లో ఒక్క ప్రభుత్వ కాలేజీ విద్యార్థులే 4,071 మంది ఉద్యోగాలు సాధించారు. మే చివరి వరకు కొనసాగే ఈ నియామక ప్రక్రియలో మరో రెండువేల మందికి పైగా అవకాశాలు పొందుతారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి. నాగరాణి ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లోని 24,667 మంది విద్యార్థుల్లో రెండువేల మంది విద్యార్థులు ఉద్యోగావకాశాలు దక్కించుకున్నారు. 31 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది స్కిల్ హబ్‌లను ఏర్పాటుచేయడంతో శిక్షణ పొందిన విద్యార్థులు సునాయాసంగా కొలువులను దక్కించుకున్నారు. అత్యధికంగా నంద్యాలలోని ఈఎస్సీ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి 352 మంది, విజయవాడ పాలిటెక్నిక్ నుంచి 277 మంది, కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ నుంచి 224 మంది, అనంతపురం పాలిటెక్నిక్ నుంచి 215 మంది, విశాఖపట్నం (నేషనల్ హైవే) పాలిటెక్నిక్ నుంచి 174 మంది ఎంపికయ్యారు. ఉద్యోగంతో పాటు ఉన్నత చదువులు గతంలో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటే సీనియారిటీ ప్రకారం వేతనాలు పెరిగే పరిస్థితి. ఈ ఏడాది నుంచి సాంకేతిక విద్యాశాఖ చేసిన కృషితో చాలా కంపెనీలు డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు ఉన్నత చదువులు చదివేందుకూ అవకాశం కల్పించాయి. వాటిల్లో ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్, విప్రో, స్మార్ట్ డీవీ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, టాటా ప్రాజెక్ట్స్, షాపూర్జీ–పల్లోంజీ, జేఎస్‌డబ్ల్యూ, అల్ట్రాటెక్, మెట్సో ఉటోటెక్ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఉండడం గమనార్హం. ఉద్యోగాల్లో చేరిన వారికి నాలుగేళ్లల్లో ‘వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ (వైల్) ద్వారా బీఎస్సీ, బీటెక్ డిగ్రీ ఇచ్చేలా ఆయా కంపెనీలు అంగీకరించాయి. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులు చదువులో భాగంగా చేసే 6 నెలలు, ఏడాది ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌లోనే నూరు శాతం ఉద్యోగాలు లభించేలా శిక్షణనివ్వనుంది. ప్రతి కాలేజీలోనూ ప్లేస్మెంట్ సెల్ ఇంజినీరింగ్ చేస్తేనే అవకాశాలు ఉంటాయన్నది అపోహే. ఈ ఏడాది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 11,604 మంది విద్యార్థులు చివరి సంవత్సరం చదువుతుంటే వారిలో 4 వేల మందికి పైగా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. కమిషనర్ నాగరాణి ఆయా పరిశ్రమలను స్వయంగా పరిశీలించి ఒప్పందం చేసుకున్నారు. అన్ని కాలేజీల్లోను ప్లేస్మెంట్ సెల్ ఏర్పాటుచేసి కేంద్ర కార్యాలయంతో అనుసంధానించారు. ఫైనలియర్‌లోనే క్యాంపస్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. – డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ (ప్లేస్మెంట్ సెల్) ఇండస్ట్రియల్–అకడమిక్ సౌజన్యంతో.. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యా బోధనలో మార్పులు చేస్తున్నాం. 31 జీపీటీల్లో స్కిల్ హబ్స్‌ను ఏర్పాటుచేశాం. రాష్ట్రానికి బహుళజాతి కంపెనీలూ వస్తున్నాయి. వాటికి అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిస్తున్నాం. ఆ కంపెనీలే క్యాంపస్‌కు వచ్చి ఉద్యోగాలిస్తున్నాయి. అలాగే, మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నాం. ఈ ఏడాది మొదటి విడతగా 84 మంది ప్రొఫెసర్లను ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కు పంపించాం. చాలామంది విద్యార్థులు డిప్లొమా తర్వాత బీఎస్సీ, బీటెక్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి కంపెనీలో ఉద్యోగం ఇస్తూనే నాలుగేళ్లల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇచ్చేలా యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది నూరుశాతం ప్లేస్‌మెంట్స్‌కు ప్రణాళిక సిద్ధంచేశాం. – సి. నాగరాణి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ -
అటు మూత.. ఇటు కోత
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏటా కనీసం 50కిపైగా ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. మరికొన్ని వేల సంఖ్యలో కోర్సులను రద్దు చేసుకుంటున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు ఏర్పాటు కావడం, కొన్ని కోర్సులకే ఆదరణ ఉండటం, చేరికలు తగ్గి కాలేజీల నిర్వహణ భారంగా మారడం, నైపుణ్యాలు కొరవడి ప్లేస్మెంట్లు తగ్గిపోవడం ఈ దుస్థితికి కారణమని నిపుణుల కమిటీలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల కమిటీల సూచనల మేరకు ఏఐసీటీఈ 2019లో కొత్త కాలేజీలకు అనుమతులపై మారటోరియం విధించింది. 2014–15 నుంచి జాతీయస్థాయిలో 767 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడినట్లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి 2021–22 నివేదికలో వెల్లడించింది. మరికొన్ని కాలేజీలు ఆదరణ లేకపోవడంతో 10,539 కోర్సులను రద్దు చేసుకున్నాయి. 2021–22 నాటికి దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక కోర్సుల్లో 24 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014–15లో మొత్తం సీట్ల సంఖ్య 31.8 లక్షలు కాగా తరువాత నుంచి ఏటా తగ్గుతూ వస్తోంది. ఏడెనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో సగం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇదీ జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సుల పరిస్థితి నేడు రాష్ట్రంలో వెన్నుతట్టి ప్రోత్సాహం విద్యారంగ సంస్కరణలు చేపట్టి ఉన్నత చదువులు ఏమాత్రం భారం కాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు అయ్యే మొత్తం ఫీజును జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతి త్రైమాసికంలో నిర్దిష్టంగా చెల్లిస్తూ చదువులకు భరోసా కల్పిస్తోంది. అంతేకాకుండా వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున విద్యార్థులకు అందజేస్తోంది. మరోవైపు గత సర్కారు బకాయిపెట్టిన ఫీజులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 తరువాత రాష్ట్రం నుంచి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా మూసివేత కోసం దరఖాస్తు చేయలేదని ఏఐసీటీఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. ► అన్ని కాలేజీల్లో నిబంధనల ప్రకారం సదుపాయాలు, బోధనా సిబ్బంది, న్యాక్ అక్రిడిటేషన్ తప్పనిసరి. ► సిలబస్‌లో సంస్కరణలు. కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి. ► ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. స్కిల్ ఆధారంగా 30 శాతం కోర్సులకు రూపకల్పన. ► మైక్రోసాఫ్ట్ ద్వారా 1.62 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధిపై ఉచిత శిక్షణ. ► నాస్కామ్, ఏపీఎస్ఎస్డీసీ సంస్థల ద్వారా యువతకు శిక్షణ కార్యక్రమాలు. ► 2018–19లో రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య 37 వేలు కాగా 2019–20లో 52 వేలకు, 2020–21లో 69 వేలకు, 2021–22లో 85 వేలకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనేందుకు నిదర్శనం. నాడు 65 కాలేజీల మూసివేత టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 65 కాలేజీల యాజమాన్యాలు తమ విద్యా సంస్థలను మూసివేసినట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత సర్కారు విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కొరవడి అధ్వానంగా మారింది. కాలేజీల ఫీజు ఎంత ఉన్నా రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తామనడం, అరకొర ఫీజులు కూడా ఏటా సక్రమంగా ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ విద్య అస్తవ్యస్థమైంది. 2019లో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి కాలేజీలకు రూ.1,800 కోట్ల మేర ఫీజులు బకాయి పెట్టడం గమనార్హం. దీంతో మూసివేత దిశగా విద్యాసంస్థలు సాగాయి. ► పుట్టగొడుగుల్లా వెలిసిన కాలేజీల్లో ఏఐసీటీఈ / ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రకారం మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది ఉండడం లేదు. ధనార్జనే ధ్యేయంగా మొక్కుబడిగా నిర్వహించడంతో ప్రమాణాలు పడిపోయి విద్యార్థులకు నైపుణ్యాలు కొరవడ్డాయి. ఫలితంగా ప్లేస్మెంట్లు సన్నగిల్లాయి. చదువులు ముగియగానే ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారింది. అదనపు నైపుణ్యాలు, సర్టిఫికేషన్ కోర్సులను కూడా పూర్తి చేస్తే కానీ ఉద్యోగాలు దక్కడం లేదు. ► ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ నిరంతరం కొత్త అంశాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో నైపుణ్యాలను సాధించిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. పలు కాలేజీల్లో కోర్సులు, బోధనా వనరులు, సదుపాయాలు లేవు. వరుసగా మూడేళ్లు 25 శాతం కన్నా చేరికలు తక్కువగా ఉండే కాలేజీలు, కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు రద్దు చేస్తోంది. ► ఇండియా స్కిల్ నివేదిక ప్రకారం ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారిలో 48శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. -
మనీతోనే 'మేనేజ్మెంట్'
ఎంసెట్‌లో 10 వేలకుపైగా ర్యాంకు వచ్చిన విద్యార్థి సీఎస్ఈ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కోర్సును రెండో శ్రేణి టాప్ కాలేజీలో చదవాలనుకున్నాడు. తండ్రితో కలిసి సదరు కాలేజీ ప్రిన్సిపాల్‌ను కలిశాడు. ఫీజు రూ.12 లక్షలు చెప్పారు. యాజమాన్యాన్ని కలుద్దామంటే అందుబాటులోకి రాలేదు. చివరకు చెప్పిన డొనేషన్ చెల్లించి ఆ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో చేరాడు. వాస్తవానికి ఆ కాలేజీ వార్షిక ఫీజు రూ.1.20 లక్షలే ఉంది. అయినా రూ.12 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి వార్షిక ఫీజు అదనం. మరో విద్యార్థినికి 25 వేలకుపైగా ర్యాంకు వచ్చింది. తన స్నేహితులు చేరిన కాలేజీలోనే తానూ చేరతానని పట్టుబట్టింది. ఆమె తండ్రి సదరు కాలేజీని సంప్రదించారు. అక్కడ వార్షిక ఫీజు రూ.90 వేలలోపే ఉండగా, యాజమాన్యం మాత్రం ఏటా రూ.2.50 లక్షలు చెల్లించాలని తెగేసి చెప్పింది. అంటే ఆ కాలేజీలో చేరాలంటే డొనేషన్ కింద రూ.6 లక్షలకుపైగా చెల్లించాలి. వార్షిక ఫీజు అదనం. వాస్తవానికి నాలుగేళ్లకు రూ.3.6 లక్షలతో పూర్తి కావాల్సిన కోర్సుకు రూ.10 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. –సాక్షి, హైదరాబాద్ ఈ ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులే కాదు.. యాజమాన్య కోటాలో సీటు కోసం ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులదీ ఇదే పరిస్థితి. తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థుల ఆకాంక్షలను అడ్డుపెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా భర్తీలో దందాకు తెరతీశాయి. డొనేషన్ల పేరుతో అడ్డగోలుగా దండుకుంటున్నాయి. సీట్ల భర్తీలో పెద్ద కాలేజీలు ఒకలా, చిన్న కాలేజీలు మరోలా ఫ2‘జులుం’ సాగిస్తున్నాయి. టాప్ కాలేజీలు ఒక్కో సీటుకు లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. కొద్ది పేరున్న కాలేజీలో సీటు కావాలంటే రూ.6 లక్షలు మొదలుకొని రూ.14 లక్షల వరకు వెచి్చంచాల్సి వస్తోంది. ప్రముఖ కాలేజీలైతే గతేడాది కంటే ఈసారి మరింత అడ్డగోలుగా రేట్లను పెంచేశాయి. మంచి ర్యాంకు రాని విద్యార్థుల తల్లిదండ్రులు.. పిల్లలను మంచి కాలేజీల్లో చదివించాలన్న ఆలోచనతో అప్పుచేసి మరీ అడిగిన మొత్తం చెల్లిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆయా కాలేజీలకు చెందిన కార్యాలయాల్లో డబ్బులు చెల్లిస్తేనే సీట్లను కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆలస్యం చేస్తే ఫీజు మరింత పెరగొచ్చంటూ తల్లిదండ్రులను ఆందోళనలో పడేస్తున్నారు. కాలేజీని బట్టి వసూళ్లు రాష్ట్రంలోని 176 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 97,741 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చాయి. అందులో 70 శాతం కనీ్వనర్ కోటాలో 69,116 సీట్ల (యూనివర్సిటీ కాలేజీల్లోని 3,150 సీట్లు కలిపి) భర్తీకి చర్యలు చేపట్టగా, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా కింద 30 శాతం సీట్ల (28,625) భర్తీకి యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. అయితే మేనేజ్మెంట్ కోటా సీట్లలో చేరే విద్యార్థులు పేరున్న కాలేజీలనే ఎంచుకుంటారు కాబట్టి వాటికే డిమాండ్ ఉండటంతో ఇష్టారాజ్యంగా యాజమాన్యాలు డొనేషన్లను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మోస్తరు కాలేజీలోనూ కంప్యూటర్ సైన్స్ సీటుకు రూ.10 లక్షల డొనేషన్ డిమాండ్ చేస్తుండగా, టాప్ కాలేజీల్లో రూ.14 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కొత్తగా వచి్చన ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మిషన్ లర్నింగ్, డాటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు భారీగా రేట్లను పెంచి సీట్లను అమ్ముకుంటున్నారు. ఐటీ, ఈసీఈ వంటి బ్రాంచీల్లోని సీట్లను కూడా కాలేజీని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు, ఈఈఈ, సివిల్‌తో పాటు ఇతర బ్రాంచీల్లో రూ.2 లక్షలు మొదలుకొని రూ.6 లక్షల వరకు వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత విద్యామండలి చోద్యం యాజమాన్య కోటా సీట్ల భర్తీలో భాగంగా మెరిట్ విద్యార్థులకు సీట్లు వచ్చేలా చూసేందుకు కాలేజీకి వచ్చిన దరఖాస్తులను వెబ్సైట్లో పెట్టడటంతోపాటు ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా ఉన్నత విద్యామండలి దరఖాస్తులను స్వీకరించాలి. వాటిని ఆయా కాలేజీలకు పంపించి మెరిట్ కలిగిన వారికి సీట్లు వచ్చేలా చూడాలి. కానీ ఉన్నత విద్యామండలి పట్టించుకున్న దాఖలాల్లేవు. కనీసం సాంకేతిక విద్యాశాఖ కూడా దీనిపై దృష్టిసారించట్లేదు. దీంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లను అమ్ముకుంటున్నాయి. మెరిట్‌కు స్థానమేదీ? వాస్తవానికి మేనేజ్మెంట్ కోటాలోని 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా భర్తీచేయాలి. మిగిలిన 15 శాతాన్ని ఎన్ఆర్ఐలకు, వారు స్పాన్సర్ చేసిన వారికివ్వాలి. మొద టి 15 శాతం సీట్లను మాత్రం మెరిట్ ఆధారంగానే ఇవ్వాలి. ఒకవేళ దరఖాస్తు చేసిన వారిలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, వారూ లేకుంటే ఇంటర్ మార్కుల ఆధారంగా ఇవ్వాలి. వచ్చిన దరఖాస్తులను కాలేజీ వెబ్సైట్లో పెట్టాలి. కానీ అది అమలు కావట్లేదు. ఏటా ఇదే పరిస్థితి ఉంటున్నా సాంకేతిక విద్యాశాఖ, ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పట్టించుకోవట్లేదు. -
ఎంసెట్ దరఖాస్తులోనే 'ఈడబ్ల్యూఎస్ కోటా' కాలమ్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ సహా పలు సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ల కల్పన ప్రక్రియను వాటి ప్రవేశ దరఖాస్తు స్థాయి నుంచే అమల్లోకి తేవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సోమవారం ఉన్నత విద్యామండలిలో వివిధ సెట్ల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎంసెట్, ఈసెట్‌లపై చర్చించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ రామ్మోహనరావు, ప్రొఫెసర్ లక్ష్మమ్మ, ఎంసెట్, ఈసెట్‌ల చైర్మన్లు ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు, ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాసకుమార్, సెట్ల కన్వీనర్లు, ప్రొఫెసర్ రవీంద్ర, ప్రొఫెసర్ భానుమూర్తి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఎంఎం నాయక్, మండలి కార్యదర్శి ప్రేమ్‌కుమార్, సెట్ల ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో కూడా అమల్లోకి తెస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. గతేడాది ఎంసెట్ తర్వాత ఈ రిజర్వేషన్లు రావడంతో దరఖాస్తులో దాని గురించి ప్రస్తావించలేదు. సీట్ల కేటాయింపు సమయంలో కొంతమేరకు అవకాశం కల్పించారు. ఈసారి దరఖాస్తులోనే ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అభ్యర్థుల నుంచి సమాచారం తీసుకునేలా కొన్ని కాలమ్‌లను పెట్టాలని నిర్ణయించారు. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 24న విడుదల చేసి 26 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నారు. ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే ఈసెట్‌లో ఇక నుంచి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌ను కూడా చేర్చనున్నారు. నిర్వహణ సంస్థలకు చెల్లింపు మొత్తాల కుదింపు ఎంసెట్ తదితర పరీక్షలకు సంబంధించి ఆయా నిర్వహణ సంస్థలకు గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా రుసుములు చెల్లించారు. ఈసారి వాటిని బాగా కుదించారు. గతంలో ఎంసెట్‌కు సంబంధించి ఒక్కో విద్యార్థికి రూ.305 చొప్పున సాఫ్ట్వేర్ సంస్థకు చెల్లించారు. ఈసారి దాన్ని రూ.287కు తగ్గించారు. అలాగే సాఫ్ట్వేర్ సంస్థ.. ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు గేట్‌వే ఛార్జీల కింద ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 చొప్పున వసూలు చేసేది. ఈసారి దాన్ని కూడా తగ్గించాలని.. గేట్‌వే సేవల కోసం ఆయా బ్యాంకులు ఎంత మొత్తంలో రుసుములు వసూలు చేస్తున్నాయో ఆ మేరకు మాత్రమే ఫీజులు తీసుకోవాలని సాఫ్ట్వేర్ సంస్థకు స్పష్టం చేశారు. వివిధ సెట్ల పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది వరకు హాజరవుతారు. ఈ తగ్గింపు వల్ల అటు మండలిపైనా, ఇటు విద్యార్థులపైనా భారం తగ్గుతుంది. -
పరిమితి దాటి అనుమతించొద్దు
సాక్షి, అమరావతి: ఆ కాలేజీలో 240 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులున్నారు.. కానీ కంప్యూటర్లు మాత్రం 50 లోపే! ఇదేకాదు.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొన్ని కాలేజీలు విద్యార్థులు ఎక్కువగా చేరే కోర్సులకు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే.. విద్యార్థుల చేరికలకు, సెక్షన్ల పెంపునకు అనుగుణంగా ల్యాబ్‌లు, కంప్యూటర్లు ఉండటం లేదు. 10 నుంచి 20 మంది విద్యార్థులకు ఓ కంప్యూటర్ను అమర్చి మమ అనిపిస్తున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి అఖిల భారత సాంకేతిక విద్యామండలి నుంచి అనుమతులు తెచ్చుకుంటున్న కాలేజీలు ఆమేరకు సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. అవన్నీ అంతో ఇంతో పేరున్న కాలేజీలు కావడంతో విద్యార్థులు వాటివైపు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. మరోపక్క కన్వీనర్ కోటా కింద కూడా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ భారీగా పొందుతున్నాయి. చివరకు అక్కడ చేరిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ప్రమాణాలూ పతనమవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి అమ్మకానికి సీట్లు ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ ఇటీవల పలు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఇలాంటి పలు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఏఐసీటీఈ, వర్సిటీల్లో పైరవీలు జరిపి కొన్ని యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. మరోవైపు ఇతర కాలేజీల్లో ఆయా కోర్సుల సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో 32 విభాగాలకు సంబంధించిన కోర్సులున్నాయి. వీటిలో 70 శాతం కన్వీనర్ కోటా కింద 1,06,203 సీట్లు ఉండగా 60,315 సీట్లు భర్తీ అయ్యాయి. 45,888 సీట్లు మిగిలాయి. భర్తీ అయిన సీట్లన్నీ సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ సివిల్ వంటి ముఖ్యమైన విభాగాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ సీట్లను కూడా కొన్ని కాలేజీల్లోనే అదనపు సెక్షన్ల పేరిట భర్తీ చేస్తున్నారు. ఇక మేనేజ్మెంట్ కోటాలోని 30 శాతం సీట్లను కూడా డిమాండ్‌ను బట్టి అమ్మకానికి పెడుతున్నారు. దెబ్బతింటున్న ప్రమాణాలు.. సరైన ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేని కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సెక్షన్లకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు మాత్రమే అదనపు సెక్షన్లకు అనుమతించాలని, పరిమితికి మించి మంజూరు చేయవద్దని ఏఐసీటీఈని కోరాలని కమిషన్ భావిస్తోంది. -
షిఫ్టింగ్‌లో అవకతవకలు లేవు
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండానే, తనకు లేని అధికారాలను విని యోగించుకుని కొన్ని కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీ లు ఇచ్చారని వచ్చిన ఆరోపణలను ఆయన తోసి పుచ్చారు. ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్ అధికా రాన్ని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు కట్టబె డుతూ 2014 ఏప్రిల్ 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి న ఉత్తర్వుల ఆధారంగా ఎన్ఓసీలు జారీ చేశాన న్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు సమానమేనని, ఏ ఒక్క కళాశాలకూ అనుకూలంగా వ్యవహరించలేదన్నారు. తాము కేవలం ఎన్ఓసీలు మాత్రమే ఇస్తామని, కళాశాలల షిఫ్టింగ్‌కు ఏఐసీటీఈ అనుమతిస్తుందన్నారు. తన అధికారాన్ని వినియోగించుకుని 5 ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీలు జారీ చేశానని, మరో మూడు నాన్ టెక్నికల్ కళాశాలల షిఫ్టింగ్ ప్రతిపాద నలను ప్రభుత్వానికి పంపించానన్నారు. ఇంజనీ రింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీలు ఇవ్వడం రొటీ న్ అంశమని, పెద్ద విషయం కాదన్నారు. ఇంజనీరిం గ్ కళాశాలల యాజమాన్యాల మధ్య విభేదాల కారణంగానే తనపై లేనిపోని విమర్శలు సృష్టించా రన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమతూకాన్ని కాపాడా లని, ఈ నేపథ్యంలో షిఫ్టింగ్‌ను ప్రోత్సహించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అన్నారు. ఈ నేపథ్యంలో 5 కళాశాలలకు జారీ చేసిన ఎన్ఓసీలను రద్దు చేశాన న్నారు. ఎన్ఓసీలు రద్దు చేసిన విషయాన్ని ఏఐసీటీ ఈకు సైతం తెలిపామన్నారు. ఇంజనీరింగ్ కళాశా లల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీలు జారీ చేసే అధికా రాన్ని తన పరిధి నుంచి తొలగిస్తూ ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులకు, ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. నాన్ఎయిడెడ్గా మార్చలేదు రాష్ట్రంలోని ఏ ఒక్క ఎయిడెడ్ కళాశాలను నాన్ ఎయిడెడ్ కళాశాలగా మార్చలేదని నవీన్ మిట్టల్ తెలిపారు. విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉన్న కోర్సులను, విద్యార్థులు ఉండి లెక్చరర్లు లేని కోర్సులను అన్ ఎయిడెడ్‌గా మార్చామన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో కొత్తగా నియామకాలు చేపట్టవద్దని 2005లో ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుందని, దాంతో పదోన్నతులు పొందిన వారి స్థానాలు, బదిలీలపై వెళ్లిన వారి పోస్టులు రద్దు అవుతున్నాయన్నారు. దీంతో ఎయిడెడ్ కళాశాలలు నడపడం ఆర్థికంగా సాధ్యం కావడం లేదన్నారు. దీంతో విద్యార్థులు లేని కోర్సులను అన్ ఎయిడెడ్‌గా మార్చి, ఒకరో, ఇద్దరో ఫ్యాకల్టీ ఉంటే వారిని ప్రభుత్వ కాలేజీల్లో బోధనకు ఉపయోగిస్తున్నామన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో కోర్సులు రద్దు కావడం వల్ల కొన్ని కాలేజీలు ఆన్ ఎయిడెడ్ కోర్సులను నిర్వహిస్తున్నాయన్నారు. కోర్సుల రద్దు నిర్ణయం వల్ల జూన్ నుంచి మార్చి వరకు రూ.16.53 కోట్ల ప్రభుత్వ నిధులు ఆదా అయ్యాయన్నారు. ఎయిడెడ్ కళాశాలలకు ఉన్న భూములపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిట్లు తెలిపారు. ఈ కమిటీ ఈ నెల 30 వరకు అధ్యయనం జరిపి నివేదిక ఇస్తుందన్నారు. రాష్ట్రంలో సుమారు 65 వరకు ఎయిడెడ్ కళాశాలలున్నాయని, వాటిలో 5 కళాశాలలు పూర్తిగా మూతబడ్డాయన్నారు. మిగిలిన కళాశాలల్లో సైతం చాలా వరకు కోర్సులు సరిగ్గా నిర్వహించడం లేదన్నారు. కొన్ని ఎయిడెడ్ కళాశాలలకు ప్రభుత్వం భూమి కేటాయించిందని, మరి కొన్నింటికి భవన నిర్మాణం కోసం నిధులు, ఫ్యాకల్టీ నియామకం జరిపిందన్నారు. ఎయిడెడ్ కళాశాలల బోధన, బోధన సిబ్బందిని ప్రభుత్వ కళాశాలలకు సర్దుబాటు చేశామన్నారు. జూన్‌లో రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్ జూన్‌లో రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని నవీన్ మిట్టల్ తెలిపారు. పాలిటెక్నిక్ సీట్ల భర్తీలో పదో తరగతి పాసైన విద్యార్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, మిగిలిన సీట్లను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పాసైన విద్యార్థులకు కేటాయిస్తామన్నారు. -
రేపటి నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ (జీఎఫ్‌టీఐ)ల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ పరీక్షలను ఆన్లైన్లో ప్రతిరోజూ రెండు షిఫ్ట్‌లుగా నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 263 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9.65 లక్షల మంది హాజరుకానుండగా అందులో తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఏటా ఒకసారి చొప్పున జేఈఈ మెయిన్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించగా 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎన్టీఏ ఏటా రెండుసార్లు పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెలలో మొదటి విడత పరీక్షను నిర్వహిస్తోంది. రెండో విడత పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ నెల 31న ఫలితాలు... కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రం మార్పు ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పుడు సమాచారం ఇచ్చినా, ఒక షిఫ్ట్‌కు బదులు రెండు షిఫ్ట్‌లలో లేదా వేర్వేరు రోజుల్లో రెండుస్లారు పరీక్ష పరీక్ష రాసినా వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని, వారి ఫలితాలను పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని, ఆ తర్వాత వచ్చే విద్యార్థులను అనుమతించబోమని పేర్కొంది. పరీక్ష ఫలితాలను ఈ నెల 31న వెల్లడించనున్నట్లు తెలిపింది. -
ఇక పాలి‘టెక్’లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 198 ఉంటే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు 14 మాత్రమే ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో లక్షకు పైగా సీట్లు ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 3 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు అవసరమని సాంకేతిక విద్యా శాఖ భావిస్తోంది. తగిన మౌలిక సదుపాయాలు, భవనాలు కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఆ దిశగా ప్రభుత్వంతో చర్చించి, తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం వెల్లడించారు. ప్రభుత్వ స్థాయిలో దీనిపై చర్చ జరిగాకే నిర్ణయాలు ఉంటాయని ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యం లోని ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టడం ద్వారా మరింత మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవచ్చని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఏయే పాలిటెక్నిక్ కాలేజీలు అనువుగా ఉంటాయన్న అంశంపై అధికారులతో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఉపాధి అవకాశాలు పెంచేలా.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడంతోపాటు విద్యావకాశాలను పెంపొందించేందుకు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 2018–19లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం నుంచే ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసేందుకు నిర్ణయించింది. పరిశ్రమలతో అనుసంధానం చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాల నుంచి విద్యార్థులకు ఆఫర్లు వచ్చేలా చేయడంతోపా టు ఇంటర్న్‌షిప్ ద్వారా పరిశ్రమల్లో ఎక్కువ కాలం పని చేస్తే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచవచ్చన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ఆరు నెలలకుపైగా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేయనుంది. మొదటి సంవత్సరం అయ్యాక వేసవి సెలవుల్లో 6 నుంచి 8 వారాలు, ద్వితీయ సంవత్సరం పూర్తయ్యాక వేసవి సెలవుల్లో 6 నుంచి 8 వారాలు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులు చివరి సెమిస్టర్ మొత్తం (దాదాపు 110 రోజులు) ఇంటర్న్‌షిప్ చేసేలా చర్యలు చేపట్టింది. చివరి సెమిస్టర్ ఇంటర్న్‌షిప్‌ను ఆప్షనల్‌గా అమలు చేయాలని నిర్ణయించింది. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్.. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయ్యాక ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాలనుకునే వారు (ఈసెట్ రాసి ల్యాటరల్ ఎంట్రీ ద్వారా) కాలేజీలో చదువుకుంటూనే ప్రాజెక్టు వర్క్ చేసేలా ఆప్షన్ ఇచ్చింది. పాలిటెక్నిక్ తర్వాత ఉపాధి అవకాశాలు వెతుక్కునే విద్యార్థులు చివరి సెమిస్టర్ మొత్తం పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తద్వారా విద్యార్థులకు ఆయా కంపెనీల్లో ఉపాధి లభించే అవకాశం ఉంటుందని నవీన్ మిట్టల్ వెల్లడించారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం, తృతీయ సంవత్సరం చదివే విద్యార్థుల నుంచి ఇంటర్న్‌షిప్ చేసే అంశంపై ముందుగానే ఆప్షన్ తీసుకోవాలని కాలేజీలను ఆదేశించారు. మరోవైపు కొత్త సిలబస్ ప్రకారం ఇంజనీరింగ్‌లోనూ ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్.. డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్ తెచ్చినట్లు నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. దీన్ని అన్ని కాలేజీలు అమలు చేయడం లేదని, విద్యార్థులకు ఆప్షన్‌గా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎంపిక చేసిన కోర్సుల్లో ఇంట ర్న్షిప్ను తప్పనిసరి చేసే అవకాశం ఉందని చెప్పా రు. ప్రస్తుతం డిగ్రీ ప్రథమ, ద్వితీయ ఏడాదిలో 2 క్రెడిట్ల చొప్పున ఇంటర్న్‌షిప్ చేసే వారికి 4 క్రెడిట్లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
రేపే ఇంజనీరింగ్ ప్రవేశాల నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు వేగవం తం చేసింది. శుక్రవారం(18న) ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు జేఎన్టీయూహెచ్ చర్యలు చేపట్టింది. దీంతో ఈ నెల 26 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని భావిస్తోంది. 26 నుంచి సాధ్యం కాకపోతే 28 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ గురువారం సమావేశమవ్వాలని నిర్ణయించింది. ఆ సమావేశానికి జేఎన్టీయూహెచ్ అధికారులు కూడా హాజరుకానున్నారు. ఎక్కువ శాతం ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు జేఎన్టీయూహెచ్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనుబంధ గుర్తింపునకు సంబంధించి జేఎన్టీయూహెచ్ ఇచ్చే సమాచారాన్ని బట్టి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ షురూ! జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించింది. బుధవారం సాయంత్రం వరకు దాదాపు 110 కాలేజీలకు గుర్తింపును జారీ చేసినట్లు తెలిపింది. -
రాష్ట్రంలో పంజాబ్ బృందం పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక విద్యా సంస్థల నియంత్రణపై అధ్యయనానికి పంజాబ్ సాంకేతిక విద్యా శాఖ మంత్రి చరణ్‌జీత్ సింగ్, అధికారుల బృందం రాష్ట్రానికొచ్చింది. ఉన్నత విద్యా మండలి, ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ, యూనివర్సిటీల వైస్‌చాన్స్‌లర్లతో గురువారం హైదరాబాద్‌లో సమావేశమైంది. రాష్ట్రంలో ప్రైవేటు సాంకేతిక విద్యా సంస్థల నియంత్రణకు చేపడుతున్న చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో విద్యా విధానం బాగుందని, ఇక్కడి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుందని కితాబిచ్చారు. తమ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 8 విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ రంగంలో 23 యూనివర్సిటీలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలోని యూనివర్సిటీలు పూర్తిగా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయని, అక్కడ ఎలాంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయట్లేదని చెప్పారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి చాలామంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని, దీంతో తమ రాష్ట్రంలో 20 శాతం పాఠశాలలను మూసేసినట్లు చెప్పారు. తెలంగాణలో పక్కాగా నియంత్రణ ఈ సందర్భంగా కడియం శ్రీహరి రాష్ట్రంలో పరిస్థితులను ఆ బృందానికి వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రైవేటు కాలేజీలపై పక్కాగా నియంత్రణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుకు బయోమెట్రిక్ అమలు చేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ పరీక్షలు రాయాలంటే విద్యార్థులకు కచ్చితంగా 75 శాతం హాజరు శాతం ఉండాలనే నిబంధన విధించామని, మొదటి సంవత్సరంలో కనీసం 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణత పొందితేనే రెండో సంవత్సరానికి అనుమతినిస్తున్నట్లు చెప్పారు. ఫీజు లను నియంత్రించేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఉందన్నారు. ఏటా రాష్ట్రం నుంచి వివిధ జాతీయ స్థాయి సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా అడ్మిషన్లు పొందే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. బృందంలో ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి. వజ్రలింగం, ఎస్.కె సందు, కార్యదర్శి వికాస్ ప్రతాప్ ఉన్నారు. -
తొలి దశలో 165 మంది
- దశలవారీగా పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ - 165 మందికి ఈ నెల 11న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలే జీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీ కరణకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే క్రమబద్ధీకరణ ఫైలును ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. మరోవైపు క్లియర్ వేకెన్సీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఈ నెల 11న సాంకేతిక విద్యా కమిషనర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సాంకేతిక విద్యా కమిషనర్ ఓఎస్డీ, హైదరాబాద్ ఆర్జేడీ, సంబంధిత ఏడీలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కమిటీని ఏర్పాటు చేసింది. క్రమబద్ధీకరణను దశల వారీగా చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 457 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తుండగా, మొదటి దశలో క్లియర్ వేకెన్సీల్లో పనిచేస్తున్న 165 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణను చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆ 165 మంది కాంట్రాక్టు లెక్చరర్ల జాబితాను పంపించింది. మిగతా పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేసి, ఉత్తర్వులు జారీ చేశాక మిగిలిన వారిని క్రమబద్ధీకరించాలని భావిస్తోంది. మరోవైపు జహీరాబాద్, వనపర్తి, మాసబ్‌ట్యాంకు, రామంతాపూర్, బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేస్తున్న వారిలో ఐదుగురు కాంట్రాక్టు లెక్చరర్లు స్థానికేతరులుగా గుర్తించింది. వారి నియామకం ఓపెన్ కోటాలో జరిగితే దానిని పరిగణనలోకి తీసుకొని క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టనుంది. -
సాంకేతిక విద్యా శాఖలో పదోన్నతులకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖలో పదోన్నతులకు సంబంధించిన కమిటీని పున ర్నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి, రెండో స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతులు, నియామకాల అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీ కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది. సాంకేతిక విద్యా శాఖ డైరక్టర్/ కమిషనర్, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ డైరక్టర్/కమిషనర్, ఉన్నత విద్యా శాఖ (సాంకేతిక విద్య) ప్రత్యేక కార్యదర్శితో ఈ కమిటీని ప్రభుత్వం పునర్నియమించింది. -
ఎడ్యుకేషన్ రిజల్ట్స్
నేడు పాలీసెట్ ఫలితాలు హైదరాబాద్: పాలీసెట్-2014 ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ అజయ్‌జైన్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఈ ఫలితాలను ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ, జ్ట్టిఞ://ఛ్ట్ఛ్చీఞ.జీఛి.జీ, జ్ట్టిఞ://టఛ్ట్ఛ్ట్చఞ.జౌఠి.జీ, జ్ట్టిఞట://్చఞఛ్ఛ్ఛిఞ.జీఛి.జీ వెబ్సైట్లలో పొందవచ్చు. నేడు ఓపెన్ ఎస్సెస్సీ ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన ఎస్సెస్సీ ఫలితాలను శనివారం ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నట్లు సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వరశర్మ తెలిపారు. ఫలితాలను ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ, ఠీఠీఠీ.్చఞౌఞ్ఛటఛిజిౌౌ. ౌటజ వెబ్సైట్లలో పొందవచ్చు. జూన్ 15న డైట్ సెట్, 5 నుంచి హాల్‌టికెట్లు హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్)లో ప్రవేశాల కోసం జూన్ 15న డైట్‌సెట్(డీఈఈసెట్-2014) నిర్వహించనున్నట్లు కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు 3,75,512 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పరీక్ష జూన్ 15వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. జూన్ 5 నుంచి హాల్‌టికెట్లను తమ వెబ్సైట్ నుంచి (జ్ట్టిఞ://ఛీజ్ఛ్టీఛ్ఛ్టి.ఛిజజ.జౌఠి.జీ) డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సమస్యలు తలెత్తితే 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలోని డీఈఈసెట్ విభాగంలో సంప్రదించాలని సూచించారు. మీడియం తప్పుగా రాసినవారు 7680894735 నంబరులో సంప్రదించాలని కోరారు. ప్రవేశాల మార్గదర్శకాల మార్పులు వచ్చే విద్యా సంవత్సరంలో... ఇదిలాఉండగా డీఎడ్‌లో ప్రవేశాలకోసం ప్రభుత్వం గురువారం జారీ చేసిన మార్గదర్శకాలు వచ్చే విద్యాసంవత్సరంలో అమల్లోకి వస్తాయని సురేందర్‌రెడ్డి తెలిపారు. ఏపీఆర్డీసీ ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదే శ్ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఏపీఆర్డీసీ కన్వీనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సాధించిన మార్కులు, ర్యాంకు వివరాలను ఠీఠీఠీ.్చఞట్జఛీఛి.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఏపీఆర్జేసీ ప్రవేశాలను కూడా 6వ తేదీ వరకు పొందవచ్చన్నారు. 31 రాత్రి ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు బ్రేక్ సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకోసం ఏపీ ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియకు రాష్ట్ర విభజన నేపథ్యంలో మే 31, జూన్ 1వ తేదీల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బ్రేక్ ఉంటుందని ఆర్జీయూకేటీ తెలిపింది. ఈ నెల 21న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటివరకు 19,308 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 16 వరకు గడువు ఉంది. ఓయూ వెబ్సైట్లో సెమిస్టర్ పరీక్షా తేదీలు హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ నెల 29న తెలంగాణ బంద్ సందర్భంగా వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షలను, సెమిస్టర్ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. పూర్తి వివరాలకు ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ అనే వెబ్సైట్ చూడవచ్చు. జూన్ 23న ఎడ్‌సెట్ ఫలితాలు విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన ఎడ్‌సెట్ 2014 పరీక్షకు 89.8 శాతం మంది హాజరైనట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు తెలిపారు. మొత్తం పరీక్షకు 1,66,167 మంది దరఖాస్తు చేయగా 1,49,026 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పారు పరీక్ష ఫలితాలను జూన్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణాదిలో టాప్ వర్సిటీ హెచ్‌సీయూ హైదరాబాద్, న్యూస్‌లైన్: దక్షిణ భారత విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో సైతం ఈ యూనివర్సిటీ నాల్గవ స్థానంలో నిలిచింది. ద వీక్, హన్సా సంస్థలు సంయుక్తంగా దేశంలోని యాభై విశ్వవిద్యాలయాలపై సర్వే నిర్వహించాయి. సౌకర్యాలు, అధ్యాపకులు, పరిశోధనలు, ఇతర అంశాల ఆధారంగా ఎంపిక జరిగింది.