నేడు పాలీసెట్ ఫలితాలు
హైదరాబాద్: పాలీసెట్-2014 ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ అజయ్‌జైన్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఈ ఫలితాలను ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ, జ్ట్టిఞ://ఛ్ట్ఛ్చీఞ.జీఛి.జీ, జ్ట్టిఞ://టఛ్ట్ఛ్ట్చఞ.జౌఠి.జీ, జ్ట్టిఞట://్చఞఛ్ఛ్ఛిఞ.జీఛి.జీ వెబ్‌సైట్‌లలో పొందవచ్చు.
నేడు ఓపెన్ ఎస్సెస్సీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన ఎస్సెస్సీ ఫలితాలను శనివారం ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నట్లు సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వరశర్మ తెలిపారు. ఫలితాలను ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ, ఠీఠీఠీ.్చఞౌఞ్ఛటఛిజిౌౌ. ౌటజ వెబ్‌సైట్‌లలో పొందవచ్చు.
జూన్ 15న డైట్ సెట్, 5 నుంచి హాల్‌టికెట్లు
హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్)లో ప్రవేశాల కోసం జూన్ 15న డైట్‌సెట్(డీఈఈసెట్-2014) నిర్వహించనున్నట్లు కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు 3,75,512 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పరీక్ష జూన్ 15వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. జూన్ 5 నుంచి హాల్‌టికెట్లను తమ వెబ్‌సైట్ నుంచి (జ్ట్టిఞ://ఛీజ్ఛ్టీఛ్ఛ్టి.ఛిజజ.జౌఠి.జీ) డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సమస్యలు తలెత్తితే 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలోని డీఈఈసెట్ విభాగంలో సంప్రదించాలని సూచించారు. మీడియం తప్పుగా రాసినవారు 7680894735 నంబరులో సంప్రదించాలని కోరారు.
ప్రవేశాల మార్గదర్శకాల మార్పులు వచ్చే విద్యా సంవత్సరంలో...
ఇదిలాఉండగా డీఎడ్‌లో ప్రవేశాలకోసం ప్రభుత్వం గురువారం జారీ చేసిన మార్గదర్శకాలు వచ్చే విద్యాసంవత్సరంలో అమల్లోకి వస్తాయని సురేందర్‌రెడ్డి తెలిపారు.
ఏపీఆర్‌డీసీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదే శ్ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఏపీఆర్‌డీసీ కన్వీనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సాధించిన మార్కులు, ర్యాంకు వివరాలను ఠీఠీఠీ.్చఞట్జఛీఛి.ఛిజజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఏపీఆర్‌జేసీ ప్రవేశాలను కూడా 6వ తేదీ వరకు పొందవచ్చన్నారు.
31 రాత్రి ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకోసం ఏపీ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియకు రాష్ట్ర విభజన నేపథ్యంలో మే 31, జూన్ 1వ తేదీల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బ్రేక్ ఉంటుందని ఆర్‌జీయూకేటీ తెలిపింది. ఈ నెల 21న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటివరకు 19,308 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 16 వరకు గడువు ఉంది.
ఓయూ వెబ్‌సైట్‌లో సెమిస్టర్ పరీక్షా తేదీలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ నెల 29న తెలంగాణ బంద్ సందర్భంగా వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షలను, సెమిస్టర్ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. పూర్తి వివరాలకు ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ అనే వెబ్‌సైట్ చూడవచ్చు.
జూన్ 23న ఎడ్‌సెట్ ఫలితాలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన ఎడ్‌సెట్ 2014 పరీక్షకు 89.8 శాతం మంది హాజరైనట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు తెలిపారు. మొత్తం పరీక్షకు 1,66,167 మంది దరఖాస్తు చేయగా 1,49,026 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పారు పరీక్ష ఫలితాలను జూన్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దక్షిణాదిలో టాప్ వర్సిటీ హెచ్‌సీయూ
హైదరాబాద్, న్యూస్‌లైన్: దక్షిణ భారత విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో సైతం ఈ యూనివర్సిటీ నాల్గవ స్థానంలో నిలిచింది. ద వీక్, హన్సా సంస్థలు సంయుక్తంగా దేశంలోని యాభై విశ్వవిద్యాలయాలపై సర్వే నిర్వహించాయి. సౌకర్యాలు, అధ్యాపకులు, పరిశోధనలు, ఇతర అంశాల ఆధారంగా ఎంపిక జరిగింది.
ఎడ్యుకేషన్ రిజల్ట్స్
Published Sat, May 31 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement
Advertisement