Ajayjain
-
పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: 19 మంది అఖిల భారత సర్వీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా అజయ్ జైన్ కొనసాగుతారు. ఇప్పటి వరకూ గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిన అనంతరామును సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్‌కు(ఐఆర్ఏఎస్) చెందిన ఎం.మధుసూదన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్న కాంతిలాల్ దండే (ఫుడ్ ప్రాసెసింగ్, చక్కెర) పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. పరిశ్రమల శాఖ కమిషనర్‌గా ఎవరినీ నియమించకుండా తాత్కాలికంగా అంతర్గత ఏర్పాట్లు చేసుకోవాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. -
ఏఏఐకి భోగాపురం ఎయిర్పోర్ట్
30.2 శాతం రెవెన్యూ షేర్ ఇస్తానన్నందుకే.. సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించ తలపెట్టిన ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల ఫైనాన్షియల్ బిడ్ ఖరారైంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ టెండర్‌ను దక్కించుకున్నట్టు ఏపీ మౌలిక వసతుల విభాగం ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసిన సంస్థకే దాని వాణిజ్య కార్యాకలాపాలపై సర్వాధికారాలుంటాయి. అయితే, వచ్చే ఆదాయంలో ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఈ పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ 30.2 శాతం, జీఎంఆర్ ఇన్ఫ్రా 21.6 శాతం రెవెన్యూ షేర్ ఇవ్వటానికి ముందుకొచ్చాయి. అత్యధికంగా వాటా ఇచ్చేందుకు సిద్ధపడిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకే ఈ పనులు అప్పగించాలని నిర్ణయించారు. -
వాణిజ్య స్థలం 150 గజాలకు పెంపు
రాజధాని రైతులకు అదనంగా స్థలం కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు కేటాయించాల్సిన వాణిజ్య స్థలం మరో 150 గజాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద పట్టా భూములిచ్చిన వారికి ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 300 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని అప్పట్లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనిని తాజాగా సవరించారు. నివాస స్థలానికి గతంలో ఉన్నట్టే ఎకరాకు వెయ్యి గజాలు, వాణిజ్య స్థలానికి మాత్రం 450 గజాలు కేటాయించారు. -
సీఆర్డీఏకు కొత్త సభ్యుల నియామకం
హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ)కి మరికొంత మంది నిపుణులను నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నలుగురు నిపుణులను నియమిస్తున్నట్లు సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారిని ఎంపిక చేసి గత కొన్ని రోజుల కిందటే సీఆర్డీఏ కమిషనర్ నివేదిక ఇచ్చారని, ఈ నివేదిక ఆధారంగా నిపుణులను ఎంపిక చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిపుణులలో డా.కేశవ్ వర్మ (ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్, న్యూఢిల్లీ), వీకే పాఠక్ (టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మాజీ చీఫ్, ఎంఎంఆర్డీఏ), క్రిస్టోఫర్ చార్లెస్ బెన్నింగెర్ (ఆర్కిటెక్ట్, పూణె), ఎస్ఎల్ డొంగ్రే (ప్రొఫెసర్, ఐఐటీ ముంబై)లు ఉన్నారు. వీళ్లందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న సీఆర్డీఏ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. -
మరో 3 రోజుల్లో విశాఖకు 80% విద్యుత్తు
-
మరో 3 రోజుల్లో విశాఖకు 80% విద్యుత్తు
ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ సీతమ్మధార(విశాఖపట్నం)/విజయనగరం: హుదూద్ తుపాను ధాటికి దారుణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను అతి త్వరలో సాధారణ స్థితికి తెచ్చేందుకు విద్యుత్‌శాఖ యుద్ధప్రాతిపదికన కృషి చేస్తున్నట్టు ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ వెల్లడించారు. మరో మూడు రోజుల్లో విశాఖ నగర ప్రజలకు 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖపట్నం, విజయనగరంలలో విలేకరులతో మాట్లాడారు. మొత్తంమీద విద్యుత్ శాఖకు రూ.1,200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. 74 విద్యుత్ టవర్లు తుపాను ధాటికి కుప్పకూలిపోయాయన్నారు. 440 కేవీ టవర్స్ 34, 220 కేవీ టవర్స్ 20, 132 కేవీ టవర్స్ మరో 20 ధ్వంసమయ్యాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 25వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయన్నారు. వీటిలో విజయనగరం జిల్లాలో 8 వేలు, విశాఖ జిల్లాలో 15 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 2వేలు స్తంభాలు కూలిపోయాయన్నారు. కాగా ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. విశాఖ నగరానికి సంబంధించి ఏడులక్షల మంది వినియోగదారులకుగానూ.. ఇప్పటి వరకు రెండులక్షల 70 వేల మందికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు చెప్పారు. సహాయక చర్యల్లో కష్టించి పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక ఇన్సెంటివ్లతోపాటు పదోన్నతుల్లో ప్రాధాన్యమిస్తామని తెలిపారు. -
ఎడ్యుకేషన్ రిజల్ట్స్
నేడు పాలీసెట్ ఫలితాలు హైదరాబాద్: పాలీసెట్-2014 ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ అజయ్‌జైన్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఈ ఫలితాలను ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ, జ్ట్టిఞ://ఛ్ట్ఛ్చీఞ.జీఛి.జీ, జ్ట్టిఞ://టఛ్ట్ఛ్ట్చఞ.జౌఠి.జీ, జ్ట్టిఞట://్చఞఛ్ఛ్ఛిఞ.జీఛి.జీ వెబ్సైట్లలో పొందవచ్చు. నేడు ఓపెన్ ఎస్సెస్సీ ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన ఎస్సెస్సీ ఫలితాలను శనివారం ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నట్లు సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వరశర్మ తెలిపారు. ఫలితాలను ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ, ఠీఠీఠీ.్చఞౌఞ్ఛటఛిజిౌౌ. ౌటజ వెబ్సైట్లలో పొందవచ్చు. జూన్ 15న డైట్ సెట్, 5 నుంచి హాల్‌టికెట్లు హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్)లో ప్రవేశాల కోసం జూన్ 15న డైట్‌సెట్(డీఈఈసెట్-2014) నిర్వహించనున్నట్లు కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు 3,75,512 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పరీక్ష జూన్ 15వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. జూన్ 5 నుంచి హాల్‌టికెట్లను తమ వెబ్సైట్ నుంచి (జ్ట్టిఞ://ఛీజ్ఛ్టీఛ్ఛ్టి.ఛిజజ.జౌఠి.జీ) డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సమస్యలు తలెత్తితే 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలోని డీఈఈసెట్ విభాగంలో సంప్రదించాలని సూచించారు. మీడియం తప్పుగా రాసినవారు 7680894735 నంబరులో సంప్రదించాలని కోరారు. ప్రవేశాల మార్గదర్శకాల మార్పులు వచ్చే విద్యా సంవత్సరంలో... ఇదిలాఉండగా డీఎడ్‌లో ప్రవేశాలకోసం ప్రభుత్వం గురువారం జారీ చేసిన మార్గదర్శకాలు వచ్చే విద్యాసంవత్సరంలో అమల్లోకి వస్తాయని సురేందర్‌రెడ్డి తెలిపారు. ఏపీఆర్డీసీ ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదే శ్ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఏపీఆర్డీసీ కన్వీనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సాధించిన మార్కులు, ర్యాంకు వివరాలను ఠీఠీఠీ.్చఞట్జఛీఛి.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఏపీఆర్జేసీ ప్రవేశాలను కూడా 6వ తేదీ వరకు పొందవచ్చన్నారు. 31 రాత్రి ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు బ్రేక్ సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకోసం ఏపీ ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియకు రాష్ట్ర విభజన నేపథ్యంలో మే 31, జూన్ 1వ తేదీల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బ్రేక్ ఉంటుందని ఆర్జీయూకేటీ తెలిపింది. ఈ నెల 21న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటివరకు 19,308 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 16 వరకు గడువు ఉంది. ఓయూ వెబ్సైట్లో సెమిస్టర్ పరీక్షా తేదీలు హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ నెల 29న తెలంగాణ బంద్ సందర్భంగా వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షలను, సెమిస్టర్ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. పూర్తి వివరాలకు ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ అనే వెబ్సైట్ చూడవచ్చు. జూన్ 23న ఎడ్‌సెట్ ఫలితాలు విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన ఎడ్‌సెట్ 2014 పరీక్షకు 89.8 శాతం మంది హాజరైనట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు తెలిపారు. మొత్తం పరీక్షకు 1,66,167 మంది దరఖాస్తు చేయగా 1,49,026 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పారు పరీక్ష ఫలితాలను జూన్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణాదిలో టాప్ వర్సిటీ హెచ్‌సీయూ హైదరాబాద్, న్యూస్‌లైన్: దక్షిణ భారత విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో సైతం ఈ యూనివర్సిటీ నాల్గవ స్థానంలో నిలిచింది. ద వీక్, హన్సా సంస్థలు సంయుక్తంగా దేశంలోని యాభై విశ్వవిద్యాలయాలపై సర్వే నిర్వహించాయి. సౌకర్యాలు, అధ్యాపకులు, పరిశోధనలు, ఇతర అంశాల ఆధారంగా ఎంపిక జరిగింది.