రాజధాని రైతులకు అదనంగా స్థలం కేటాయిస్తూ సీఆర్‌డీఏ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు కేటాయించాల్సిన వాణిజ్య స్థలం మరో 150 గజాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద పట్టా భూములిచ్చిన వారికి ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 300 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని అప్పట్లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనిని తాజాగా సవరించారు. నివాస స్థలానికి గతంలో ఉన్నట్టే ఎకరాకు వెయ్యి గజాలు, వాణిజ్య స్థలానికి మాత్రం 450 గజాలు కేటాయించారు.
వాణిజ్య స్థలం 150 గజాలకు పెంపు
Published Tue, May 31 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement