
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు వేగవం తం చేసింది. శుక్రవారం(18న) ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు జేఎన్‌టీయూహెచ్ చర్యలు చేపట్టింది. దీంతో ఈ నెల 26 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని భావిస్తోంది. 26 నుంచి సాధ్యం కాకపోతే 28 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ మేరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ గురువారం సమావేశమవ్వాలని నిర్ణయించింది. ఆ సమావేశానికి జేఎన్‌టీయూహెచ్ అధికారులు కూడా హాజరుకానున్నారు. ఎక్కువ శాతం ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు జేఎన్‌టీయూహెచ్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనుబంధ గుర్తింపునకు సంబంధించి జేఎన్‌టీయూహెచ్ ఇచ్చే సమాచారాన్ని బట్టి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
అనుబంధ గుర్తింపు ప్రక్రియ షురూ!
జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించింది. బుధవారం సాయంత్రం వరకు దాదాపు 110 కాలేజీలకు గుర్తింపును జారీ చేసినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment