ఢిల్లీలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి..! | suspected deaths in delhi.. women related to AP | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి..!

Published Wed, Dec 16 2015 9:55 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

ఢిల్లీలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి..! - Sakshi

ఢిల్లీలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి..!

సాక్షి, న్యూఢిల్లీ: ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన దేశ రాజధానిలోని నోయిడా 49వ సెక్టార్ సర్ఫాబాద్‌లో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో ఇరువురి మృతదేహాలను మంగళవారం రాత్రి పోలీసులు కనుగొన్నారు. స్నానాలగదిలో నగ్నంగా పడి ఉన్న మృతదేహాలను ఒడిశాకు చెందిన నవీన్‌కుమార్ (32), ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఎట్టెడ గ్రామానికి చెందిన దాక్షాయణి (30)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలు.. దాక్షాయణికి రేవన్న అనే వ్యక్తితో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. ఉద్యోగరిత్యా వీరు బెంగళూరులో స్థిరపడ్డారు.

వీరికి మహేశ్ (5), మౌనిక (3) సంతానం. బెంగుళూరులో ఉంటున్న సమయంలో ఇంటిపక్కనే ఉంటున్న నవీన్ అనే వ్యక్తితో దాక్షాయణికి పరిచయం ఏర్పడింది. పరిచయం ఆతర్వాత ప్రేమగా మారింది. బెంగుళూరు నుంచి మకాం మార్చిన నవీన్ నోయిడాలోని ఓ ప్రై వేటు కంపెనీలో చేరాడు. సర్ఫాబాద్ గ్రామంలో అద్దె ఇళ్లు తీసుకున్నాడు. కాగా రెండు నెలల కిందట పుట్టింటికి (చిత్తూరు) వెళ్తున్నట్టు భర్త రేవన్నకు చెప్పిన దాక్షాయణి ఇద్దరు పిల్లలను తీసుకుని నోయిడాకు వచ్చింది. సర్ఫాబాద్ చేరుకున్న ఆమె నవీన్‌తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి స్నానాలగదిలో ఇద్దరి మృతదేహాలు పడిఉన్నాయి. ఇంటికి, స్నానాలగదిలోకి లోపల నుంచి గడి పెట్టి ఉంది. పిల్లలు వేరు గదిలో నిద్రిస్తున్నారు.

సోమవారం ఉదయం లేచిన పిల్లలు తల్లి కనిపించకపోవడంతో స్కూల్‌కు వెళ్లలేదు. ఫీజు కూడా కట్టాల్సి ఉండడంతో పిల్లలు గైర్హాజరవడంపై టీచరు ఓ విద్యార్థిని నవీన్ ఇంటికి పంపారు. తల్లి బాత్‌రూంకు వెళ్లి తిరిగిరాలేదని దాక్షాయని కుమారుడు మహేశ్ చెప్పడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నానాలగది తలుపుపగలగొట్టగా ఇరువురి మృతదేహాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్యా? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది పోస్టుమార్టం తర్వాతే తేలుతుందని పోలీసులు పేర్కొన్నారు. దాక్షాయనిని హత్యచేసి ఆ తర్వాత నవీన్ ఆత్మహత్యచేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement