dakshayani
-
Geetha Madhuri: సింగర్ గీతామాధురి కూతురు... ఎంత పెద్దదైంది, దిష్టితగిలేను! (ఫోటోలు)
-
Alla Dakshayani: దిద్దుబాటు
జీవితంలో దిద్దుబాటు చాలా అవసరం. అక్షరాలను దిద్దుకుంటాం. నడవడిక దిద్దుకుంటాం. మాటను దిద్దుకుంటాం... చేతను దిద్దుకుంటాం. ఇన్నింటిని దిద్దుకోవడం వచ్చిన వాళ్లం... చెదిరిన రూపురేఖల్ని దిద్దుకోలేమా? కాంతి రేఖల కొత్త పొద్దుల్ని చూడలేమా? సూర్యుడు కర్కాటకం నుంచి మకరానికి మారినట్లే... క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలేట్తో పుట్టిన పిల్లలు కూడా మామూలు పిల్లల్లా బతికి బట్టకట్టాలి కదా! అగ్నిప్రమాదానికి గురైన వాళ్లు ముడతలు పడిన చర్మంతో బతుకు సాగించాల్సిన దుస్థితి ఎందుకు? ప్రమాదవశాత్తూ ఎముకలు విరిగి ముఖం రూపురేఖలు మారిపోతే... ఇక జీవితమంతా అద్దంలో ముఖం చూసుకోవడానికి భయపడాల్సిందేనా? వీటన్నింటికీ వైద్యరంగం పరిష్కరిస్తుంది. అయితే ఆ వైద్యం సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంటుంది. ఖర్చుపరంగా ఆకాశమంత ఎత్తులో ఉన్న వైద్యప్రక్రియను అవనికి దించాలంటే పెద్ద మనసు ఉండాలి. అలాంటి సమష్టి కృషిని సమన్వయం చేస్తున్నారు ఆళ్ల దాక్షాయణి. బాధితుల జీవితాల్లో కాంతిరేఖలను ప్రసరింపచేయడానికి ఏటా జనవరి నెలలో ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహిన్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘ఒకప్పుడు గ్రహణం మొర్రి కేసుల గురించి తరచూ వినేవాళ్లం. కాలక్రమేణా సమాజంలో చైతన్యం పెరిగింది. గర్భస్థ దశలోనే గుర్తించి, పుట్టిన వెంటనే సర్జరీలు చేసి సరి చేసుకునే విధంగా వైద్యరంగం కూడా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ మారుమూల గ్రామాల్లో గ్రహణం మొర్రి బాధితులున్నారు. వాళ్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే స్థోమత లేని తల్లిదండ్రులు పిల్లల వైకల్యాన్ని సరిచేయలేకపోతున్నారు. ఒక బిడ్డ ఆర్థిక కారణాలతో వైకల్యాన్ని భరించాల్సిన దుస్థితి రావడం దారుణమైన విషయం. అలాగే ఇటీవల అగ్ని ప్రమాద బాధితులు, యాసిడ్ దాడి బాధితులు కూడా పెరుగుతున్నారు. వీటికితోడు వాహన ప్రమాదాల కారణంగా వైకల్యాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్లు బయటపడగలుగుతున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని వాళ్లు బాధితులుగా మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ బాధ్యత చేపట్టాం. నిజానికి ఈ సర్వీస్ మొదలై ఇరవై ఏళ్లు దాటింది. ► ఇద్దరు వైద్యుల చొరవ రెండు వేల సంవత్సరంలో మొదలైన ఈ కార్యక్రమం కోవిడ్ రెండేళ్లు మినహా ఏటా జరుగుతోంది. డాక్టర్ భవానీ ప్రసాద్ అనస్థీషియనిస్ట్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి ప్లాస్టిక్ సర్జన్. వీళ్ల ఆలోచనతోనే ఈ సర్వీస్ మొదలైంది. మొదటి ఏడాది హైదరాబాద్‌లోని మహావీర్, మెడ్విన్ హాస్పిటళ్లలో సర్జరీలు నిర్వహించారు. ఆ తర్వాత కిమ్స్, కామినేని హాస్పిటళ్లు సపోర్టు చేశాయి. నార్కెట్ పల్లి, నిజామాబాద్, శ్రీకాకుళంలో క్యాంపులు నిర్వహించారు. గత ఏడాది హైదరాబాద్, సీతారామ్‌బాగ్‌లో డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్‌ను వేదిక చేసుకున్నాం. ఇందుకోసం హాస్పిటల్ వాళ్లు రెండు ఆపరేషన్ థియేటర్లతో హాస్పిటల్‌ను సిద్ధం చేశారు. యూఎస్‌లో స్థిరపడిన ఈ డాక్టర్లు ఏటా 45 రోజులు ఇండియాలో ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నారు. అందులో కొంత సమయం ఈ సర్వీస్‌కి కేటాయిస్తున్నారు. యూఎస్‌లోని మెర్సీ మిషన్ వేదికగా వారందిస్తున్న సర్వీస్‌కి హైదరాబాద్‌లో ‘లయన్స్ క్లబ్ – గ్రీన్‌ల్యాండ్స్’ సహకారం అందిస్తోంది. రెండేళ్లుగా మా రాంకీ ఫౌండేషన్ కూడా బాధ్యతలు తీసుకుంది. ఇందుకోసం ఫౌండేషన్ ట్రస్టీగా నేను బోర్డు మెంబర్స్ నుంచి అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలను చేపట్టాను. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వాళ్లలో రాయలసీమ జిల్లాలు, నల్గొండ జిల్లా వాళ్లు ఎక్కువగా ఉన్నారు. మా ఈ సర్వీస్‌కి ప్రాంత, భాష, ఆర్థికపరమైన ఆంక్షలు ఏమీ లేవు. పేరు నమోదు చేసుకుని వచ్చి వైద్యం చేయించుకోవడమే. ► ఇది సమష్టి దిద్దుబాటు ఈ సర్వీస్ కోసం ఇద్దరు డాక్టర్లు అమెరికా నుంచి వస్తారు. మరికొంతమంది డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది మొత్తం ముప్పైమంది స్థానికులు ఈ సర్వీస్‌లో పాల్గొంటారు. ఈ హెల్త్ సర్వీస్‌ను రెండు దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహించడంలో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధుకర్ స్వామి, లయన్స్ క్లబ్ విద్యాభూషణ్ సేవలు విశేషమైనవి. క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలెట్, కాలి ముడుచుకుపోయిన చర్మం, జన్యుపరమైన వైకల్యాలను సరిచేయడం, ప్రమాదవశాత్తూ దవడ, ముక్కు, కాళ్లు, చేతులు విరిగిపోవడం వంటి సమస్యల్లో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దగలిగిన అన్ని సమస్యలకూ వైద్యం అందిస్తున్నాం. కాస్మటిక్ సర్జరీలు ఈ క్యాంప్‌లో చేపట్టడం లేదు. మా సర్వీస్ గురించి వాల్‌పోస్టర్లు, బ్యానర్లతో జిల్లాల్లో ప్రచారం కల్పించాం. వీలైనంత ఎక్కువమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు దాక్షాయణి. ముఖం మీద ఒత్తైన జుత్తు హయతి అనే ఎనిమిదేళ్ల పాపాయి సమస్య మరీ ప్రత్యేకం. హైపర్ ట్రైకోసిస్... అంటే జుత్తు తల వరకే పరిమితం కాకుండా ముఖం మీదకు పాకుతుంది. తలమీద ఉన్నంత దట్టమైన జుత్తు ఒక చెంప మొత్తం ఉంది. ఆ పాపకు నలుగురిలోకి వెళ్లాలంటే బిడియం. స్కూలుకెళ్లాలంటే భయం. ఆమె సమస్య అంటువ్యాధి కాదని టీచర్లకు తెలిసినప్పటికీ క్లాసులో మిగిలిన పిల్లలతో కలిపి కూర్చోబెడితే వాళ్ల పేరెంట్స్ నుంచి కంప్లయింట్స్ వస్తాయి కాబట్టి హయతిని విడిగా కూర్చోబెట్టేవారు. తరగతి గది, ఇంటి నాలుగ్గోడలు తప్ప మరే ప్రపంచమూ తెలియని స్థితిలో రోజులు గడుస్తున్న హయతి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మామూలైంది. ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ మెర్సీ మిషన్స్∙యూఎస్ఏ, సేవా భారతి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్– గ్రీన్ ల్యాండ్స్, రాంకీ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్‌లో ఈ నెల 18వ తేదీ నుంచి స్క్రీనింగ్ జరుగుతుంది. సర్జరీలు 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరుగుతాయి. ఉచితవైద్యంతోపాటు మందులు, ఆహారం, బస సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాం. పేషెంట్ పరిస్థితిని బట్టి కొందరికి సర్జరీ తర్వాత ఫాలోఅప్ కోసం మూడు నుంచి నాలుగు రోజులు బస చేయాల్సి రావచ్చు. గడిచిన డిసెంబర్ 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. వైద్యసహాయం అవసరమైన వాళ్లు 78160 79234, 98482 41640 నంబర్లకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి. హైదరాబాద్, ఓల్డ్ మల్లేపల్లి, సీతారామ్‌బాగ్‌లోని డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్లో వైద్యసహాయం అందిస్తున్నాం. – ఆళ్ల దాక్షాయణి, మేనేజింగ్ ట్రస్టీ, రామ్కీ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
దళిత వర్గమే కానీ... రిజర్వేషన్లు మాత్రం వద్దన్నారు!
ఆమె రాజ్యాంగసభలోని సభ్యురాలైనప్పటికీ కుల ప్రాతిపదికన కేటాయించే రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు. మహిళలకూ ప్రత్యేకమైన రిజర్వేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఆమె మరెవరో కాదు.. రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ఏకైక దళిత మహిళా రాజ్యాంగ సభ సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలోని మొత్తం 389 మంది సభ్యులలో 15 మంది మహిళలున్నారు. నాడు రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలలో ఒకరిద్దరు మహిళా సభ్యులు రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే వీరు మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయలేదు. జర్నలిస్ట్ నిధి శర్మ రచించిన పుస్తకం 'షీ ది లీడర్: ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’లో మహిళా రాజకీయ నేతల గురించి లోకానికి అంతగా తెలియని కథనాలను అందించారు. పుస్తకం ప్రారంభంలో 1947, ఆగస్టు 28న షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక వర్గం అంశంపై చర్చిస్తున్నప్పుడు.. రిజర్వేషన్‌ను వ్యతిరేకించిన ఏకైక దళిత మహిళా సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్ అని పేర్కొన్నారు. నాడు సభలో దాక్షాయణి వేలాయుధన్ ఇలా అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ‘వ్యక్తిగతంగా నేను ఎటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా లేను. దురదృష్టవశాత్తూ బ్రిటీష్ సామ్రాజ్యవాదం మనపై కొన్ని మచ్చలు మిగిల్చింది. మనం హెచుతగ్గులను చూసి భయపడుతున్నాం. అందుకే ఈ అంశాలన్నింటినీ అంగీకరించవలసి వచ్చింది. ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును తొలగించలేం. సీట్ల రిజర్వేషన్ కూడా ఒక రకమైన ప్రత్యేక ఎంపిక వంటిదే. అయినా మనం దీనిని సహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది అవసరమైన పరిణామం అని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. దాక్షాయణి వేలాయుధన్ ఎవరు? దక్షిణాయణి వేలాయుధన్ 1912, జూలై 15న నేటి ఎర్నాకులం(కేరళ) జిల్లాలోని చిన్న ద్వీపమైన ముళవుకడ్లో జన్మించారు. ఆమె పులయ సమాజానికి చెందినవారు. కుల వ్యవస్థలో వీరి సమాజం అట్టడుగున ఉండేది. ఈ సమాజంలోని వారు వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. అంటరానితనం కారణంగా వారు బహిరంగ రహదారులపై నడవడాన్ని కూడా నిషేధించారు. దీనికితోడు ఈ సమాజానికి చెందిన స్త్రీలు తమ శరీరపు పైభాగాన్ని దుస్తులతో కప్పుకోవడాన్ని నిషేధించారు. ఈ విధంగా పులయ సమాజానికి చెందిన మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దళితులకు సంబంధించిన కాయాల్ సమావేశం 1913లో కొచ్చిలో జరిగినప్పుడు వేలాయుధన్ కుటుంబసభ్యులతో పాటు తరలివచ్చారు. అక్కడ వారి సమాజానికి తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. ఇటువంటి సంఘటనలు వేలాయుధన్ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. శాసనోల్లంఘన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ వేలాయుధన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1945లో దాక్షాయణి కొచ్చిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున నామినేట్ అయ్యారు. ఈ కౌన్సిల్ ద్వారా 1946లో భారత రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు మరోవైపు ఆమె ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌సీఎఫ్)వారపత్రిక ‘జై భీమ్’లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూవుండేవారు. డాక్టర్ అంబేద్కర్‌ను విమర్శించడానికి కూడా ఆమె వెనుకాడలేదు. అంబేద్కర్ రాజకీయాలను, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం ఆయన చేసిన డిమాండ్‌ను ఆమె తీవ్రంగా విమర్శించారు. దాక్షాయణి వేలాయుధన్ 1978 జూలై 20న తన 66 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి.. -
ఆత్మగౌరవ వజ్రాయుధం... దాక్షాయణి వేలాయుధం
రాజ్యాంగ రూపకల్పన ఒక మహాయజ్ఞంలా సాగింది. ఆనాటి రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 299 కాగా, అందులో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఒకరైన దాక్షాయణి వేలాయుధం రాజ్యాంగ సభకు ఎంపికైన తొలి దళిత మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. కొచ్చి (కేరళ)లోని ములవుకాడ్ అనే లంక గ్రామంలో పులయార్ కమ్యూనిటికీ చెందిన ఒక కుటుంబంలో 1912లో జన్మించింది దాక్షాయణి. పులయార్లు ప్రధానంగా వ్యవసాయకూలీలు. శ్రమదోపిడికి, అవమానాలకు గురయ్యేవాళ్లు. వాళ్ల చుట్టూ ఎన్నో ముళ్లకంచెలు ఉండేవి. ‘అందరూ నడిచే బాటలో నడవకూడదు’ ‘అందరూ వెళ్లే బావిలో నుంచి నీళ్లు తీసుకోకూడదు’ ‘ఖరీదైన దుస్తులే కాదు ఒక మాదిరి దుస్తులు కూడా ఒంటి మీద కనిపించకూడదు’... వంటివి. అయితే, దాక్షాయణి పుట్టిన కాలంలోనే ఒక ప్రశ్న కూడా పుట్టింది.‘అయ్యా! మేమూ మీలాగే మనుషులం కదా. మమ్మల్ని ఇలా ఎందుకు హీనంగా చూస్తున్నారు?’ అని అడిగింది ఆ ప్రశ్న.పులయార్ల సంస్కర్త అయ్యన్‌కాలీ ఉద్యమ గొంతు సవరించడానికి సిద్ధమవుతున్న కాలం అది. సాధారణంగా పులయార్ల ఇండ్లలో అమ్మాయి పుడితే అజ్కి, పుమల, చక్కి, కిలిపక్క.. అనే పేర్లు మాత్రమే పెట్టేవారు. అయితే ఒక అమ్మాయికి ‘దాక్షాయణి’ అని నామకరణం చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నామకరణ సరళిలో మార్పు తీసుకువచ్చింది. ‘ఆమె జీవితంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో చారిత్రక అస్తిత్వాలు ఉన్నాయి’ అంటారు దాక్షాయణి కూతురు మీరా వేలాయుధం. ఆరోజుల్లో నిమ్నవర్గాలకు చెందిన పిల్లలు స్కూలు గడప తొక్కడం అనేది ఊహకు అందని విషయం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అవమానాలను తట్టుకొని ఉన్నత చదువులు చదువుకుంది దాక్షాయణి. 1945లో కొచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎంపికైంది. విశిష్టమైన రాజ్యాంగ నిర్మాణంలో భాగమై తన సమకాలీన తరానికి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది దాక్షాయణి వేలాయుధం. -
పుష్ప నుంచి దాక్షాయని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
-
దాక్షాయని ఇక లేదు!
తిరువనంతపురం: దాక్షాయని.. ఇదో ఏనుగు పేరు. దీనికో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఆసియాలో బతికున్న ఏనుగుల్లో వయసులో ఇదే పెద్దది. దీని వయసు 88 సంవత్సరాలు. ఆసియాలో వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొంది.. గిన్నిస్ రికార్డులో కూడా చోటు సంపాదించుకుంది. అటువంటి దాక్షాయని కన్నుమూసింది. వయోభారం, అస్వస్థతతో చికిత్స పొందుతూ పప్పనామ్కోడ్లోని ట్రామా కేర్ సెంటర్లో కన్నుమూసింది. ఏనుగును సంరక్షిస్తున్న ట్రావెన్కోర్ దేవాస్వమ్ బోర్డు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది. 2016లో దాక్షాయనిని ‘గజముతస్సీ’ బిరుదుతో సత్కరించారు. మూడేళ్ల క్రితం వరకు పద్మనాభ స్వామి ఆలయంలో నిర్వహించే ‘అరట్టు’ ఊరేగిం పులో దాక్షాయని పాల్గొన్నది. పోస్టల్ శాఖ దాక్షాయని ఏనుగు బొమ్మతో ఓ స్టాంప్ ను కూడా విడుదల చేసింది. దాక్షాయని అంత్యక్రియలు బుధవారం సాయంత్రం నిర్వహించారు. -
గిన్నిస్ పుటల్లో ఎక్కనున్న గజరాజు!
కేరళ గజరాజుకు ప్రత్యేక గౌరవం దక్కింది. ఆసియాలోనే అత్యంత ఎక్కువకాలం జీవించిన ఏనుగుగా 86 ఏళ్ళ వృద్ధ ఏనుగు గిన్నిస్ రికార్డులకు ఎక్కనుంది. వృద్ధాప్యంలోనూ హుషారుగా గడిపేస్తున్న ఏనుగు గురించి యజమానులు.. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) గిన్నిస్ అధికారులకు వివరాలతో లేఖ రాశారు. ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఏనుగుగా దాక్షాయణి గురించి లేఖలో వివరించారు. ప్రాణాలతో జీవిస్తున్న ఏనుగుల్లో దాక్షాయణి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు అని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అధ్యక్షుడు పరీయర్ గోపాలకృష్ణన్ తెలిపారు. కేరళ అటవీశాఖ రికార్డులు కూడా అదే విషయాన్ని స్సష్టం చేస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొందిన దాక్షాయణిని ఈ సందర్భంగా ట్రావెన్ కోర్ బోర్డు ప్రత్యేకంగా సత్కరించింది. దేవస్వం మినిస్టర్ కడకంపల్లి సురేంద్రన్ సత్కార కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఫారెస్ట్ మినిస్టర్ కె. రాజు పంచదేరం టైటిల్ తో ఏనుగును సత్కరించారు. ట్రావెన్ కోర్ రాజులు దాక్షాయణిని టీడీబీ కి బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఏనుగు ఛంగలూర్ మహాదేవ ఆలయంలో ఉంటోంది. కేరళ పోస్టల్ సర్వీస్ కూడా దాక్షాయణి పేరిట ఓ ప్రత్యేక పోస్టల్ కవర్ ను రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో ఉంది. తైవాన్ కు చెందిన ఏనుగు.. 85 ఏళ్ళ వయసులో 2003 లో చనిపోగా... దాక్షాయణి 86 ఏళ్ళు జీవించిఉన్న ఏనుగుగా ప్రత్యేక గౌరవాన్ని దక్కించుకుని, గిన్నిస్ పుటలకు ఎక్కనుంది. -
'దాక్షాయణి' అరుదైన ఘనత!
త్రివేండ్రం: కేరళలోని త్రివేండ్రంకు చెందిన ఏనుగు 'దాక్షాయణి' గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కనుంది. ప్రపంచంలో జీవించివున్న ఏనుగుల్లో అత్యధిక వయసు కలిగిన ఏనుగమ్మగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించనుంది. 86 ఏళ్ల వయసున్న 'దాక్షాయణి' పేరును రికార్డులకు ఎక్కించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీబీడీ) ఇప్పటికే గిన్నిస్ అధికార వర్గాలకు లేఖ రాసింది. శబరిమల సహా 1,250 ఆలయాలు టీబీడీ పరిధిలో ఉన్నాయి. టీబీడీ దగ్గర 33 ఏనుగులు ఉన్నాయి. ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో వివిధ సేవలకు వీటిని వినియోగిస్తుంది. తైవాన్ లో 85 ఏళ్లు బతికిన ఏనుగు 2003లో మరణిచిందని టీబీడీ అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ తెలిపారు. గిన్నిస్ బుక్ లో దాక్షాయణి పేరుకు నమోదుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీని పేరుతో కేరళలో పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయనున్నామని వెల్లడించారు. 1949లో ట్రావెర్ కోర్ రాజకుటుంబం ఈ ఏనుగును టీబీడీకి బహూకరించిందని చెప్పారు. -
ఢిల్లీలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన దేశ రాజధానిలోని నోయిడా 49వ సెక్టార్ సర్ఫాబాద్లో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో ఇరువురి మృతదేహాలను మంగళవారం రాత్రి పోలీసులు కనుగొన్నారు. స్నానాలగదిలో నగ్నంగా పడి ఉన్న మృతదేహాలను ఒడిశాకు చెందిన నవీన్‌కుమార్ (32), ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఎట్టెడ గ్రామానికి చెందిన దాక్షాయణి (30)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలు.. దాక్షాయణికి రేవన్న అనే వ్యక్తితో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. ఉద్యోగరిత్యా వీరు బెంగళూరులో స్థిరపడ్డారు. వీరికి మహేశ్ (5), మౌనిక (3) సంతానం. బెంగుళూరులో ఉంటున్న సమయంలో ఇంటిపక్కనే ఉంటున్న నవీన్ అనే వ్యక్తితో దాక్షాయణికి పరిచయం ఏర్పడింది. పరిచయం ఆతర్వాత ప్రేమగా మారింది. బెంగుళూరు నుంచి మకాం మార్చిన నవీన్ నోయిడాలోని ఓ ప్రై వేటు కంపెనీలో చేరాడు. సర్ఫాబాద్ గ్రామంలో అద్దె ఇళ్లు తీసుకున్నాడు. కాగా రెండు నెలల కిందట పుట్టింటికి (చిత్తూరు) వెళ్తున్నట్టు భర్త రేవన్నకు చెప్పిన దాక్షాయణి ఇద్దరు పిల్లలను తీసుకుని నోయిడాకు వచ్చింది. సర్ఫాబాద్ చేరుకున్న ఆమె నవీన్‌తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి స్నానాలగదిలో ఇద్దరి మృతదేహాలు పడిఉన్నాయి. ఇంటికి, స్నానాలగదిలోకి లోపల నుంచి గడి పెట్టి ఉంది. పిల్లలు వేరు గదిలో నిద్రిస్తున్నారు. సోమవారం ఉదయం లేచిన పిల్లలు తల్లి కనిపించకపోవడంతో స్కూల్‌కు వెళ్లలేదు. ఫీజు కూడా కట్టాల్సి ఉండడంతో పిల్లలు గైర్హాజరవడంపై టీచరు ఓ విద్యార్థిని నవీన్ ఇంటికి పంపారు. తల్లి బాత్రూంకు వెళ్లి తిరిగిరాలేదని దాక్షాయని కుమారుడు మహేశ్ చెప్పడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నానాలగది తలుపుపగలగొట్టగా ఇరువురి మృతదేహాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్యా? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది పోస్టుమార్టం తర్వాతే తేలుతుందని పోలీసులు పేర్కొన్నారు. దాక్షాయనిని హత్యచేసి ఆ తర్వాత నవీన్ ఆత్మహత్యచేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.