
తిరువనంతపురం: దాక్షాయని.. ఇదో ఏనుగు పేరు. దీనికో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఆసియాలో బతికున్న ఏనుగుల్లో వయసులో ఇదే పెద్దది. దీని వయసు 88 సంవత్సరాలు. ఆసియాలో వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొంది.. గిన్నిస్ రికార్డులో కూడా చోటు సంపాదించుకుంది. అటువంటి దాక్షాయని కన్నుమూసింది. వయోభారం, అస్వస్థతతో చికిత్స పొందుతూ పప్పనామ్‌కోడ్‌లోని ట్రామా కేర్ సెంటర్‌లో కన్నుమూసింది. ఏనుగును సంరక్షిస్తున్న ట్రావెన్‌కోర్ దేవాస్వమ్ బోర్డు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది. 2016లో దాక్షాయనిని ‘గజముతస్సీ’ బిరుదుతో సత్కరించారు.
మూడేళ్ల క్రితం వరకు పద్మనాభ స్వామి ఆలయంలో నిర్వహించే ‘అరట్టు’ ఊరేగిం పులో దాక్షాయని పాల్గొన్నది. పోస్టల్ శాఖ దాక్షాయని ఏనుగు బొమ్మతో ఓ స్టాంప్ ను కూడా విడుదల చేసింది. దాక్షాయని అంత్యక్రియలు బుధవారం సాయంత్రం నిర్వహించారు.