సాక్షి, మైదుకూరు : వైఎస్‌ఆర్ జిల్లా దువ్వూరు మండలం మీర్జాఖాన్‌పల్లె వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రయివేట్ పాఠశాల బస్సు, కొరియర్ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో నవీన్‌కుమార్(5) అనే విద్యార్థి మృతి చెందాడు. మరో పది మంది విద్యార్థులు గాయపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కొరియర్ వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నవీన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గతంలో కూడా ఇదే స్కూల్ బస్సు ప్రమాదానికి గురైందని, అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా డ్రైవర్ రాంగ్ రూట్‌లో వాహనాన్ని నడటం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.