ఢిల్లీ: రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యల కలకలం.. ఆమెకు మద్దతుగా కన్హయ్య చేసిన పోస్ట్... చివరికి అతని దారుణ హత్యకు దారి తీసింది. ఈ తరుణంలో..
బీజేపీ సస్పెండెడ్ నేత నవీన్ కుమార్ జిందాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ మేరకు ఈ ఉదయం మూడు బెదిరింపు ఈ-మెయిల్స్‌తో పాటు కన్హయ్యను చంపిన ఘటన తాలుకా వీడియోను ఎటాచ్ చేసి మరీ ఆయనకు పంపించారు దుండగులు.
ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసిన నవీన్‌కుమార్ జిందాల్.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తూ ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. నూపుర్ వ్యాఖ్యల టైంలోనే మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ నవీన్‌కుమార్ జిందాల్ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. అది దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత నవీన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు సైతం నమోదు అయ్యాయి.
ఇదిలా ఉండగా.. కన్హయ్య లాల్‌ను చంపుతూ ఈ వీడియోను షూట్ చేసిన అక్తర్, గౌస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం మరో సెల్ఫీ వీడియోలో కత్తులో ప్రధాని మోదీని సైతం చంపుతామంటూ వాళ్లు బెదిరించారు నిందితులు. అయితే హత్య వీడియోతో పాటు సదరు బెదిరింపుల వీడియో వైరల్ అవుతుండగా.. వాటిని సర్క్యులేట్ చేయొద్దంటూ రాజస్థాన్ పోలీసులు, ఆ రాష్ట్ర సీఎం విజ్ఞప్తి చేస్తున్నారు.
आज सुबह क़रीब 6:43 बजे मुझको तीन ईमेल आयी है, जिसमें #उदयपुर में भाई कन्हैया लाल की गर्दन काटने का विडियो अटैच करते हुए मेरी और मेरे परिवार की भी ऐसी गर्दन काटने की धमकी दी गई है मैंने PCR को सूचना दे दी है।@DCPEastDelhi @CellDelhi @CPDelhi तुरंत संज्ञान ले। pic.twitter.com/rhzyLbbdNg
— Naveen Kumar Jindal 🇮🇳 (@naveenjindalbjp) June 29, 2022
చదవండి: అచ్చం ఐసిస్ తరహాలో గొంతు కోసి..
Comments
Please login to add a commentAdd a comment