
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: హత్య కేసును ఆత్మహత్యగా మార్చేసిన ఓ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ తిరునల్వేలి డీఐజీ ప్రవేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఆర్ముగనేరి స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా బాలాజీ పనిచేస్తున్నారు. ఈయన రెండేళ్ల క్రితం తిరుచ్చి జిల్లా సెందురై స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో శ్రీవిశ్వపురంలో రౌడీ కాశి రాజన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, ఇది హత్య అనే ఆరోపణలు వచ్చినా, కేసును మాత్రం ఆత్మహత్యగా మార్చేసి ముగించాడు.
విషం తాగి మరణించినట్టుగా నిర్ధారించేశాడు. అయితే ఈ వ్యవహారంపై ఫిర్యాదులు హోరెత్తడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అదే సమయంలో అక్కడి నుంచి బాలాజీని ఆర్ముగనేరికి బదిలీ చేశారు. విచారణలో కాశి రాజన్ మరణం వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్టు వెలుగు చూసింది. కాశి రాజన్ వెన్నంటి ఉన్న వారే హతమార్చినట్టు వెలుగు చూసింది. ఈ కేసులో ఏడుగురిని కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. హత్యను ఆత్మహత్యగా మార్చేసిన ఇన్‌స్పెక్టర్ బాలాజీని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: ఇన్‌స్టాలో పరిచయం, ఆపై స్నేహం.. చివరికి యువతిని నమ్మించి..
Comments
Please login to add a commentAdd a comment