threatening mail
-
సీఎం నితీశ్ ఆఫీసు పేల్చేస్తా.. మెయిల్ పంపిన వ్యక్తి అరెస్టు
పాట్నా: బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆఫీసును బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నితీశ్‌కుమార్ ఆఫీసు పేల్చేస్తామని అల్‌ఖైదా పేరుతో శనివారం బెదిరింపు మెయిల్ వచ్చిందని, తనిఖీలు చేయగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ పంపిన వ్యక్తిని కోల్‌కతాలో అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. మెయిల్ పంపిన వ్యక్తి బిహార్ జిల్లాలోని బెగుసరాయ్‌కి చెందిన మహ్మద్ జాహెద్‌గా గుర్తించారు. జాహెద్ కోల్‌కతాలో పాన్‌షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.ఇతడు నితీశ్‌కుమార్‌కు ఎందుకు బెదిరింపు మెయిల్ పంపాడన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల బిహార్‌లో స్కూళ్లకు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్లు ఎక్కువయ్యాయి. -
తమిళనాడు డీజీపీ ఆఫీస్‌కు ‘బాంబు’ బెదిరింపు
సాక్షి, చెన్నై: చెన్నై డీజీపీ కార్యాలయానికి బుధవారం రాత్రి వచి్చన ఒక ఈ మెయిల్ పోలీసులను పరుగులు తీయిస్తోంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టామని, సాహసం చేసి కని పెట్టండి అని వచ్చిన ఆ బెదిరింపు మెయిల్‌తో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సమయం ఆసన్నం అవుతోండటంతో చెన్నై నగరంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసే విధంగా కమిషనర్ సందీప్‌రాయ్ రాథోర్ ఆదేశాలు ఇచ్చారు. 400 చోట్ల సోదాలు జరిపే విధంగా , 15 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండే రీతిలో చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితులలో బుధవారం రాత్రి డీజీపీ కార్యాలయానికి ఓ ఈ మెయిల్ వచి్చంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టినట్టు, బెసెంట్ నగర్, ఎలియట్స్ బీచ్‌లలో బాంబులు పెట్టి్టనట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో బాంబ్, డాగ్ స్క్వాడ్ ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలిస్తున్నాయి. నగరంలో తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్టుగా గతంలో వెలుగు చూసిన ›ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసి సోదాలు ముమ్మరం చేశారు. -
ఆర్బీఐకి బాంబు బెదిరింపులు
ముంబయి: ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల కార్యాలయాలపై దాడులు చేస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు దుండగులు ఈమెయిల్ పంపించారని ముంబయి పోలీసులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రాజీనామా చేయాలని బెదిరింపు మెయిల్లో దుండగులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబయిలోని 11 చోట్ల మొత్తం 11 బాంబు దాడులు జరుగుతాయని దుండగులు మెయిల్లో పేర్కొన్నారు. మెయిల్లో పేర్కొన్న అన్ని ప్రాంతాలకు వెళ్లి గాలించినా ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈమెయిల్‌కు ఖిలాఫత్ ఇండియా అనే యూజర్ పేరు ఉంది. నిర్మలా సీతారామన్, శక్తికాంత దాస్‌లు కుంభకోణంలో ఉన్నారని ఈమెయిల్ పంపిన వ్యక్తి ఆరోపించారు. కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు -
విమానాశ్రయానికి బెదిరింపు... రూ.8.3 కోట్లకు డిమాండ్!
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను పేల్చివేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈమెయిల్ పంపిన వ్యక్తి 48 గంటల్లో బిట్‌కాయిన్ రూపంలో 1 మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) డిమాండ్ చేసినట్లు సమాచారం. quaidacasrol@gmail.com ద్వారా బెదిరింపు ఈమెయిల్ పంపినందుకు గుర్తు తెలియని వ్యక్తిపై సహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఫీడ్‌బ్యాక్ ఇన్‌బాక్స్‌కు మెయిల్ వచ్చినట్లు తెలిసింది. ‘బిట్‌కాయిన్‌లో 1 మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) బదిలీ చేయకపోతే 48 గంటల్లో టెర్మినల్ 2ను పేల్చేస్తాం. 24 గంటల తర్వాత మరొక హెచ్చరిక ఉంటుంది’ అని మెయిల్ వచ్చింది. ఇదీ చదవండి: 2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ.. : టెస్లా దాంతో ఆ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లు 385(బలవంతపు వసూళ్లు), 505(1)(బి) (ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రకటనలు చేయడం) కింద కేసు నమోదు చేశారు. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను పెంచారు. ప్రాథమిక విచారణలో ఈమెయిల్ పంపిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐసీ) చిరునామాను పోలీసులు ట్రాక్ చేశారు. పోలీస్ సైబర్ విభాగం మెయిల్ లొకేషన్‌ను గుర్తించినట్లు సమచారం. -
అంబానీకి బెదిరింపుల కేసులో ఇద్దరి అరెస్ట్
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన వ్యవహారంలో తెలంగాణ, గుజరాత్‌లకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఎనిమిది రోజుల వ్యవధిలో అంబానీకి చెందిన సంస్థకు మూడు ఈమెయిళ్లు అందాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ మొదటి మెయిల్ పంపారు. తమ వద్ద మంచి షూటర్లు ఉన్నట్లు అందులో బెదిరించారు. ఆతర్వాత మరో మెయిల్లో రూ.200 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. సోమవారం పంపిన మెయిల్లో రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఉంది. వీటిపై అంబానీ భద్రతా అధికారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు తెలంగాణలోని వరంగల్‌కు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తి(19) కాగా, మరొకరు గుజరాత్‌కు చెందిన షాదాబ్ ఖాన్(21). శనివారం గణేశ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. షాదాబ్ ఖాన్ ఉన్నతవిద్యా వంతుడని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వరుసగా బెదిరింపు ఈమెయిళ్లు.. అంబానీ భద్రత గురించి తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. గతంలో రూ.20 కోట్లు, రూ.200 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో మెయిళ్లు రాగా.. తాజాగా రూ.400 కోట్ల డిమాండ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతున్న దుండగులు ముఖేశ్ అంబానీపై ప్రత్యక్షంగా దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆయనకు కల్పిస్తున్న భద్రత అలా ఉంది మరి! ప్రస్తుతం అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతేడాది నుంచే భద్రతను పెంచింది. గతంలో ముంబైలోని ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో బాంబు భయం తర్వాత పారిశ్రామిక వేత్తల భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. భద్రత ఎవరికంటే.. ప్రముఖులకు సంఘ విద్రోహశక్తుల నుంచి అపాయం ఉందని భావిస్తే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత ఏర్పాటు చేస్తుంది. వీరిలో అత్యధిక ప్రజాదరణ కలిగి..వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని నిఘా సంస్థలు అందించే సమాచారం ఆధారంగా భద్రత అందిస్తారు. సంఘ విద్రోహశక్తుల నుంచి వీరిని కాపాడడం వారి విధి. నిఘా సంస్థ అందించే రిపోర్ట్ ఆధారంగా వివిధ రకాల భద్రతా కేటగిరీలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారికి కేటాయిస్తుంది. ప్రమాదాలను అంచనా వేసి భద్రతా వర్గాన్ని ఐదు గ్రూపులుగా విభజించింది. వాటిలో ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్పీజీ వర్గాలున్నాయి. భారత్‌లోని వీఐపీలు, వీవీఐపీలు, ఇతర ఉన్నత స్థాయి లేదా రాజకీయ ప్రముఖులకు ఈ రకమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. అయితే గతేడాది నుంచి ముకేశ్ అంబానీకి జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత అందిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత అంటే.. రక్షణలో ఎస్పీజీ తర్వాత జెడ్ ప్లస్ భద్రత అనేది రెండో అత్యధిక స్థాయి భద్రతా. ఇందులో భాగంగా 10+ ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసు అధికారులతో కలుపుకుని 55మంది సిబ్బంది వీరికి రక్షణగా ఉంటారు. వీరంతా మార్షల్ ఆర్ట్స్, పోరాట శిక్షణలో నైపుణ్యం పొందినవారు. ఈ కేటగిరీలో భాగంగా 5+ బులెట్‌ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. దేశంలో ఇప్పటివరకు కేవలం 43 ప్రముఖులకు మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు. భద్రత సిబ్బంది వేతనాలు, ప్రయాణ భత్యాలు, వాహనాలు వంటి ఖర్చులను సందర్భాన్ని బట్టి వివిధ ఏజెన్సీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రత పొందే వ్యక్తులు, సంస్థలు భరిస్తాయి. ఎస్పీజీ మాత్రం దేశ ప్రధానికి భద్రత కల్పిస్తుంది. -
ఈసారి రూ.400 కోట్లు డిమాండ్..అంబానీకి వరుసగా మూడో బెదిరింపు ఈమెయిల్
ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి వరుసగా బెదిరింపు ఈమెయిల్ వస్తున్నాయి. గతంలో రూ.20కోట్లు, రూ.200కోట్ల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈమెయిల్ ఇచ్చాయి. ఈసారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. నాలుగు రోజుల్లో అంబానీకి పంపిన మూడో బెదిరింపు ఈమెయిల్ ఇదని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు అక్టోబర్ 27న ఓ వ్యక్తి రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ ఈమెయిల్ రావడంతో అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జీ చేసిన ఫిర్యాదు ఆధారంగా గామ్దేవి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అక్టోబర్ 28న రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో ఈమెయిల్ వచ్చింది. తాజాగా కంపెనీకి సోమవారం మూడో ఈమెయిల్ వచ్చినట్లు అధికారి తెలిపారు. ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచి, సైబర్ బ్రాంచి బృందాలు ఈమెయిల్ పంపిన వారిని కనుగొనే పనిలో ఉన్నాయని ఆయన అన్నారు. అంబానీ, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు గాను గతేడాది బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్‌ను పేల్చివేస్తామని నిందితులు గతంలో బెదిరించారు. -
అంబానీకి మళ్లీ బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని శుక్రవారం ఓ అగంతకుడు మెయిల్ ద్వారా బెదిరించిన విషయం తెలిసిందే. ఆదివారం మళ్లీ అదే అడ్రస్‌తో మరోసారి బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని అందులో ఉందన్నారు. అంబానీ నివా సం ఆంటీలియా భద్రతాధికారి దేవేంద్ర ము న్షీరామ్ ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్‌కు చెందిన ఈ–మెయిల్ సరీ్వస్ ప్రొవైడర్ ఉపయోగించాడని చెప్పారు. అతడిపై ఐపీసీ 387, 506(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్ వచి్చనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ముకేశ్ అంబానీకి బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి అంబానీ సంస్థకు చెందిన ఓ ఈ–మొయిల్ ఐడీకి శుక్రవారం మెయిల్ వచ్చింది. ‘మా దగ్గర మంచి షూటర్లు ఉన్నారు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’అని ఆ మెయిల్ సారాంశం. దీంతో, ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్చార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ మెయిల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది సైతం ముకేశ్ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్ ఆస్పత్రికి ఫోన్ చేసి ‘ఆసుపత్రిని పేల్చేస్తాం. అంబానీ కుటుంబాన్ని చంపేస్తాం’అని బెదిరించాడు. 2021లో ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే. -
అతి త్వరలోనే ముంబైని పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపులు
ముంబై నగరం ఎప్పుడూ ఉగ్రవాద సంస్థ హిట్ లిస్టులో ఉంది. ఎప్పుడు, ఏ రూపంలో ఉగ్రదాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. తాజాగా ముంబై పోలీసు శాఖకు రెండు బెదిరింపులు వచ్చాయి. ముంబై నగరాన్ని బాంబు బ్లాస్ట్ చేయనున్నట్లు ఓ వ్యక్తి పోలీస్ శాఖకు ట్వీట్ చేశారు. ‘ముంబైను అతి త్వరలోనే బాంబు పెట్టి పేల్చబోతున్నాను’ అని ట్వీట్ వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో ముంబై పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి 26\11 తరహాలో ఉగ్రదాడులకు పాల్పడుతామంటూ పూర్తిగా మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశాడు. తను రాజస్తాన్ నుంచి మాట్లాడుతున్నానని 26\11 తరహాలో దాడులు చేస్తామని చెప్పిఫోన్ కట్ చేశాడు. ఈ ఫోన్ కాల్‌ను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫోన్ ఎవరు. ఎక్కడి నుంచి చేశారనేది ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఇదే వ్యక్తి బెదిరింపు ఫోన్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఆ దిశగా పోలీసుల బృందం దర్యాప్తు చేస్తుంది. కాగా గత ఏడాది కాలంగా ముంబై పోలీస్ శాఖకు బెదిరింపు ఫోన్స్ కాల్స్, మెసెజ్‌లు ఎక్కువగా వన్నాయని పోలీసులు తెలిపారు. తీ క్రమంలో ఇప్పటికే విమానాశ్రయం, మంత్రాలయ, బీఎస్ఈ తదితర కీలక కార్యాయాల వద్ద ప్రార్థనా స్థలాల వద్ద భారీ పోలీసులు బందో బస్తు ఉంటుంది. బెదిరింపు ఫోన్లు వస్తే భద్రత మరింత కట్టుదిట్టం చేస్తారు. చదవండి: భారత్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. నేపాల్‌లో సినీ ఫక్కీలో అరెస్ట్ -
అలా చేసినందుకు కాల్ చేసి.. బెదిరిస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: కొంతమంది ఫోన్ చేసి తనను బెదిరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బుధవారం శాసనసభ దృష్టికి తెచ్చారు. బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర పురోభివృద్ధికి శ్రమిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో విపక్షాలు చేస్తున్న విమర్శలకు మీడియా ముఖంగా సమాధానం చెబితే రౌడీల చేత తనకు ఫోన్‌కాల్స్ చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగువర్గాలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై కొన్ని పారీ్టలు కుట్రలు చేస్తున్నాయని, ఆ వర్గాలను ఆర్థికంగా బలోపేతం కాకుండా చూడాలన్నదే వాళ్ళ ఆలోచనన్నారు. -
నీ కుమారుడి కంటే దారుణంగా చంపుతాం.. సిద్ధూ తండ్రికి బెదిరింపులు
చండీగఢ్: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రిని దారుణంగా చంపుతామని బెదిరింపులు రావడం కుటుంభసభ్యులను ఆందోళనకు గురిచేసింది. సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని సభ్యుడు ఈమెయిల్ ద్వారా ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిద్ధూ మెయిల్ ఐడీకి షూటర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ మెయిల్ వచ్చింది. తమ అనుచరుడి హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ మూసేవాలాను హతమార్చినట్లు నిందితుడు ఈమెయిల్లో పేర్కొన్నాడు. గ్యాంగ్స్టర్ల గురించి గానీ తమ భద్రత గురించి ఏ విషయమైనా లేవనెత్తితే సిద్ధూ కంటే దారుణంగా చంపేస్తామని హెచ్చరించాడు. నోరుమూసుకొని సైలెంట్‌గా ఉండాలని లేకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు. కొందరు దుండగులు సిద్ధూ మూసేవాలను కొద్ది నెలల క్రితం దారుణంగా హత్య చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడించి తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం తన కుమారుడి మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టొద్దని సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ డిమాండ్ చేశారు. నిందితుల కుటుంబసభ్యులకు పోలీసు భద్రత కల్పించడంపై మండిపడ్డారు. సిద్ధూ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్టు చేశారు. చదవండి: గుజరాత్లో భక్తులపైకి దూసుకెళ్లిన కారు .. ఆరుగురు మృతి -
ఉదయ్‌పూర్ ఘటన: ఖబడ్దార్.. కన్హయ్యను చంపినట్లే చంపుతాం!
ఢిల్లీ: రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యల కలకలం.. ఆమెకు మద్దతుగా కన్హయ్య చేసిన పోస్ట్... చివరికి అతని దారుణ హత్యకు దారి తీసింది. ఈ తరుణంలో.. బీజేపీ సస్పెండెడ్ నేత నవీన్ కుమార్ జిందాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ మేరకు ఈ ఉదయం మూడు బెదిరింపు ఈ-మెయిల్స్‌తో పాటు కన్హయ్యను చంపిన ఘటన తాలుకా వీడియోను ఎటాచ్ చేసి మరీ ఆయనకు పంపించారు దుండగులు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసిన నవీన్‌కుమార్ జిందాల్.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తూ ట్వీట్లో ట్యాగ్ చేశారు. నూపుర్ వ్యాఖ్యల టైంలోనే మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ నవీన్‌కుమార్ జిందాల్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. అది దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత నవీన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు సైతం నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా.. కన్హయ్య లాల్‌ను చంపుతూ ఈ వీడియోను షూట్ చేసిన అక్తర్, గౌస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం మరో సెల్ఫీ వీడియోలో కత్తులో ప్రధాని మోదీని సైతం చంపుతామంటూ వాళ్లు బెదిరించారు నిందితులు. అయితే హత్య వీడియోతో పాటు సదరు బెదిరింపుల వీడియో వైరల్ అవుతుండగా.. వాటిని సర్క్యులేట్ చేయొద్దంటూ రాజస్థాన్ పోలీసులు, ఆ రాష్ట్ర సీఎం విజ్ఞప్తి చేస్తున్నారు. आज सुबह क़रीब 6:43 बजे मुझको तीन ईमेल आयी है, जिसमें #उदयपुर में भाई कन्हैया लाल की गर्दन काटने का विडियो अटैच करते हुए मेरी और मेरे परिवार की भी ऐसी गर्दन काटने की धमकी दी गई है मैंने PCR को सूचना दे दी है।@DCPEastDelhi @CellDelhi @CPDelhi तुरंत संज्ञान ले। pic.twitter.com/rhzyLbbdNg — Naveen Kumar Jindal 🇮🇳 (@naveenjindalbjp) June 29, 2022 చదవండి: అచ్చం ఐసిస్ తరహాలో గొంతు కోసి.. -
ప్రధానిని చంపేస్తామంటూ ఎన్ఐఏకు మెయిల్
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ ఒకటి ముంబైలోని ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కార్యాలయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రధాని మోదీ హత్యకు 20 మంది స్లీపర్ సెల్స్‌ను తయారు చేశామని, 20 కేజీల ఆర్డీఎక్స్ను సిద్ధం చేశామని ఆగంతకులు ఆ మెయిల్లో పేర్కొన్నారు. ఈ మెయిల్‌ను ధృవీకరించిన ముంబై ఎన్ఐఏ కార్యాలయం.. ప్రధాని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీనిపై మరింత అప్డేట్స్ అందాల్సి ఉంది. -
గంభీర్‌కు మళ్లీ బెదిరింపులు.. వారంలో మూడోసారి..
సాక్షి, ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావటం కొనసాగుతున్నాయి. మరోసారి ఆదివారం కూడా ఆయనకు బెదిరింపు ఈ మెయిల్స్ రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు, ఐపీఎస్ శ్వేతా(డీసీపీ) ఏం చేయలేరు. పోలీసుల్లో కూడా మా గూఢచారులు ఉన్నారు’ అని ఉగ్రవాద సంస్థ ఐసీస్ కశ్మీర్ పేరుతో ఉన్న ఈ-మెయిల్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. వారం రోజుల్లో బెదిరింపులు రావటం ఇది మూడోసారి. చదవండి: అఖిలపక్షం భేటీ: ‘అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమే’ దీంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. సైబర్ సెల్‌కు చెందిన స్పెషల్ టీం బెందిరింపు మెయిల్స్‌పై దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. 23 నవంబర్ రోజు కూడా మొదటిసారి బెందింపులు వచ్చాయని వాటిపై దర్యాప్తు చేస్తున్నమని డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. ఆయన నివాసం వద్ద పోలీసు భద్రత పెంచామని పేర్కొన్నారు. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు -
‘కివీస్ జట్టుకు బెదిరింపులు భారత్ కుట్రే’.. పాక్ మంత్రి సంచలన ఆరోపణ
Threat To New Zealand Cricketers Came From India: భద్రతా కారణాల రిత్యా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాక్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన నేపథ్యంలో పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి సంచలన ఆరోపణలు చేశాడు. కివీస్ టూర్ రద్దుకు భారత్ కుట్ర చేసిందంటూ పసలేని వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ జట్టుకు బెదిరింపు ఈమెయిల్(కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ భార్యకు వచ్చింది) సింగపూర్ ఐపీ అడ్రస్ చూపించే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్) ఉపయోగించి భారత్‌లోని అనుబంధ పరికరం నుండి పంపబడిందంటూ బుధవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించాడు. అయితే, ఈ విషయమై భారత విదేశీ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విశేషం. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డే(సెప్టెంబర్ 17)కు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం తాము పాక్‌లో పర్యటించడం లేదంటూ వెల్లడించింది. ఈ రెండు జట్లు పాక్ టూర్‌ను రద్దు చేసుకోవడంతో పాక్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావం పడింది. భవిష్యత్తులో విదేశీ జట్లు పాక్‌లో పర్యటించడం ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ జట్టు పాక్ టూర్‌ను రద్దు చేసుకోవాలని తమ ప్రభుత్వం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు ఎలాంటి సూచన చేయలేదని పాక్‌లో యూకే హైకమిషనర్ క్రిస్టియన్ టర్నర్ పేర్కొనడం కొసమెరుపు. చదవండి: "పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది.." -
సీఎం కార్యాలయానికి బెదిరింపు సందేశాలు
న్యూఢిల్లీ: తెలుగులో కొద్ది రోజుల క్రితం ఓ సినిమా వచ్చింది. దానిలో హీరో ఫేమస్ అవ్వడం కోసం రాజకీయ నాయకుడి మీద దాడి చేస్తాడు. సేమ్ ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ డెలివరీ బాయ్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని భావించాడు. దాని కోసం ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రితో సహా పలువురు రాజకీయ నాయకులను బెదిరిస్తూ.. ఈ మెయిల్స్ పంపాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది. వివరాలు.. ముంబైకి చెందిన అభిషేక్ తివారి అనే వ్యక్తి చదువు మధ్యలో మానేసి ప్రస్తుతం డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే ఉద్యోగ జీవితం పట్ల నిరాశతో ఉన్న అభిషేక్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని భావించాడు. అందుకోసం తొలుత ముంబైలోని ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్స్ పంపాడు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఇలా కాదని భావించి ఈ సారి ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు నాయకులను చంపుతానని బెదిరిస్తూ.. మెయిల్స్ పంపాడు. అంతేకాక ఢిల్లీలో ఉన్న ఓ జాతీయ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని బాంబు పెట్టి పేల్చేయబోతున్నట్లు మెయిల్ చేశాడు. ఈ మెయిల్స్ గురించి సీఎం కార్యాలయ సిబ్బంది ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రెస్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నిందితుడు ముంబై నాలసొపరా ప్రాంతంలో ఉన్నాడని తెలియడంతో ఓ బృందం అక్కడకు వెళ్లి అభిషేక్ తివారీని అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. -
అమిత్ షాపై దాడి చేస్తాం : హెచ్చరిక లేఖ కలకలం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా గంజ్ బసోడా బీజేపీ ఎమ్మెల్యే లీనా జైన్‌కు వచ్చిన ఓ లేఖ కలకలం రేపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడు పట్టణానికి వస్తే అప్పుడు ఆయనపై బాంబు దాడులకు తెగబడతామని, ఆయనను హతమారుస్తామని తనకు లేఖ వచ్చిందని ఎమ్మెల్యే లీలా జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్ధానిక రైల్వే స్టేషన్, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్లను పేల్చివేస్తామని, ఎమ్మెల్యేను చంపుతామని తనకు అందిన హెచ్చరిక లేఖలో ప్రస్తావించారని ఆమె తెలిపారని గంజ్ బసోడా ఇన్స్పెక్టర్ ప్రకాష్ శర్మ వెల్లడించారు. హెచ్చరిక లేఖ నేపథ్యంలో రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామని, మతిస్ధిమితం లేని కొందరు ఈ హెచ్చరికలు చేసినట్టుగా ప్రాధమిక దర్యాప్తులో తేలిందని విదిశ ఎస్పీ వినాయక్ వర్మ చెప్పారు. -
ఆ ఆలయాన్ని పేల్చేస్తాం : లష్కరే
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో భీకర దాడులతో అలజడి సృష్టిస్తామని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరించింది. అక్టోబర్ 20, నవంబర్ 9 తేదీల్లో భీకర దాడులు చేపడతామని లష్కర్ ఏరియా కమాండర్ మౌల్వి అబు షేక్ రావల్పిండి నుంచి హెచ్చరిక లేఖ రాసినట్టు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. అక్టోబర్ 20న ఎలాంటి విధ్వంసం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నా నవంబర్ 9న ఎలాంటి అలజడి రేగుతుందనే ఆందోళనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని పేల్చివేస్తామని సైతం లష్కరే హెచ్చరించడంతో నిఘా, భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఉగ్ర సంస్థ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసిందనే అనుమానంతో భోపాల్, గ్వాలియర్, కట్ని, జబల్పూర్లో హై అలర్ట్ ప్రకటించారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌లకు లష్కరే దాడుల హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. 2008 నవంబర్ 26న ముంబై పేలుళ్లలో 166 మంది మరణించడం, 300 మందికి పైగా గాయపడిన దారుణ ఘటనను లష్కరే ఉగ్రవాద సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే. -
విప్రోపై బయోదాడి చేస్తానంటూ మెయిల్
బెంగుళూరు: కంపెనీ కార్యాలయాలపై బయోదాడి చేస్తానని దేశవాళీ ఐటీ దిగ్గజం విప్రోకు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఈ మేరకు కంపెనీ సైబర్ సెక్యూరిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ-మెయిల్‌కు అటాచ్ చేసిన ఓ లింక్‌కు రూ.500 కోట్లను బిట్కాయిన్ల(డిజిటల్ మనీ) రూపంలో చెల్లించాలని లేకపోతే కంపెనీ కార్యాలయాలపై బయోదాడి తప్పదని మెయిల్లో ఉంది. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు సైబర్ టెర్రరిజం కింద కేసును నమోదు చేశారు. 20 రోజుల్లోగా రూ.500 కోట్లు చెల్లించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సివుంటుందని బెదరింపు మెయిల్లో ఉంది. బయోదాడిలో భాగంగా ప్రాణాంతకమైన రిజిన్(క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్లలో దొరుకుతుంది)ను వినియోగిస్తానని మెయిల్లో అగంతకుడు పేర్కొన్నాడు. విప్రోలోని పలువురు సీనియర్ అధికారులందరికీ బెదిరింపు మెయిల్ వెళ్లింది. రిజిన్ను కంపెనీలో ఉండే కేఫ్‌లో వినియోగిస్తామని లేకపోతే డ్రోన్ ద్వారా కంపెనీ ఆవరణలో వెదజల్లుతామని లేదా టాయిలట్ పేపర్ ద్వారా ఇలా ఏ రూపంలోనైనా దాడి జరగొచ్చని మెయిల్లో వివరించాడు అగంతకుడు. కేవలం బెదిరింపుతో ఇది ఆగిపోదని శాంపిల్‌గా రెండు గ్రాముల రెజిన్‌ను బెంగుళూరులోని విప్రో బ్రాంచ్‌లకు కొద్ది రోజుల్లో పంపుతానని.. ఆగంతకుడు హెచ్చరించాడు. తన వద్ద మొత్తం ఒక కిలో రెజిన్ ఉన్నట్లు చెప్పాడు. ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో 22 వీధి కుక్కలు మరణించడానికి తానే కారణమని రెజిన్‌ను వాటిపై ప్రయోగించడం వల్లే అవి మరణించాయని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ను కూడా ఈ-మెయిల్‌కు జత చేశాడు. బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన విప్రో.. దేశంలోని అన్ని బ్రాంచ్‌లలో భద్రతను కట్టుదిట్టం చేసింది. రాబోవు రోజుల్లో కంపెనీ ఆపరేషన్లు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.