ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను పేల్చివేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈమెయిల్ పంపిన వ్యక్తి 48 గంటల్లో బిట్‌కాయిన్ రూపంలో 1 మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) డిమాండ్ చేసినట్లు సమాచారం.
quaidacasrol@gmail.com ద్వారా బెదిరింపు ఈమెయిల్ పంపినందుకు గుర్తు తెలియని వ్యక్తిపై సహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఫీడ్‌బ్యాక్ ఇన్‌బాక్స్‌కు మెయిల్ వచ్చినట్లు తెలిసింది. ‘బిట్‌కాయిన్‌లో 1 మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) బదిలీ చేయకపోతే 48 గంటల్లో టెర్మినల్ 2ను పేల్చేస్తాం. 24 గంటల తర్వాత మరొక హెచ్చరిక ఉంటుంది’ అని మెయిల్ వచ్చింది.
ఇదీ చదవండి: 2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ.. : టెస్లా
దాంతో ఆ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లు 385(బలవంతపు వసూళ్లు), 505(1)(బి) (ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రకటనలు చేయడం) కింద కేసు నమోదు చేశారు. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను పెంచారు. ప్రాథమిక విచారణలో ఈమెయిల్ పంపిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐసీ) చిరునామాను పోలీసులు ట్రాక్ చేశారు. పోలీస్ సైబర్ విభాగం మెయిల్ లొకేషన్‌ను గుర్తించినట్లు సమచారం.
Comments
Please login to add a commentAdd a comment