ముంబయి: ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల కార్యాలయాలపై దాడులు చేస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కి మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు దుండగులు ఈమెయిల్ పంపించారని ముంబయి పోలీసులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రాజీనామా చేయాలని బెదిరింపు మెయిల్‌లో దుండగులు డిమాండ్ చేశారు.
బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబయిలోని 11 చోట్ల మొత్తం 11 బాంబు దాడులు జరుగుతాయని దుండగులు మెయిల్‌లో పేర్కొన్నారు. మెయిల్‌లో పేర్కొన్న అన్ని ప్రాంతాలకు వెళ్లి గాలించినా ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు.
ఈమెయిల్‌కు ఖిలాఫత్ ఇండియా అనే యూజర్ పేరు ఉంది. నిర్మలా సీతారామన్, శక్తికాంత దాస్‌లు కుంభకోణంలో ఉన్నారని ఈమెయిల్ పంపిన వ్యక్తి ఆరోపించారు. కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment