ఆర్బీఐ ఆఫీసుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్‌ | Mumbai Reserve Bank of India Office Gets Threat Mail | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ ఆఫీసుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్‌

Published Fri, Dec 13 2024 10:45 AM | Last Updated on Fri, Dec 13 2024 11:58 AM

Mumbai Reserve Bank of India Office Gets Threat Mail

ఢిల్లీ: దేశంలో బాంబు బెదిరింపుల కాల్స్‌, మెయిల్స్‌ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సైతం ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ బెదిరింపు రావడం కలకలం సృష్టించింది.

వివరాల ప్రకారం.. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ శుక్రవారం ఓ మెయిల్‌ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధికారిక ఈ-మెయిల్‌ ఐడీకి ఈ బెదిరింపు రావడం గమనార్హం. అయితే, సదరు మెయిల్‌లో బెదిరింపులు రష్యన్‌ భాషలో వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో, వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆర్బీఐ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మేరకు ఘటనపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్‌ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇక, ఇటీవలి కాలంలో బెదిరింపు కాల్స్‌, మెయిల్స్‌ సంఖ్యలో పెరిగింది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని దాదాపు 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గడిచిన నాలుగు రోజుల్లోనే ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండో సారి. మరోవైపు.. పలు విమాన సర్వీసులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది బాంబు బెదిరింపుల సంఖ్య ఏకంగా 900పైగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement