Bomb Squad teams
-
ఢిల్లీలో 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు.. పోలీసులకు చిక్కిన విద్యార్థి
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులకు సంబంధించి క్లాస్ 12 విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో పరీక్ష జరగకూడదనే కారణంగానే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. బాంబు బెదిరింపులకు సంబంధించి సదరు విద్యార్థే ఆరు సార్లు మెయిల్స్ పంపినట్టు గుర్తించారు.ఇటీవలి కాలంలో ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో బెదిరింపు మెయిల్స్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థినే పలుమార్లు బెదిరింపులకు కారణమని గుర్తించారు. దీంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పాఠశాలలో పరీక్ష జరగకూడదనే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. ఈ విద్యార్థే ఆరుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. సదరు బాలుడు ఎంతో ప్లాన్ ప్రకారం ఇలా చేసినట్టు తెలుస్తోంది. ప్రతిసారీ అతడు.. తన సొంత పాఠశాలలను కాకుండా వేరే పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ పంపించాడు. అనుమానం రాకుండా ఉండటానికి ఇలా చేసినట్టు అధికారులు వెల్లడించారు. అతను ఒకసారి 23 పాఠశాలలకు మెయిల్ పంపాడని అధికారులు తెలిపారు.మరోవైపు.. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం సైతం వేడెక్కింది. శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి అతిషి.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను విమర్శించడంతో బాంబు బెదిరింపులు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ క్రమంలో ఆప్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. -
ఆర్బీఐ ఆఫీసుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్
ఢిల్లీ: దేశంలో బాంబు బెదిరింపుల కాల్స్, మెయిల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సైతం ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ బెదిరింపు రావడం కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ శుక్రవారం ఓ మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారిక ఈ-మెయిల్ ఐడీకి ఈ బెదిరింపు రావడం గమనార్హం. అయితే, సదరు మెయిల్లో బెదిరింపులు రష్యన్ భాషలో వచ్చినట్లు పోలీసులు తెలిపారు.దీంతో, వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆర్బీఐ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మేరకు ఘటనపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.ఇక, ఇటీవలి కాలంలో బెదిరింపు కాల్స్, మెయిల్స్ సంఖ్యలో పెరిగింది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని దాదాపు 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గడిచిన నాలుగు రోజుల్లోనే ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండో సారి. మరోవైపు.. పలు విమాన సర్వీసులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది బాంబు బెదిరింపుల సంఖ్య ఏకంగా 900పైగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. Mumbai | A threatening email was received on the official website of Reserve Bank of India. The email was in Russian language, warned to blow up the bank. A case has been registered against unknown accused in Mata Ramabai Marg (MRA Marg) police station. Investigation into the…— ANI (@ANI) December 13, 2024 -
అప్రమత్తంగా ఉండండి
సీఎం సభలో అవరోధాలు సృష్టించొచ్చు బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి అదనపు ఎస్పీ ఆదేశాలు కర్నూలు: సీఎం బహిరంగ సభలో కొంతమంది అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. కర్నూలు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి బందోబస్తు విధులు నిర్వహించేందుకు భారీ సంఖ్యలో సోమవారం సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయానికి తరలివచ్చారు. పరేడ్ మైదానంలో హాజరైన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందికి అదనపు ఎస్పీ సూచనలు, జాగ్రత్తలను తెలియజేశారు. సీఎం పర్యటన పూర్తయ్యే వరకు చెక్‌పోస్టు, బస్టాండు, రైల్వే స్టేషన్ లాడ్జీలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద వీవీఐపీలను మాత్రమే అనుమతించాలని సూచించారు. అనుమానితులు కనిపించగానే సంబంధిత సెక్టార్ ఇన్‌చార్జీలకు వెంటనే సమాచారం అందించాలన్నారు. అనంతరం ఏపీఎస్పీ రెండవ పటాలంలోని హెలిప్యాడ్, ప్రభుత్వ అతిధిగృహం, ఔట్‌డోర్ స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ రిహార్సల్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, కె.శ్రీనివాసులు, వై.హరినాథ్‌రెడ్డి, బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు. బాంబ్ స్వ్కాడ్ బృందాలుముమ్మర తనిఖీ: మూడు బాంబ్‌స్క్వాడ్ బృందాలు, రెండు డాగ్‌స్వ్కాడ్ బృందాలు సోమవారం నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఏపీఎస్పీ మైదానంలోని హెలిప్యాడ్ వద్ద నుంచి ఔట్‌డోర్ స్టేడియంలోని బహిరంగ సభ స్థలం వరకు రోడ్లకు ఇరువైపులా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల పార్కింగ్ స్థలాలు ఇవే ►వీఐపీ వాహనాల పార్కింగ్ ఎస్టీబీసీ కళాశాల మైదానం. ►స్కూలు విద్యార్థులు, మహిళా సంఘాలు, ఇతర ప్రజలు తరలివచ్చే వాహనాలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్. ►బహిరంగ సభకు ప్రవేశ ద్వారాలు ►వీవీఐపీలకు ఔట్‌డోర్ స్టేడియం మెయిన్‌గేటు, మహిళా సంఘాలు, స్కూలు విద్యార్థులకు సింహపురి కాలనీ స్కూలు గేటు, మున్సిపల్ ఆఫీసు గేటు ద్వారా ప్రవేశం. వాహనాల దారి మళ్లింపు కర్నూలు నగరంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆదోని, కోడుమూరు వైపు నుంచి వచ్చే వాహనాలు బళ్లారి చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండు వైపు నిషేధం ప్రకటించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కల్లూరు, బిర్లాగేటు, కలెక్టరేట్, రాజ్‌విహార్ మీదుగా ఎగ్జిబిషన్ మైదానం చేరుకోవాల్సి ఉంటుంది.