ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంపై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ సంస్థ సీఈఓ, కోఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
అంతేకాదు తన సంస్థపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో విజయ్ కుమార్ శర్మ.. కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు.
ఈ భేటీలో ఆర్‌బీఐ ఆంక్షలతో పేటీఎంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. విజయ్ శేఖర్ శర్మ మాట్లాడిన పలు అంశాలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే సాధ్యమైనంత వరకు సమస్య మరింత జఠిలం కాకుండా ఆర్‌బీఐతో మీరే మాట్లాడి పరిష్కరించుకుంటే బాగుంటుందనే సలహా కూడా ఇచ్చారని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి.
ఆర్‌బీఐ అధికారులతో భేటీ అయిన విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తరువాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని జారీ చేసిన ఆదేశాల్ని పొడిగించాలని కోరినట్లు సమాచారం. పేటీఎం అధినేత విజ్ఞప్తిపై ఆర్‌బీఐ ఎలా స్పందించిందనే తెలియాల్సి ఉంది. ఆర్‌బీఐ-పేటీఎం వివాదం నేపథ్యంలో ఇటీవలే నిర్మలా సీతారామన్ ఓ కార్యక్రమంలో స్పందించారు. పేటీఎంపై విధించిన ఆంక్షలు గురించి పేటీఎం-ఆర్‌బీఐలు పరిష్కరించుకోవాల్సిన అంశంమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment