ముకేశ్‌ అంబానీకి బెదిరింపులు | Reliance chairman Mukesh Ambani receives death threat via mail | Sakshi
Sakshi News home page

ముకేశ్‌ అంబానీకి బెదిరింపులు

Published Sun, Oct 29 2023 5:25 AM | Last Updated on Sun, Oct 29 2023 6:06 AM

Reliance chairman Mukesh Ambani receives death threat via mail - Sakshi

ముంబై: కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి అంబానీ సంస్థకు చెందిన ఓ ఈ–మొయిల్‌ ఐడీకి శుక్రవారం మెయిల్‌ వచ్చింది. ‘మా దగ్గర మంచి షూటర్లు ఉన్నారు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’అని ఆ మెయిల్‌ సారాంశం. దీంతో, ముకేశ్‌ అంబానీ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాదాబ్‌ ఖాన్‌ అనే వ్యక్తి నుంచి ఆ  మెయిల్‌ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది సైతం ముకేశ్‌ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఓ వ్యక్తి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్‌ ఆస్పత్రికి ఫోన్‌ చేసి ‘ఆసుపత్రిని పేల్చేస్తాం. అంబానీ కుటుంబాన్ని చంపేస్తాం’అని బెదిరించాడు.  2021లో ముంబైలోని అంబానీ  నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement