
సాక్షి, హైదరాబాద్: కొంతమంది ఫోన్ చేసి తనను బెదిరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బుధవారం శాసనసభ దృష్టికి తెచ్చారు. బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర పురోభివృద్ధికి శ్రమిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో విపక్షాలు చేస్తున్న విమర్శలకు మీడియా ముఖంగా సమాధానం చెబితే రౌడీల చేత తనకు ఫోన్‌కాల్స్ చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగువర్గాలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై కొన్ని పారీ్టలు కుట్రలు చేస్తున్నాయని, ఆ వర్గాలను ఆర్థికంగా బలోపేతం కాకుండా చూడాలన్నదే వాళ్ళ ఆలోచనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment