
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా గంజ్ బసోడా బీజేపీ ఎమ్మెల్యే లీనా జైన్‌కు వచ్చిన ఓ లేఖ కలకలం రేపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడు పట్టణానికి వస్తే అప్పుడు ఆయనపై బాంబు దాడులకు తెగబడతామని, ఆయనను హతమారుస్తామని తనకు లేఖ వచ్చిందని ఎమ్మెల్యే లీలా జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్ధానిక రైల్వే స్టేషన్, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్‌లను పేల్చివేస్తామని, ఎమ్మెల్యేను చంపుతామని తనకు అందిన హెచ్చరిక లేఖలో ప్రస్తావించారని ఆమె తెలిపారని గంజ్ బసోడా ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ శర్మ వెల్లడించారు. హెచ్చరిక లేఖ నేపథ్యంలో రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామని, మతిస్ధిమితం లేని కొందరు ఈ హెచ్చరికలు చేసినట్టుగా ప్రాధమిక దర్యాప్తులో తేలిందని విదిశ ఎస్పీ వినాయక్ వర్మ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment