పాట్నా: బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆఫీసును బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నితీశ్‌కుమార్ ఆఫీసు పేల్చేస్తామని అల్‌ఖైదా పేరుతో శనివారం బెదిరింపు మెయిల్ వచ్చిందని, తనిఖీలు చేయగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
మెయిల్ పంపిన వ్యక్తిని కోల్‌కతాలో అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. మెయిల్ పంపిన వ్యక్తి బిహార్ జిల్లాలోని బెగుసరాయ్‌కి చెందిన మహ్మద్ జాహెద్‌గా గుర్తించారు. జాహెద్ కోల్‌కతాలో పాన్‌షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతడు నితీశ్‌కుమార్‌కు ఎందుకు బెదిరింపు మెయిల్ పంపాడన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల బిహార్‌లో స్కూళ్లకు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్‌లు ఎక్కువయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment