సాక్షి, చెన్నై: చెన్నై డీజీపీ కార్యాలయానికి బుధవారం రాత్రి వచి్చన ఒక ఈ మెయిల్ పోలీసులను పరుగులు తీయిస్తోంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టామని, సాహసం చేసి కని పెట్టండి అని వచ్చిన ఆ బెదిరింపు మెయిల్‌తో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సమయం ఆసన్నం అవుతోండటంతో చెన్నై నగరంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసే విధంగా కమిషనర్ సందీప్‌రాయ్ రాథోర్ ఆదేశాలు ఇచ్చారు.
400 చోట్ల సోదాలు జరిపే విధంగా , 15 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండే రీతిలో చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితులలో బుధవారం రాత్రి డీజీపీ కార్యాలయానికి ఓ ఈ మెయిల్ వచి్చంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టినట్టు, బెసెంట్ నగర్, ఎలియట్స్ బీచ్‌లలో బాంబులు పెట్టి్టనట్లు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో బాంబ్, డాగ్ స్క్వాడ్ ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలిస్తున్నాయి. నగరంలో తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్టుగా గతంలో వెలుగు చూసిన ›ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసి సోదాలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment