జైపూర్: ప్రాణ హాని ఉందన్న ఫిర్యాదుపై సకాలంలో అధికారులు స్పందించి ఉంటే.. ఇవాళ తన తండ్రి బతికే ఉండేవాడని కన్హయ్యలాల్ తేలీ కొడుకు యశ్ తేలీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రిని చంపిన నరరూప రాక్షసులను ప్రాణాలతో ఉంచకూడదని రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు అతను.
ఆ రాక్షసులను జైళ్లో కూర్చోబెట్టి జనాలు పన్నుల రూపంలో చెల్లించే సొమ్ముతో మేపాల్సిన అవసరం లేదు. అలాంటి మృగాలకు ఈ భూమ్మీద బతికే హక్కే లేదు. సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నా కూడా ఇంకా ఎందుకు న్యాయం జరగడంలో ఆలస్యం చేయడం?. వాళ్లను చంపినప్పుడే మాకు మనశ్శాంతి అని యశ్ ఓ ఇంటర్వ్యూలో కామెంట్లు చేశాడు. తన తండ్రి కన్హయ్య, నూపుర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు తెలిపాడన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదని, ఏనాడూ తన తండ్రి ఆ విషయం తమ వద్ద ప్రస్తావించలేదని యశ్ తెలిపాడు.
కేవలం ప్రాణహాని ఉందన్న విషయం మేరకే ఆయన పోలీసులను ఆశ్రయించాడన్న విషయం మాత్రమే తమకు తెలుసని, ఆ అభ్యర్థనలో ఆయన ఏం పేర్కొన్నాడో తెలియదని యశ్ చెప్తున్నాడు. పోలీసులు సకాలంలో స్పందించి భద్రత కల్పించి ఉంటే.. తన తండ్రి బతికి ఉండేవాడేమో అనే ఆశను వ్యక్తం చేశాడు యశ్. యశ్.. కన్హయ్యలాల్ పెద్ద కొడుకు. పరిహారంగా అతనికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించింది. ఇప్పుడు ఆ కుటుంబానికి అతనే ఆధారం.
ఇదిలా ఉండగా.. రాజస్థాన్ ఉదయ్‌పూర్ భూత్ మహల్ ఏరియాలో టైలర్ కన్హయ్యలాల్.. రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్‌లు పైశాచికతంగా చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నూపుర్‌కు ప్రవక్త వ్యాఖ్యలకు మద్ధతు తెలిపినందుకే చంపామంటూ ఆపై నిందితులు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఉగ్ర కోణం వెలుగు చూడడంతో ఎన్‌ఐఏ వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment