Communal
-
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను హెచ్చరించింది. ప్రచార సమయంలో కులం, భాష, మతపరమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఇరు పార్టీలకు ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది.ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో సహా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టార్ క్యాంపెయినర్లకు ఒక నోట్ జారీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున్ ఖర్గే, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలను ఈసీ ఆదేశించింది. వారి ప్రసంగాలను సరి చేసుకొవటంతోపాటు, తగిన శ్రద్ధ వహించాలని తెలియజేయాలన్నారు. వారసత్వంగా వస్తున్న నాణ్యమైన ఎన్నికల ప్రక్రియను దిగజార్చడాన్ని ఊరుకోబోమని ఎన్నికల సంఘం తేల్చి చేప్పింది.ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు సైతం ఎటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఈసీ సూచించింది. అగ్ని వీర్ వంటి పథకాలపై ప్రసంగించే సమయంలో సాయుధ బలగాలకు రాజకీయం చేవద్దని తెలిది. అలా చేస్తే సాయుధ బలగాల సామాజిక, సాంస్కృతిక ప్రతిష్టను దెబ్బతీయటం అవుతుందని కాంగ్రెస్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం
జమ్మూ కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ముస్లిం సంస్థ తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(ఊపా) కింద చట్టవిరుద్ధమైన సంస్థగా తెహ్రీక్-ఎ-హురియత్ని కేంద్రం ప్రకటించింది. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ గతంలో ఈ సంస్థకు నేతృత్వం వహించారు. జమ్మూ కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలనను నెలకొల్పేందుకు ఈ సంస్థ నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు భారత వ్యతిరేక విధానాన్ని ప్రచారం చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తుందని గుర్తించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. "ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఏ వ్యక్తి లేదా సంస్థనైనా అడ్డుకుంటాం " అని అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు. దేశవ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు జమ్మూ కశ్మీర్లో ముస్లిం లీగ్‌ను కేంద్రం ఇప్పటికే నిషేధించింది. కశ్మీర్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రేరేపిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిణామాల తర్వాత తెహ్రీక్-ఎ-హురియత్ సంస్థపై నిషేధం పడింది. ఇదీ చదవండి: కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో కీలక ప్రయోగం.. వాటిపైనే అధ్యయనం -
సభలో మాటలతో చంపేశారు: బీఎస్పీ ఎంపీ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఈ వివాదంపై మరో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పందిస్తూ మా ఎంపీ చేసింది తప్పే కానీ అంతకుముందు డానిష్ అలీ చేసింది కూడా తప్పేనని దానిపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై పరుషమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ మతపరమైన విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే రేపాయి. ఇతర పార్టీల ఎంపీల తోపాటు బీజేపీ నాయకులు కూడా రమేష్ బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తుండగా సహచర బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాత్రం బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తూనే డానిష్ అలీని కూడా విచారించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. आज भाजपा के कुछ नेता एक नैरेटिव चलाने का प्रयास कर रहे हैं कि संसद में मैंने श्री रमेश बिदूरी को भड़कया, जबकि सच्चाई यह है कि मैंने प्रधानमंत्री पद की गरिमा को बचाने का काम किया और सभापति जी को मोदी जी से संबंधित घोर आपत्तिजनक शब्दों को सदन की कार्रवाई से हटाने की माँग की थी। pic.twitter.com/s5u0Ptb0Ou — Kunwar Danish Ali (@KDanishAli) September 23, 2023 ఈ సందర్బంగా నిశికాంత్ దూబే ఏమన్నారంటే.. లోక్‌సభలో రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం ఆమోదించదగినవి కాదని, అదే సమయంలో డానిష్ అలీ ప్రధానిని కులం పేరుతో దూషించారు కాబట్టి రమేష్ ఆ విధంగా స్పందించారని.. డానిష్ అలీ వ్యాఖ్యలపై కూడా విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. లోక్‌సభ నియమావళి ప్రకారం ఒక సభ్యుడు మాట్లాడుతుండగా కూర్చుని ఉన్న మరో సభ్యుడు అదేపనిగా అడ్డుపడడం కూడా నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. 15 ఏళ్లుగా నేను ఎంపీగా ఉన్నాను కానీ ఇలాంటి ఒకరోజును నేను చూస్తానని ఎన్నడూ అనుకోలేదన్నారు. #WATCH | Delhi: On BJP MP Ramesh Bidhuri's remark, BJP MP Nishikant Dubey says "...The words used by him are not acceptable. I was present in the Parliament when all this took place. BSP MP Danish Ali kept calling PM Modi 'neech'. I have written a letter to Lok Sabha Speaker Om… pic.twitter.com/TIg4A9bc1a — ANI (@ANI) September 23, 2023 నిశికాంత్ దూబే వ్యాఖలపై బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పందిస్తూ.. సభలో నన్ను మొదట మాటాలతో చంపేశారు ఇప్పుడు సభ వెలుపల నన్ను శారీరకంగా చంపాలని చూస్తున్నారన్నారు. ఇక ఈ విషయంపై రమేష్ బిధూరీ స్పందించడానికి నిరాకరించారు.. మొదట డానిష్ ఆలీ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కాబట్టే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఏదేమైనా ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది సభాపతి కాబట్టి దానిపై తాను మాట్లాడదలచుకోలేదని చెప్పి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె! -
'పాక్‌కు ఎందుకు వెళ్లలేదు..?' టీచర్ అనుచిత వ్యాఖ్యలు..
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన మరవక ముందే ఢిల్లీలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. దేశ విభజన సమయంలో పాక్‌కు ఎందుకు వెళ్లలేదని తమ టీచర్ ప్రశ్నించినట్లు నలుగురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సదరు టీచర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హేమా గులాటి, గాంధీ నగర్‌లోని ప్రభుత్వ సర్వోదయ బాల్ విద్యాలయాలో పనిచేస్తున్నారు. టీచర్ తమపై మతపరమైన వ్యాఖ్యలు చేసినట్లు నలుగురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాబా, మక్కా, ఖురాన్‌పై కూడా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో పాక్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించినట్లు చెప్పారు. స్వాతంత్య్ర సమరంలో ఎలాంటి పాత్ర పోషించకుండానే దేశంలో ఉంటున్నారని వ్యాఖ్యానించినట్లు విద్యార్థులు పోలీసులకు తెలిపారు. బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించారు. పాఠశాలల్లో ఇలాంటి విద్వేషాలకు తావివ్వకూడదని చెప్పారు. ఆ టీచర్ని స్కూల్ నుంచి బహిష్కరించాలని కోరారు. సరైన అవగాహన లేని విషయాలపై టీచర్లు మాట్లాడకూడదని చెప్పారు. విద్యార్థుల్లో వైషమ్యాలను కలిగించే విధంగా పాఠాలు ఉండకూడదని అన్నారు. ఈ ఘటనపై స్థానిక ఆప్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బాజ్పై ఈ ఘటనపై స్పందించారు. టీచర్ ఇలా మాట్లాడకూడదని అన్నారు. పిల్లలకు మంచి పాఠాలు చెప్పే విధంగా ఉండాలని చెప్పారు. మతాలపై టీచర్లు తమ సొంత వైఖరిని తరగతి గదిలో మాట్లాడకూడదని అన్నారు. ఆ టీచర్‌పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూపీలో ఇటీవల ఓ టీచర్ తరగతి గదిలో ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించింది. అయితే ఈ ఘటనలో తాను మతపరమైన ఉద్దేశంతో చేయలేదని చెప్పారు. విద్యార్థులకు బుద్ధి చెప్పే క్రమంలో ఇలా చేయాల్సి వచ్చిందని సమాధానమిచ్చుకున్నారు. ఇదీ చదవండి: Muzaffarnagar School Video Controversy: స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్ .. ఏం చెప్పిందంటే! -
స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాబాపూర్ గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలోని క్లాస్‌రూమ్‌లో ఆగస్టు 24న జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మ్యాథ్స్ టేబుల్ నేర్చుకోలేదని ఏడేళ్ల ముస్లిం బాలుడిని తోటీ విద్యార్ధులతో టీచర్ అమానుషంగా దాడి చేయించింది. కాగా ఈ వీడియోను బాలుడి బంధువు నదీవ్ అనే వ్యక్తి వీడియో తీశారు. ఇందులో టీచర్.. విద్యార్థి ముఖం మీద దాడి చేయవద్దని, వెన్నులో కొట్టాలని స్టూడెంట్స్‌కు చెప్పడం వినిపిస్తోంది. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత విద్వేషాలను రెచ్చగెట్టే విధంగా టీచర్ వ్యవహరించడం రాజకీయ దుమారాన్ని రేపింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురు నేతలు ఈ చర్యను ఖండిస్తూ.. టీచర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దేవాలయంగా భావించే పవిత్రమైన పాఠశాలలో విద్యార్థుల్లో విద్వేషాలను నింపుతున్నారని.. అధికార బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "Main ne to declare kar diya hai Jitne Mohammad bacche Hain inko mar ke bhijao" : Lady Teacher, Tripta Tyagi, headmistress of Neha Public School , Mansurpuri, Muzaffarnagar, UP And the man has a Rascal's laugh..Ha...ha..ha The cost of being a Muslim Kid in India today pic.twitter.com/ZciNQKbxfz — ᎠϴΝ ⚽ (@_Jhon_D_N__30) August 25, 2023 తాజాగా ఈ వైరల్ వీడియోపై టీచర్ త్రిప్తా త్యాగి స్పందించారు. ముస్లిం విద్యార్థిపై దాడి చేసిన చర్యను ఆమె సమర్థించుకున్నారు. బాధితుడు 5వ గుణితం నేర్చుకోవాలని చెప్పానని.. సెలవులు వచ్చినా నేర్చుకోలేదని అన్నారు. అందుకే ఇతర విద్యార్థులతో కొట్టించానన్నారు. ఈ ఘటనలో మతపరమైన కోణాన్ని ఆమె కొట్టిపారేశారు. బాలుడు తన హోంవర్క్ చేయనందున అతన్ని కొట్టమని కొంతమంది విద్యార్థులను కోరినట్లు చెప్పారు. అతనితో కఠినంగా ఉండమని పిల్లల తల్లిదండ్రుల నుంచే ఒత్తిడి వచ్చిందన్నారు. తాను దివ్యాంగురాలు అవ్వడం వల్ల కొంతమంది విద్యార్థులతో కొట్టించానని చెప్పుకొచ్చారు. అయితే వీడియోను ఎడిట్ చేసి మతపరమైన కోణం వచ్చేలా బయడకు విడుదల చేశారని ఆమె ఆరోపించారు. విద్యార్ధి బంధువు క్లాస్‌లో కూర్చొని ఆ వీడియోను అతను రికార్డ్ చేశాడని తరువాత దాని ఎడట్ చేశాడని ఆన్నారు. విద్యార్ధిని ఉద్ధేశపూర్వకంగా కొట్టించలేదని.. తన తప్పును అంగీకరిస్తున్నానని చెప్పారు. కానీ అనవసరంగా దీనిని పెద్ద సమస్యగా మార్చవద్దని కోరారు. ‘ఇది చిన్న సమస్య అని రాజకీయ నాయకులకు చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీతో సహా ఇతర నేతలు దీనిపై ట్వీట్ చేశారు. ఇది అంత పెద్ద విషయం కాదు. ఇలాంటి చిన్న విషయాలను వైరల్ చేస్తే టీచర్లు ఎలా పనిచేస్తారు.’ అని ఆమె ప్రవర్తనను వెనకేసొచ్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదైనట్లు ముజాఫర్‌నగర్ కలెక్టర్ అరవింద్ మల్లప్ప తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా చిన్నారికి, అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. A fake anti hindu propaganda is being run by Leftist Islamist gang and Anti Hindu Political leaders over Muzaffarnagar School incident Truth is: - There is no Hindu Muslim angle in this incident - Mslm kid didn't complete his homework - Teacher was worried abt studies of Mslm… pic.twitter.com/PMnjbmgDwd — STAR Boy (@Starboy2079) August 25, 2023 మరోవైపు టీచర్ కొట్టిపించడంపై బాధిత విద్యార్థి మాట్లాడుతూ.. ‘నేను గణిత పట్టికలు నేర్చుకోలేదు. నేను తప్పు చేశానని టీచర్ కొట్టమని చెప్పింది. తోటి విద్యార్థులతో కొట్టించింది. నాపై గట్టిగా దాడిచేయాలని ఆదేశించింది. వారు నన్ను గంటపాటు కొట్టారు’ అని వాపోయాడు. తన కొడుకు వయసు 7 ఏళ్లు అని, గంట, రెండు గంటలపాటు అతడిని చిత్రహింసలకు గురిచేశాడని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలపై ఆరోపణలు చేయనని.. అయితే ఇకపై తన బిడ్డను ఆ పాఠశాలకు పంపకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. Perhaps ppl on Twitter r deaf. In d video Tripta Tyagi can be clearly heard saying,"Why don't you hit hard?" What is wrong in this? Maybe she isn't getting full satisfaction. Every1 has a right to be satisfied. I stand with #Mrs_Tyagi,a teacher frm #Muzaffarnagar#मुस्लिम_बच्चे pic.twitter.com/rAbIFeVqwS — K.R.Tripathi🇮🇳🙏🚩 (@t97688663) August 25, 2023 ఇదిలా ఉండగా ముజఫర్ నగర్ వైరల్ వీడియోలో చెంప దెబ్బ కొట్టిన విద్యార్ధులతో బాధితుడిని కౌగించుకునేలా చేశారు రైతు సంఘాల నాయకుడు నరేష్ తికాయత్. అందరూ ద్వేషాన్ని వదిలేసి సోదరభావాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. कांग्रेस के स्थानीय नेताओं की पहल पर किसान नेता नरेश टिकैत ने #Muzaffarnagar की वायरल वीडियो में थप्पड़ मारने वाले छात्र और पीड़ित छात्र को गले मिलवाया. ख़ुशी की बात है कि सभी ने आगे बढ़कर भाईचारा क़ायम रखने के लिए नफ़रत को खुलकर नकारा है.pic.twitter.com/qfMzgiAgja — Aditya Goswami आदित्य गोस्वामी (@AdityaGoswami_) August 26, 2023 -
'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
చంఢీగర్: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగాలు ప్రతి ఒక్కరినీ కాపాడలేవని అన్నారు. రాష్ట్ర పౌరులు సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని కోరారు. కొన్నిసార్లు సైన్యం, పోలీసులు ఇందుకు హామీ ఇవ్వలేకపోవచ్చని చెప్పారు. హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వీరిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది. నష్టపరిహారం ఎవరిస్తారు..? అల్లర్లలో జరిగిన నష్టానికి పరిహారాన్ని ఎవరిస్తారని మీడియా అడిగిన ప్రశ్నలకు ఖట్టర్ వివాదాస్పదంగా మాట్లాడారు. అల్లర్లకు కారణమైనవారే నష్టాన్ని బర్తీ చేస్తారని అన్నారు. ప్రభుత్వం నష్టాన్నంతటికీ పరిహారాలు ఇవ్వబోదని అన్నారు. కేవలం నష్టపోయిన ప్రభుత్వ ఆస్తులకు మాత్రమే పరిహారాన్ని కేటాయిస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆస్తులకు ప్రభుత్వం జవాబుదారీ కాదని వెల్లడించారు. హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు జారీ చేసిన నోటిసుల్లో పేర్కొంది. ఇదీ చదవండి: అల్లర్లతో ఢిల్లీ హై అలర్ట్.. భద్రతపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు.. -
ఉదయ్‌పూర్ ఘటన:.. కన్హయ్యలాల్ కొడుకు ఆవేదన
జైపూర్: ప్రాణ హాని ఉందన్న ఫిర్యాదుపై సకాలంలో అధికారులు స్పందించి ఉంటే.. ఇవాళ తన తండ్రి బతికే ఉండేవాడని కన్హయ్యలాల్ తేలీ కొడుకు యశ్ తేలీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రిని చంపిన నరరూప రాక్షసులను ప్రాణాలతో ఉంచకూడదని రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు అతను. ఆ రాక్షసులను జైళ్లో కూర్చోబెట్టి జనాలు పన్నుల రూపంలో చెల్లించే సొమ్ముతో మేపాల్సిన అవసరం లేదు. అలాంటి మృగాలకు ఈ భూమ్మీద బతికే హక్కే లేదు. సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నా కూడా ఇంకా ఎందుకు న్యాయం జరగడంలో ఆలస్యం చేయడం?. వాళ్లను చంపినప్పుడే మాకు మనశ్శాంతి అని యశ్ ఓ ఇంటర్వ్యూలో కామెంట్లు చేశాడు. తన తండ్రి కన్హయ్య, నూపుర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు తెలిపాడన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదని, ఏనాడూ తన తండ్రి ఆ విషయం తమ వద్ద ప్రస్తావించలేదని యశ్ తెలిపాడు. కేవలం ప్రాణహాని ఉందన్న విషయం మేరకే ఆయన పోలీసులను ఆశ్రయించాడన్న విషయం మాత్రమే తమకు తెలుసని, ఆ అభ్యర్థనలో ఆయన ఏం పేర్కొన్నాడో తెలియదని యశ్ చెప్తున్నాడు. పోలీసులు సకాలంలో స్పందించి భద్రత కల్పించి ఉంటే.. తన తండ్రి బతికి ఉండేవాడేమో అనే ఆశను వ్యక్తం చేశాడు యశ్. యశ్.. కన్హయ్యలాల్ పెద్ద కొడుకు. పరిహారంగా అతనికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించింది. ఇప్పుడు ఆ కుటుంబానికి అతనే ఆధారం. ఇదిలా ఉండగా.. రాజస్థాన్ ఉదయ్‌పూర్ భూత్ మహల్ ఏరియాలో టైలర్ కన్హయ్యలాల్.. రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్‌లు పైశాచికతంగా చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నూపుర్‌కు ప్రవక్త వ్యాఖ్యలకు మద్ధతు తెలిపినందుకే చంపామంటూ ఆపై నిందితులు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఉగ్ర కోణం వెలుగు చూడడంతో ఎన్ఐఏ వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. చదవండి: ఉదయ్‌పూర్ హత్యోదంతం: ఎక్స్ట్రా డబ్బులుచ్చి మరీ.. -
ఉదయ్‌పూర్ కంటే ముందే మరో ఘటన! దర్యాప్తు ముమ్మరం
ముంబై: రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంలో ఉగ్రకోణం వెలుగు చూడడంతో నిఘా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. పాక్ ఉగ్రవాద సంస్థలతో నిందితులకు సంబంధం ఉన్నట్లు తేలడంతో పాటు మరికొన్ని కీలకాంశాలను సైతం రాజస్థాన్ పోలీసులు విచారణ ద్వారా వెలుగులోకి తెచ్చారు. అయితే.. ఈ ఘటన కంటే ముందే మహారాష్ట్రలో దాదాపుగా ఇదే తరహాలో జరిగిన ఓ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో దర్యాప్తు ఊపందుకుంది. మహారాష్ట్ర అమరావతిలో మెడికల్ సామాగ్రి వ్యాపారి ఉమేష్ కోల్హే హత్య పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఆయన్ని కూడా కన్హయ్య లాల్ తరహాలోనే దుండగులు గొంతుకోసి హతమార్చారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇతర వివరాలేవీ బయటకు పొక్కనివ్వడం లేదు. అయితే స్థానిక బీజేపీ నేతలు మాత్రం.. ఇది నూపుర్ శర్మ కామెంట్లకు ముడిపడిన ఘటనే అని చెప్తున్నారు. జూన్ 21వ తేదీ రాత్రి దుకాణం నుంచి తిరిగి వస్తున్న టైంలో ఉమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన్ని గొంతుకోసి చంపి పారిపోయినట్లు.. వెనుక మరో బైక్ మీద వస్తున్న ఉమేష్ కొడుకు, ఉమేష్ భార్యలు ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించి.. అబ్దుల్ తౌఫిక్, షోయెబ్ ఖాన్, అతీఖ్ రషీద్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవేళ అది దొంగతనంలో భాగమే అయితే.. ఉమేష్ వెంట ఉన్న డబ్బును తీసుకెళ్లేవాళ్లు. కానీ, ఆయన్ని ఎందుకు హత్య చేసి ఉంటారన్నది ఇప్పుడు పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాదు.. కోల్హే తన సోషల్ మీడియాలో నూపుర్ శర్మకు అనుకూలంగా కొన్ని పోస్టులు షేర్ చేశారని, వాటిని వాట్సాప్ గ్రూపుల్లోనూ పంచుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శివరాయ్ కులకర్ణి.. అమరావతి కమిషనర్ ఆర్తి సింగ్‌ను కలిసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లోపే ఉదయ్‌పూర్ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించిన పోలీసులు.. దర్యాప్తు చేయిస్తున్నారు. చదవండి: ఉదయ్‌పూర్ ఘటన.. భయపడినట్టుగానే జరిగింది!! -
పప్పు సేన నన్ను మిస్ అవుతోంది : కంగన
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు వరుస కేసుల షాక్ తగులుతోంది. ఇప్పటికే కర్నాటక కోర్టు ఆదేశాలకు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు కాగా తాజాగా బాంద్రా కోర్ట్ కంగనాకు మరో ఝలక్ ఇచ్చింది. అంతేకాదు కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌కి ఇబ్బందులు తప్పలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై అవమానకరమైన వ్యాఖ్యలు,సోషల్ మీడియాలో మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు నమోదైంది. దీన్ని విచారించిన బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు కంగనా, ఆమె సోదరి రంగోలి చందేల్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఇద్దరు సోదరీమణులు బాలీవుడ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురించి అవమానకరమైన వ్యాఖ్యలను ట్వీట్ చేస్తున్నారని ఆరోపించిన మున్నవారాలి అకాసాహిల్ అహస్రఫాలి సయ్యద్ ఈ ఫిర్యాదును నమోదు చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి ట్వీట్లు మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేరకు బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించానని, కాని వారు దానిని నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. దీంతో బాంద్రా కోర్టును ఆశ్రయించానన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన కంగనా మహారాష్ట్రలోని పప్పు సేనకు తనపై మక్కువ ఎక్కువై పోయిందంటూ వ్యంగ్యంగా కమెంట్ చేశారు. అంత మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను అంటూ ట్వీట్ చేశారు. తన నవరాత్రి ఉపవాస ఫోటోలను షేర్ చేశారు. కాగా వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తుమకూరు కోర్టు ఆదేశాల మేరకు క్యతాసంద్ర పోలీస్ స్టేషన్లో కంగనాపై ఎఫ్ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే. Who all are fasting on Navratris? Pictures clicked from today’s celebrations as I am also fasting, meanwhile another FIR filed against me, Pappu sena in Maharashtra seems to be obsessing over me, don’t miss me so much I will be there soon ❤️#Navratri pic.twitter.com/qRW8HVNf0F — Kangana Ranaut (@KanganaTeam) October 17, 2020 -
వామపక్షాల ఐక్యతతోనే మతోన్మాద అంతం
సాక్షి, హైదరాబాద్: వామపక్షాల ఐక్యతతోనే మతోన్మాదాన్ని అంతం చేయగలమని ఎంసీపీఐ(యు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎం.డి.గౌస్ అన్నారు. ఎంసీపీఐ–ఆర్‌ఎంపీఐ పార్టీల ఐక్యత సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ‘వర్తమాన రాజకీయాలు– వామపక్షపార్టీల ఐక్యత అవకాశాలు’పై సదస్సు జరిగింది. సదస్సులో ఆర్‌ఎంపీఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మంగత్‌రాం పాస్లా, చైర్మన్ గంగాధరన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. గౌస్ మాట్లాడుతూ.. మత స్వేచ్ఛను హరించివేయడం, పౌరహక్కులను అణచివేయడం, ప్రజల ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలపైనా ఆంక్షలు విధించడం వంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలనే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందని ఈ 2 పార్టీలనుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం వామపక్షపార్టీలపై ఉందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన బహుజన లెఫ్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) కారుచీకటిలో కాంతిరేఖ వంటిదన్నారు. కాంగ్రెస్, బీజేపీ,టీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా వామపక్షా లు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎంసీపీఐ–ఆర్‌ఎమ్‌పీఐ ముఖ్యనేతలు కిరణ్జిత్, నారాయణన్, మద్దికాయల అశోక్, అనుభవదాస్ శాస్త్రి, కాటం నాగభూషణం, వనం సుధాకర్, హర్‌కమల్‌లు పాల్గొన్నారు. -
'స్టేషన్లో మూడు గంటలు కూర్చోబెట్టి రైలెక్కించారు'
-
ఇలా కూడా ఉండొచ్చు
వర్జీనియా: సామూహిక సహజీవనానికి ఆ గ్రామం నిలువెత్తు నిదర్శణం. అక్కడ ఎవరికి సొంత ఇళ్లు ఉండవు. సొంత కార్లు ఉండవు. సొంత పొలాలు ఉండవు. సొంత వ్యాపారం అంటూ ఉండదు. అందరూ అన్ని పంచుకోవాల్సిందే. సమష్టిగా కలసిమెలసి పనిచేయాలి. ఫలితాన్ని సమంగా పంచుకోవాలి. పిల్లల పెంపకం కూడా సమష్టి బాధ్యతగా చూసుకుంటారు. ఎవరి వ్యక్తిగత కుటుంబం వారికున్నప్పటికీ కమ్యూన్ ఇళ్లలోనే అందరు కలిసి మెలసి జీవిస్తారు. పరస్పరం సహాయ, సహకారాలు అందించుకున్నప్పటికీ ఎవరి ఇష్టం ప్రకారం వారు వంట చేసుకొని తింటారు. పండుగలు, పబ్బాలను మాత్రం సమష్టిగానే జరుపుకుంటారు. ఎవరైనాఇంటర్నెట్, టీవీలు చూడవచ్చు. వీడియో గేమ్స్ ఆడకూడదు. తుపాకుల లాంటి మారణాయుధాలు కలిగివుండరాదు. బిడ్డలను కనాలంటే కమ్యూనిటి అనుమతి తప్పనిసరి. ఆధునిక ప్రపంచానికి దూరంగా, ఎక్కడో అటవి ప్రాంతంలో ఆదిమ తెగవాళ్లు ఇలా సామూహిక సహ జీవితాన్ని అనుభవిస్తుండవచ్చని పొరపాటు పడవచ్చు. కానీ అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం, లౌసా కౌంటీలోని ఓ గ్రామం ప్రజలు అలా జీవిస్తున్నారంటే ఆశ్చర్యం కలగవచ్చు. ఆ గ్రామం పేరు 'ట్విన్ ఓక్స్'. లౌసా కౌంటీకి సరిగ్గా ఎనిమిది మైళ్ల దూరంలో ఉంది. గ్రామం మొత్తం జనాభా 105 మంది. అందులో పెద్దవాళ్లు 92 మందికాగా, పిల్లలు 13 మంది. సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఆ గ్రామం ఏర్పడింది. ఆ గ్రామంలో అందరు కలసి సమష్టి వ్యవసాయం చేస్తారు. గ్రామానికి అవసరమైన మేరకు ధాన్యాలను భద్రపర్చుకొని మిగతావి సమీపంలోని మార్కెట్లో విక్ర యిస్తారు. ఆవులను పోషిస్తూ పాలను విక్రయిస్తారు. అలా వచ్చిన సొమ్ము కమ్యూనిటీ ఖాతాలోకి వెళుతుంది. గ్రామంలోని పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యాభై ఏళ్లలోపున్న ప్రతి ఒక్కరు వారానికి 48 గంటలు కమ్యూన్ వ్యవసాయంలో పనిచేయాలి. యాభై ఏళ్ల పైబడిన వారు రోజుకు గంట చొప్పున కమ్యూనిటీ గార్డెనింగ్ లాంటివి చూసుకోవాలి. పిల్లల పోషణ సమష్టి బాధ్యత. ఒక్కో కమ్యూనిటీ ఇంట్లో దాదాపు 20 మంది నివసిస్తారు. గ్రామస్థులు జీవితంలో ఒక్కరినే పెళ్లి చేసుకుంటారు. వారిలో ఇప్పటి వరకు విడాకులంటూ లేవు. సంతానానికి వారిస్తున్న ప్రాధాన్యత తక్కువ. కమ్యూనిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి కావడం అందుకు కారణం కావచ్చు. కమ్యూనిటీలో పనిచేసే ప్రతి వ్యక్తికి ఆడ, మగ తేడా లేకుండా నెలకు దాదాపు ఆరువేల రూపాయలను జీవన భృతిగా చెల్లిస్తారు. సరైన ఉద్యోగంలేక దారిద్య్రంలో బతుకుతున్న వారంతా కలసి 48 ఏళ్ల క్రితం ఆ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అప్పటి నుంచే ఈ కమ్యూనిటీ జీవితాన్ని ప్రారంభించారట. ఇప్పుడు వారికి దారిద్య్రం అంటే తెలియదు. అలాగని ధనవంతులయ్యే అవకాశం లేదు. తామంతా కమ్యూనిటీ జీవితాన్ని గడుపుతుండడం వల్ల తమకు డబ్బనేది అర్థంలేని విషయంగానే కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ సమష్టి సహ జీవనం తమకు ఎంతో ఆనందంగా ఉందని, తమ మధ్యనే ప్రేమలు, పెళ్లిల్లూ జరుగుతుండడం వల్ల బయటి ప్రపంచంతో తాము పెద్దగా సంబంధాలు కూడా కోరుకోవడం లేదని వారు తెలియజేస్తున్నారు. మొన్నటి వరకు ఓ కార్పొరేట్ కంపెనీలో సీఈవోగా పనిచేసిన మహిళ తన మాజీ భర్త, సాపో అనే తన ఎనిమిదేళ్ల పాపతో వచ్చి కొత్తగా వారి కమ్యూనిటీలో చేరింది. తనకు వారి కమ్యూనిటీ జీవితం ఎంతో నచ్చిందని, ఎంతోకాలం నిరీక్షణ తర్వాత తనకు కమ్యూనిటీలో చేరే అవకాశం చిక్కిందని ఆమె మీడియాకు తెలియజేశారు. కమ్యూనిటీలో చేరేందుకు ఇంకా చాలా మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారట. ఈ కమ్యూనిటీ జీవితం పట్ల మొఖం చిట్లిస్తున్న వారూ లేకపోలేదు. 'నాతోటి పిల్లలు లేకపోవడం వల్ల నాకు ఇక్కడ బోర్ కొడుతోంది. ఎంతసేపు ఈ పొలాల మధ్య బతుకుతాను. బయటకెళ్లి పబ్లిక్ స్కూల్లో చేరాలనుకుంటున్నాను. అందుకు కమ్యూనిటీ అనుమతి కూడా తీసుకున్నాను' అని 22 ఏళ్ల ఇమాని కాలెన్ వ్యాఖ్యానించారు.