జమ్మూ కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ముస్లిం సంస్థ తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(ఊపా) కింద చట్టవిరుద్ధమైన సంస్థగా తెహ్రీక్-ఎ-హురియత్‌ని కేంద్రం ప్రకటించింది. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ గతంలో ఈ సంస్థకు నేతృత్వం వహించారు.
జమ్మూ కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలనను నెలకొల్పేందుకు ఈ సంస్థ నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు భారత వ్యతిరేక విధానాన్ని ప్రచారం చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తుందని గుర్తించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు.
"ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఏ వ్యక్తి లేదా సంస్థనైనా అడ్డుకుంటాం " అని అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు.
దేశవ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు జమ్మూ కశ్మీర్‌లో ముస్లిం లీగ్‌ను కేంద్రం ఇప్పటికే నిషేధించింది. కశ్మీర్‌లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రేరేపిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిణామాల తర్వాత తెహ్రీక్-ఎ-హురియత్ సంస్థపై నిషేధం పడింది.
ఇదీ చదవండి: కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో కీలక ప్రయోగం.. వాటిపైనే అధ్యయనం
Comments
Please login to add a commentAdd a comment