organisations
-
‘ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు మార్చాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) 18వ లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) డిమాండ్ చేస్తోంది. ఈమేరకు ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిపింది. కారణం ఇదే.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు తేదీలు శుక్రవారం వస్తాయి. దీంతో ఎన్నికల తేదీలను మార్చాలని ఐయూఎంఎల్ డిమాండ్ చేస్తోంది. శుక్రవారం ముస్లింలకు ముఖ్యమైన రోజు కాబట్టి ఓటర్లు, అధికారులు, అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను మార్చాలని ఈసీఐని ఆశ్రయించనున్నట్లు యూడీఎఫ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మిత్రపక్షమైన ఐయూఎంఎల్ తెలిపింది. ఐయూఎంఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలామ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రార్థనల కోసం మసీదులలో గుమిగూడే ముస్లింలకు శుక్రవారం ముఖ్యమైన రోజు అన్నారు. “శుక్రవారం పోలింగ్ నిర్వహణ ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఈసీఐని ఆశ్రయిస్తాం” అని సలామ్ పేర్కొన్నారు. ఐయూఎంఎల్‌తోపాటు ఇతర ముస్లిం సంస్థలు కూడా ఎన్నికల తేదీల మార్పు కోసం ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం
జమ్మూ కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ముస్లిం సంస్థ తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(ఊపా) కింద చట్టవిరుద్ధమైన సంస్థగా తెహ్రీక్-ఎ-హురియత్ని కేంద్రం ప్రకటించింది. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ గతంలో ఈ సంస్థకు నేతృత్వం వహించారు. జమ్మూ కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలనను నెలకొల్పేందుకు ఈ సంస్థ నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు భారత వ్యతిరేక విధానాన్ని ప్రచారం చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తుందని గుర్తించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. "ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఏ వ్యక్తి లేదా సంస్థనైనా అడ్డుకుంటాం " అని అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు. దేశవ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు జమ్మూ కశ్మీర్లో ముస్లిం లీగ్‌ను కేంద్రం ఇప్పటికే నిషేధించింది. కశ్మీర్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రేరేపిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిణామాల తర్వాత తెహ్రీక్-ఎ-హురియత్ సంస్థపై నిషేధం పడింది. ఇదీ చదవండి: కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో కీలక ప్రయోగం.. వాటిపైనే అధ్యయనం -
మణిపూర్ హింస: తొమ్మిది మైతీ సంస్థలపై నిషేధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తొమ్మిది మైతీ తీవ్రవాద గ్రూపులు, వాటి అనుబంధ సంస్థలపై నిషేధాన్ని పొడిగించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థలపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. వేర్పాటువాద, విధ్వంసక, తీవ్రవాద, హింసాత్మక కార్యకలాపాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మణిపూర్‌లో భద్రతా బలగాలు, పోలీసులు, పౌరులపై దాడులు సహా, దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు హానికరమైన కార్యకలాపాలను చేపడుతున్న తొమ్మిది మైతీ తీవ్రవాద సంస్థలపై నిషేధం విధించింది. దేశ వ్యతిరేక కార్యకలాపలు, భద్రతా బలగాలపై ప్రాణాంతకమైన దాడులకు పాల్పడుతున్నారంటూ పీఎల్ఏ( పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ )తోపాటు దాని రాజకీయ విభాగం, రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (RPF), యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ సహా తొమ్మిది సంస్థలు, అనుబంధ విభాగాలపై ఐదేళ్లపాటు నిషేధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దాని రాజకీయ విభాగం రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్పీఎఫ్)తో పాటు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) దాని సాయుధ విభాగం, మణిపూర్ పీపుల్స్ ఆర్మీ(ఎంపీఏ), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పీఆర్ఈపీఎకే), రెడ్ ఆర్మీ అని పిలవబడే దాని సాయుధ విభాగం కంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ(కేసీపీ), రెడ్ ఆర్మీ విభాగం, కంగ్లీ యావోల్ కాన్బలుప్ (కేవైకేఎల్), కోఆర్డినేషన్ కమిటీ (కేఓఆర్కామ్), అలయన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ (ఎఎస్యూకే)లను చట్టవిరుద్దమైన సంఘాలుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సంస్థలపై విధించిన నిషేధం సోమవారం నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. సాయుధ పోరాటం ద్వారా మణిపూర్ ను భారతదేశం నుండి వేరు చేసి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడం కోసం స్థానిక ప్రజలను ప్రేరేపించడమే ఈ సమూహాల లక్ష్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా ఈ ఏడాది మే 3నుంచి మణిపూర్ మైతీ గిరిజన కుకీ కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోగా కనీసం 50వేల మంది నిరాశ్రయులయ్యారు. -
సీజేఐకి మీడియా సంస్థల లేఖ
ఢిల్లీ: న్యూస్‌క్లిక్ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థను అరెస్టు కూడా చేశారు. అయితే.. ఈ వ్యవహారంపై మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్నలిస్టులను విచారించేందుకు దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక విధివిధానాలు ఉండాలని కోరుతూ 18 మీడియా సంస్థలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. 'దేశంలో తమపై ప్రతీకార దాడులు జరుగుతాయని జర్నలిస్టులు భయంతో పనిచేస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడంలేదు. వీరిపై ప్రతికారంతో లక్షిత ప్రతీకార దాడులు జరుగుతాయనే భయభ్రాంతులకు గురిచేస్తోంది. చట్టం నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని కోరుకోవడం లేదు. కానీ పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య లక్ష్యాలు దెబ్బతింటాయి. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉంటాం.' అని సీజేఐ చంద్రచూడ్‌కు మీడియా సంస్థలు లేఖ రాశాయి. న్యూస్‌క్లిక్ ఆన్లైన్ పోర్టల్ విదేశాల నుంచి నిధులను అక్రమంగా పొందిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు న్యూస్‌క్లిక్ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ల్యాప్‌ట్యాప్, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: నిందితుల జాబితాలో ఆప్! -
వ్యాక్సిన్ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా?
చెన్నై: కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ కీలకమని ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. మరో పక్క టీకా వేసుకుంటే ఏమౌతుందో అన్న అపోహ ఇంకా పలు చోట్ల ఉండడంతో వ్యాక్సినేషన్‌కు ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో తమిళనాడులో ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ వేయుంచుకున్న వారికి లక్కీ డ్రా రూపంలో విలువైన వస్తువులను అందిస్తోంది. ఈ లక్కీ డ్రాలో బిర్యానీ, మిక్సీ గ్రైండర్, 2 గ్రాముల బంగారం, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్కూటర్‌ను బహుమతులుగా ఇస్తామని చెప్పడంతో ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే..బైకు, బంగారం మీకే కోవలం ప్రాంతంలో సుమారు 7000 జనాభా ఉండగా, గత రెండు నెలల్లో కేవలం 58 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకునే వారి సంఖ్య తగ్గుతుందనే ఆందోళనతో ఆ ప్రాంతానికి చెందిన ఎస్ఎన్ రామ్‌దాస్ ఫౌండేషన్, ఎస్టిఎస్ ఫౌండేషన్, చిరాజ్ ట్రస్ట్‌కు చెందిన వలంటీర్లు చేతులు కలిపి ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్నావారికి ఉచిత బిర్యానీ భోజనం అందించడం ప్రారంభించారు. అనంతరం దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, ముగ్గురు వ్యక్తులకు మిక్సీ, గ్రైండర్ , 2-గ్రాముల బంగారు నాణెలను లక్కీ డ్రా ద్వారా ఇవ్వడం ప్రారంభించారు. రాను రాను అందులో విజేతలకు బహుమతిగా రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్కూటర్‌ను కూడా జత చేర్చారు. ఈ నేపథ్యంలో కొత్తగా టీకా వేయించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలా ఈ లక్కీ డ్రా వల్ల కేవలం మూడు రోజుల్లో 345 మందికి టీకాలు వేసుకున్నారు. చదవండి: మంత్రి ప్రకటనపై ప్రజలు హర్షం, ఆ వెంటనే యూటర్న్.. -
ట్రంప్ సంస్థలపై క్రిమినల్ ఇన్వేస్టిగేషన్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంస్థలపై క్రిమినల్ విచారణను జరపనున్నారు. ఇప్పటి వరకు ఆయన వ్యాపార లావాదేవీల విషయంలో సివిల్ కోణంలో విచారణ సాగుతోంది. అయితే ట్రంప్ సంస్థకు చెందిన కేసుల విచారణ ఇకపై క్రిమినల్ కోణంలోనూ దర్యాప్తు ఉంటుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ ప్రతినిధి లెటీటియా జేమ్స్ తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ సంస్థలకు తెలియజేసినట్లు జేమ్స్ చెప్పారు. రుణాల కోసం, అలాగే ఆర్థిక పన్ను ప్రయోజనాలను పొందటానికి ట్రంప్ సంస్థలు ఆస్తి విలువలను తప్పుగా నివేదించాయా లేదా అని అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ దర్యాప్తు చేస్తున్నారు. అధిక రుణాలు పొందటానికి ట్రంప్ సంస్థలు కొన్ని ఆస్తుల విలువలను పెంచి, ఆస్తిపన్ను మినహాయింపులను పొందటానికి కొన్నింటి విలువలను తగ్గించాయన్న అభియోగంపై దర్యాప్తు జరగతున్నట్లు జేమ్స్ పేర్కొన్నారు. వీటి వల్ల ఆ సంస్థలు చట్టవ్యతిరేకంగా లాభం పొందాయన్న కోణంలో ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతోంది. ట్రంప్ మాత్రం ఈ దర్యాప్తు తతంగమంతా రాజకీయ కక్షతోనే తనను టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. చదవండి: USA: భార్యతో గొడవ.. భర్తకు షాకిచ్చిన అమెరికా కోర్టు -
పూర్తిస్థాయి ఆస్తుల వివరాలతో రండి
► 9వ షెడ్యూల్లోని సంస్థల విభజనపై కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వెవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజనకు సంబం దించి ఆయా సంస్థలకు ఉన్న ఆస్తుల పూర్తి వివరాలతో మళ్లీ సమావే శానికి రావాలని 2 రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఈ సంస్థల విభజనకు కేంద్రం మంగళవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఏపీ డెయిరీ కార్పొరేషన్ ఎండీ మురళి, తెలంగాణ మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చంద్ర, ఆగ్రో చైర్మన్ కిషన్‌రావు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో ఆర్టీసీ, డెయిరీ, ఆగ్రో, ఏపీ ఫుడ్స్ సంస్థల విభజనపై చర్చించినట్టు సమాచారం. ఈ సంస్థలకు 2 రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల పూర్తిస్థాయి వివరాలతో మరోసారి సమావే శానికి హాజరుకావాలని హోం శాఖ ఆదేశించిన ట్టు తెలుస్తోంది. ఆగ్రోకు సంబంధించి ఉమ్మడి ఏపీ లోని స్థిరాస్థుల వివరాలు తీసుకురావాలని ఆదేశించినట్టు సమాచారం. ఆగ్రో ఆస్తులన్నీ తెలంగాణకు చెందిన వేనని, తెలంగాణ నుంచి గజం భూమి కూడా ఏపీకి దక్కదని ఆగ్రో చైర్మన్ లింగం పల్లి కిషన్‌రావు పేర్కొన్నారు. 1942లో నిజాం పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో మౌలాలి కేంద్రంగా 20 ఎకరాల్లో ఫర్టిలైజర్ కంపెనీ ఏర్పాటు చేశారన్నారు. ఈ ఆస్తిలో ఏపీ వాటా కోరడం అన్యాయమన్నారు. ఆగ్రో ప్రధాన కార్యాలయం అద్దె భవనంలో ఉంద న్నారు. ఏపీ డెయిరీ కార్పొరేషన్ ఎండీ మురళి మాట్లా డుతూ..ఏపీ డెయిరీకి సోమాజిగూడ లో అతిథి గృహం, 1.4 ఎకరాల భూమి, 44 ఎక రాల్లో ప్రధాన కార్యాలయం ఉందన్నారు. -
రైతులకు కావల్సింది సంస్థ కాదు రుణమాఫీ