
పూర్తిస్థాయి ఆస్తుల వివరాలతో రండి
► 9వ షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వెవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విభజనకు సంబం దించి ఆయా సంస్థలకు ఉన్న ఆస్తుల పూర్తి వివరాలతో మళ్లీ సమావే శానికి రావాలని 2 రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఈ సంస్థల విభజనకు కేంద్రం మంగళవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఏపీ డెయిరీ కార్పొరేషన్ ఎండీ మురళి, తెలంగాణ మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చంద్ర, ఆగ్రో చైర్మన్ కిషన్‌రావు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ భేటీలో ఆర్టీసీ, డెయిరీ, ఆగ్రో, ఏపీ ఫుడ్స్ సంస్థల విభజనపై చర్చించినట్టు సమాచారం. ఈ సంస్థలకు 2 రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల పూర్తిస్థాయి వివరాలతో మరోసారి సమావే శానికి హాజరుకావాలని హోం శాఖ ఆదేశించిన ట్టు తెలుస్తోంది. ఆగ్రోకు సంబంధించి ఉమ్మడి ఏపీ లోని స్థిరాస్థుల వివరాలు తీసుకురావాలని ఆదేశించినట్టు సమాచారం. ఆగ్రో ఆస్తులన్నీ తెలంగాణకు చెందిన వేనని, తెలంగాణ నుంచి గజం భూమి కూడా ఏపీకి దక్కదని ఆగ్రో చైర్మన్ లింగం పల్లి కిషన్‌రావు పేర్కొన్నారు.
1942లో నిజాం పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో మౌలాలి కేంద్రంగా 20 ఎకరాల్లో ఫర్టిలైజర్ కంపెనీ ఏర్పాటు చేశారన్నారు. ఈ ఆస్తిలో ఏపీ వాటా కోరడం అన్యాయమన్నారు. ఆగ్రో ప్రధాన కార్యాలయం అద్దె భవనంలో ఉంద న్నారు. ఏపీ డెయిరీ కార్పొరేషన్ ఎండీ మురళి మాట్లా డుతూ..ఏపీ డెయిరీకి సోమాజిగూడ లో అతిథి గృహం, 1.4 ఎకరాల భూమి, 44 ఎక రాల్లో ప్రధాన కార్యాలయం ఉందన్నారు.