
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంస్థలపై క్రిమినల్ విచారణను జరపనున్నారు. ఇప్పటి వరకు ఆయన వ్యాపార లావాదేవీల విషయంలో సివిల్ కోణంలో విచారణ సాగుతోంది. అయితే ట్రంప్ సంస్థకు చెందిన కేసుల విచారణ ఇకపై క్రిమినల్ కోణంలోనూ దర్యాప్తు ఉంటుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ ప్రతినిధి లెటీటియా జేమ్స్ తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ సంస్థలకు తెలియజేసినట్లు జేమ్స్ చెప్పారు.
రుణాల కోసం, అలాగే ఆర్థిక పన్ను ప్రయోజనాలను పొందటానికి ట్రంప్ సంస్థలు ఆస్తి విలువలను తప్పుగా నివేదించాయా లేదా అని అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ దర్యాప్తు చేస్తున్నారు. అధిక రుణాలు పొందటానికి ట్రంప్ సంస్థలు కొన్ని ఆస్తుల విలువలను పెంచి, ఆస్తిపన్ను మినహాయింపులను పొందటానికి కొన్నింటి విలువలను తగ్గించాయన్న అభియోగంపై దర్యాప్తు జరగతున్నట్లు జేమ్స్ పేర్కొన్నారు. వీటి వల్ల ఆ సంస్థలు చట్టవ్యతిరేకంగా లాభం పొందాయన్న కోణంలో ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతోంది. ట్రంప్ మాత్రం ఈ దర్యాప్తు తతంగమంతా రాజకీయ కక్షతోనే తనను టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment