ఢిల్లీ: న్యూస్‌క్లిక్ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థను అరెస్టు కూడా చేశారు. అయితే.. ఈ వ్యవహారంపై మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్నలిస్టులను విచారించేందుకు దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక విధివిధానాలు ఉండాలని కోరుతూ 18 మీడియా సంస్థలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.
'దేశంలో తమపై ప్రతీకార దాడులు జరుగుతాయని జర్నలిస్టులు భయంతో పనిచేస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడంలేదు. వీరిపై ప్రతికారంతో లక్షిత ప్రతీకార దాడులు జరుగుతాయనే భయభ్రాంతులకు గురిచేస్తోంది. చట్టం నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని కోరుకోవడం లేదు. కానీ పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య లక్ష‍్యాలు దెబ్బతింటాయి. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉంటాం.' అని సీజేఐ చంద్రచూడ్‌కు మీడియా సంస్థలు లేఖ రాశాయి.
న్యూస్‌క్లిక్ ఆన్‌లైన్ పోర్టల్ విదేశాల నుంచి నిధులను అక్రమంగా పొందిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు న్యూస్‌క్లిక్ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ల్యాప్‌ట్యాప్, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: నిందితుల జాబితాలో ఆప్!
Comments
Please login to add a commentAdd a comment