Muslim Laws
-
తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం
జమ్మూ కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ముస్లిం సంస్థ తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(ఊపా) కింద చట్టవిరుద్ధమైన సంస్థగా తెహ్రీక్-ఎ-హురియత్ని కేంద్రం ప్రకటించింది. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ గతంలో ఈ సంస్థకు నేతృత్వం వహించారు. జమ్మూ కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలనను నెలకొల్పేందుకు ఈ సంస్థ నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు భారత వ్యతిరేక విధానాన్ని ప్రచారం చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తుందని గుర్తించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. "ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఏ వ్యక్తి లేదా సంస్థనైనా అడ్డుకుంటాం " అని అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు. దేశవ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు జమ్మూ కశ్మీర్లో ముస్లిం లీగ్‌ను కేంద్రం ఇప్పటికే నిషేధించింది. కశ్మీర్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రేరేపిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిణామాల తర్వాత తెహ్రీక్-ఎ-హురియత్ సంస్థపై నిషేధం పడింది. ఇదీ చదవండి: కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో కీలక ప్రయోగం.. వాటిపైనే అధ్యయనం -
ట్రిపుల్ తలాక్‌పై మరో పిటిషన్ వద్దు
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన మరో రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఈ అంశంపై తుది తీర్పు రిజర్వ్ లో ఉండగా, మరొకటి దాఖలు చేయాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. వివాదాస్పదంగా మారిన తలాక్, బహుభార్యత్వం అంశంపై ఈ ఏడాది మే 11 నుంచి ఆరు రోజులపాటు విచారణ జరిగింది. మతపరమైన హక్కా? లేదా రాజ్యంగ బద్ధమైనదా? అన్న అంశంపైనే సుప్రీంలో వాదనలు జరిగాయి. మే 17 ఇస్లాం మహిళల నుంచి అభిప్రాయసేకరణ చేపట్టాలని కేంద్రానికి సూచిస్తూ తుది తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో గురుదాస్ మిత్రా అనే వ్యక్తి మరో పిటిషన్ దాఖలు చేయగా, ట్రిపుల్ తలాక్(అహసన్ తలాక్, హసన్ తలాక్ మరియు తలాక్ ఉల్ బిద్దత్) అనేది ఇస్లాం మహిళల హక్కులను ఉల్లంఘించే చర్యేనని సీనియర్ న్యాయవాది సౌమ్య చక్రవర్తి వాదించారు. అయితే ఇదే అంశం గత పిటిషన్లో కూడా ఉందని పేర్కొంటూ న్యాయమూర్తులు జేఎస్ ఖేర్కర్ మరియు డీవై చంద్రచూడ్‌లు తాజా పిటిషన్‌ను కొట్టివేశారు.