మృతి చెందిన యువకుడు ఏర్పుల శ్రీశైలం, యువకుని తల్లిదండ్రులను పరామర్శిస్తున్న నవీన్ కుమార్( మల్లన్న)
నాంపల్లి (మునుగోడు): తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహ త్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం (22) ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్రలో మూడు నెలల పాటు కళాకారుడిగా పని చేశాడు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సందర్భం గా రెండ్రోజుల పాటు ఇంట్లోనే టీవీకి అతుక్కుపోయి కౌంటింగ్ ప్రక్రియను చూశాడు. శనివారం రాత్రి మల్లన్న ఓడిపోయాడని తెలిసి భోజ నం చేయలేదు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు డబ్బాను తీసుకుని పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి తాగాడు. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేయగా వారు ఎత్తలేదు.
అంతలో అతడిని గమనించిన తల్లిదండ్రులు, చెల్లెలు ఇలా ఎందుకు చేశావని శ్రీశైలాన్ని అడిగారు. తీన్మార్ మల్లన్న ఓడిపోవడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని అన్నాడని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం శ్రీశైలాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీశైలం తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు. శ్రీశైలం కుటుంబసభ్యులను ఆదివారం తీన్మార్ మల్లన్న పరామర్శించారు. కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. శ్రీశైలం చెల్లెలి వివాహానికి రూ.లక్ష చెక్కును అందజేశారు.
చదవండి: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న
Comments
Please login to add a commentAdd a comment