అనంత పురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంత పురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిలమత్తూరు మండలం నల్లగుట్ట పల్లికి చెందిన నవీన్ కుమార్ అనే టెన్త్ విద్యార్థి సైకిల్ పై వెళుతుండగా.. పక్క నుంచి వెళ్లిన రెండు ఐషర్ వాహనాలు ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో నవీన్కుమార్ అక్కడి కక్కడే మృతి చెందాడు. రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.