సాక్షి, తిరుపతి: ఏపీలో ఆదివారం తెల్లవారుజామున వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతులను నెల్లూరు జిల్లా, అనంతపూర్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను అతి వేగంలో ఉన్న కారు వచ్చి ఢీకొట్టింది. కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, వీరంతా అరుణాచలం నుంచి దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని నెల్లూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
మరోవైపు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఘెర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలో లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. మృతులను అనంతపురం స్టాలిన్ నగర్‌కు చెందిన చాకలి పవన్, శ్రీనివాస్, ముస్తాక్, ఎస్. పవన్‌గా గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని అనంతపురం ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి
Comments
Please login to add a commentAdd a comment