జంట కమిషనరేట్లలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ
నగర సీసీఎస్ డీసీపీగా రవివర్మ సైబరాబాద్ సీసీఎస్ డీసీపీగా నవీన్‌కుమార్
సిటీబ్యూరో: ప్రభుత్వం మంగళవారం 35 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో జంట పోలీసు కమిషనరేట్లలో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఐదుగురు కొత్తవారు వచ్చారు. నగర సీసీఎస్ డీసీపీగా ఉన్న పాలరాజును ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో ఆయన స్థానంలో ఎల్బీనగర్ డీసీపీగా ఉన్న రవివర్మను నియమించారు.
ఎల్బీనగర్ డీసీపీగా తస్వీర్ ఎక్బాల్‌ను నియమించారు. ఇక సైబరాబాద్ సీసీఎస్ డీసీపీగా బి.నవీన్‌కుమార్‌ను నియమించారు. బాలానగర్ డీసీపీగా ఉన్న ఏఆర్ శ్రీనివాస్‌ను శంషాబాద్ డీసీపీగా బదిలీ చేశారు. బాలానగర్ డీసీపీగా డాక్టర్ శిముషి వాజపేయి, నగర జాయింట్ కమిషనర్ (అడ్మిన్)గా టి.మురళీకృష్ణ, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా ఎస్.జె.జనార్ధన్‌లు నియమితులయ్యారు.