బెంగళూరు: సంచలనం సృష్టించిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్(55) హత్యకేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం తొలి చార్జిషీట్‌ను బెంగళూరులోని అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలుచేసింది. ఈ చార్జిషీట్‌లో హిందుత్వ కార్యకర్త నవీన్ కుమార్‌ను నిందితుడిగా సిట్ పేర్కొంది. నిందితుడిపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు ఆయుధ చట్టం కింద కేసు సిట్ నమోదుచేసింది. గౌరీ ఇంటివద్ద రెక్కీ నిర్వహించిన నవీన్ ఆమె హంతకులకు ఆయుధాలను సరఫరా చేశాడని సిట్ చార్జిషీట్‌లో తెలిపింది. హత్యచేసేందుకు నిందితుల్ని గౌరి ఇంటివద్దకు నవీన్ తీసుకెళ్లాడని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment