charge sheet file
-
ఈడీ చార్జిషీట్లో ప్రియాంక పేరు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు, వ్యాపారవేత్త సి.సి.థాంపీ నిందితుడుగా ఉన్న అక్రమ నగదు లావాదేవీల(మనీ లాండరింగ్) కేసులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ చార్జి షీట్లో తొలిసారిగా ప్రస్తావించింది. అయితే, ఆమెను నిందితురాలిగా పేర్కొనలేదు. ఈ చార్జిషీట్‌ను గత నెలలో ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ సమరి్పంచింది. ఈ నెల 22న చార్జిషీట్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను వచ్చే 29వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో గతంలో సమర్పించిన చార్జిషీట్లో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరును ఈడీ చేర్చింది. చార్జి్జషీట్లో ఏముందంటే.. ► కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా 2005–06లో హెచ్.ఎల్.పహ్వా అనే ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి హరియాణాలోని అమీపూర్‌లో 40.08 ఎకరాలు కొన్నాడు. అదే భూమిని 2010 డిసెంబర్లో పహా్వకు అమ్మేశాడు. ► ప్రియాంకాగాంధీ 2006 ఏప్రిల్‌లో పహ్వా నుంచి అమీపూర్‌లో 5 ఎకరాలు కొనుగోలు చేశారు. 2010 ఫిబ్రవరిలో ఆ భూమిని తిరిగి అతడికే విక్రయించారు. ► పహ్వా సహాయంతో సి.సి.థాంపీ 2005 నుంచి 2008 మధ్య అమీపూర్‌లో 486 ఎకరాలు కొన్నాడు. ► రాబర్ట్ వాద్రా, థాంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉమ్మడి, వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ► రాబర్ట్ వాద్రాకు, థాంపీకి విక్రయించిన భూమికి గాను లెక్కలోని రాని నగదును పహ్వా స్వీకరించాడు. ► థాంపీ 2020 జనవరిలో అరెస్టయ్యాడు. వాద్రా తనకు గత పదేళ్లుగా తెలుసని ఈడీ విచారణలో అంగీకరించాడు. దుబాయ్‌లో, ఢిల్లీలో పలుమార్లు కలుసుకున్నామని వెల్లడించాడు. -
పాస్వర్డ్ గుట్టు వీడలేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో (టీఎస్పీఎస్సీ) చోటుచేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు శుక్రవారం తొలి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టులు మొదలై 90 రోజులు కావస్తుండటంతో నాంపల్లి న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ వేశారు. ఇందులో 37 మందిపై అభియోగాలు మోపారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మిగిలిన వారిపై అదనపు చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ చేతికి చిక్కిందెలా? కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్న కంప్యూటర్ నుంచి మాస్టర్ ప్రశ్నపత్రాలను కమిషన్ మాజీ ఉద్యోగి పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అట్ల రాజశేఖర్ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకోవడం ద్వారా చేజిక్కించుకున్నట్లు సిట్ నిర్ధారించింది. అయితే ఆ కంప్యూటర్లోకి చొరబడటానికి వాడిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ వారి చేతికి ఎలా చిక్కిందనే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు. నిందితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్చార్జ్గా ఉన్న శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను తన పుస్తకంలో రాసి పెట్టుకున్నారు. వాటిని ప్రవీణ్ నోట్ చేసుకొని రాజశేఖర్‌కు తెలిపాడని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఆపై కంప్యూటర్ను నిందితులు హ్యాక్ చేశారనే ఆరోపణలు వచ్చినా దానికీ ఆధారాలు లభించలేదు. 50 మంది నిందితుల్లో చిక్కిన 49 మంది... బేగంబజార్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ అయింది. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏసీపీ పి.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో ఇప్పటివరకు 50 మందిని నిందితులుగా తేల్చి 49 మందిని అరెస్టు చేశామని సిట్ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. న్యూజిల్యాండ్‌లో ఉన్న నిందితుడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. 50 మందిలో 16 మంది పేపర్ల విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్లే. అక్రమంగా ఏఈఈ ప్రశ్నపత్రం పొంది పరీక్ష రాసిన వాళ్లు ఏడుగురు, ఏఈ ప్రశ్నపత్రం పొంది రాసిన వాళ్లు 13 మంది, డీఏఓ పేపర్ పొంది పరీక్ష రాసిన వాళ్లు ఎనిమిది మంది ఉన్నారు. అరెస్టు అయిన నిందితుల్లో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌లతోపాటు షమీమ్, రమేష్ కుమార్‌లు కమిషన్ ఉద్యోగులు. వారిలో రాజశేఖర్ మినహా మిగిలిన ముగ్గురూ గ్రూప్–1 పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి మానేసిన సురేష్ సైతం గ్రూప్–1 పేపర్ పొంది పరీక్ష రాశాడు. ఇరిగేషన్ శాఖ మాజీ ఏఈ పూల రమేష్ సహకారంతో ఏఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముగ్గురినీ సిట్ అరెస్టు చేసింది. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి ప్రశ్నపత్రాల క్రయవిక్రయాల్లో రూ.1.63 కోట్లు చేతులు మారినట్లు తేలింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్స్, ల్యాప్టాప్స్, హార్డ్డిసు్కలతోపాటు ఫోన్లను విశ్లేషణ నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాక నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మరోవైపు లీకేజీ కేసులో అరెస్టు అయిన మాజీ ఏఈ పూల రమేష్ ఆరు రోజుల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో ఇతడికి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: అందుకు అదనంగా 90 రోజులు..
Aryan Khan Drugs Case: NCB Seeks 90 More Days For File Charge Sheet: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. గతేడాది అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఆర్యన్‌ను అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్ జైలుకు తరలించగా సుమారు 20 రోజులు గడిపాడు ఈ స్టార్ కిడ్. ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా పలుమార్లు తిరస్కిరించింది. దీంతో ఆర్యన్ ముంబై హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసును ఎన్సీబీ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం) దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే.. ఈ కేసులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసేందుకు తమకు 90 రోజుల అదనపు సమయం కావాలని కోర్టును ఎన్సీబీ కోరింది. ముంబై సెషన్స్ కోర్టులో మార్చి 28న పిటిషన్ వేసింది. అయితే ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 180 రోజుల్లోగా ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయాలి. దీని ప్రకారం చూస్తే ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ఏప్రిల్ 2 చివరి తేది అవుతుంది. ఈ లెక్కన మరో 90 రోజుల అదనపు సమయం అంటే ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు జూలై 2 తేది చివరి తేది కానుంది. గతేడాది అక్టోబర్ 2న పార్టీ జరగగా.. అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఈ కేసులో సుమారు 20 మందిని ఎన్సీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 18 మంది బెయిల్‌పై బయట ఉన్నారు. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు -
మళ్లీ తెరపైకి సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు
-
ఎంసెట్ స్కాంలో ఎట్టకేలకు చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో కలకలం రేపిన ఎంసెట్ (మెడికల్) స్కాంలో సీఐడీ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీట్ దాఖలు చేశారు. 2016 జూలైలో లీకేజీ ఉదంతం వెలుగుచూడగా 2019 జూలై అంటే నాలుగేళ్ల విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలైంది. 90 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో దర్యాప్తు జరుగుతుం డగానే ఇద్దరు మరణించగా ఇప్పటిదాకా 67 మంది అరెస్టయ్యారు. వరంగల్ నుంచి మొదలైన సీఐడీ దర్యాప్తు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, కటక్ తదితర ప్రాంతాలకు విస్తరించింది. పలుమార్లు విచారణాధికారులు మారడం, కేసులో జేఎన్టీయూ, శ్రీచైతన్య కార్పొరేట్ కళాశాల డీన్‌కు ఉన్న సంబంధాలు వెలుగుచూడటంతో కేసు మలుపులు తిరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ చరిత్రలో ఒక కుంభకోణంలో చార్జిషీట్ దాఖలుకు ఇంత సుదీర్ఘ సమయం తీసుకున్న అరుదైన కేసుగా ఈ ఘటన నిలిచింది. తాజాగా చార్జిషీటు దాఖలుతో కోర్టులో వాదనలు మొదలు కానున్నాయి. ఢిల్లీ లింకుతో మొదలు.. వరుసగా రెండోసారి కూడా ఎంసెట్ (మెడికల్) పేపర్ లీకైందన్న విషయం కలకలం రేపడంతో దర్యాప్తు చేసిన నాటి డీఎస్పీ బాలు జాదవ్, కానిస్టేబుల్ సదాశివరావు, మరో ఇన్స్పెక్టర్ నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు తీరుపై విమర్శలు రావడంతో కేసును సీఐడీకి బదిలీ చేశా రు. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ఢిల్లీలోని జేఎన్టీ యూ ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ లీకైన విషయా న్ని గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీసింగ్ను సూత్రధారిగా తేల్చింది. ప్రశ్నపత్రాన్ని ఎస్బీ సింగ్ తన మనుషుల ద్వారా బయటకు తెప్పించాడని గుర్తించింది. ఈ కేసులో 62 మంది బ్రోకర్లు సహా మొత్తం 90 మందిని నిందితులుగా పేర్కొంది. స్థానికంగా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు గుమ్మడి వెంకటేశ్, ఇక్బాల్‌లు విద్యార్థులకు లీక్ చేసిన పేపర్లను చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. వారితోపాటు శ్రీచైతన్య కాలేజీ డీన్ వాసుబాబు (ఏ–89), మరో ఏజెంట్ శివనారాయణరావు(ఏ–90)లతో కలిపి 90 మంది నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో కమిలేశ్ కుమార్ సింగ్ (55), రావత్ (43)లు మరణించారు. పకడ్బందీగా చార్జిషీటు.. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వివిధ రాష్ట్రాలకు విస్తరించిన ఈ కేసులో ఆధారాలు, సాక్ష్యాల సేకరణ క్లిష్టంగా మారింది. ఎస్బీ సింగ్‌ను 2017లో సీఐడీ పోలీసులు అరెస్టు చేసినా తగినన్ని సాక్షాలు లేక చార్జిషీట్ దాఖలు ఆలస్యమైంది. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకొని చివరకు పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా పకడ్బంది సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం. కేసులో 90 మంది నిందితులు, 400 మందికిపైగా తల్లిదండ్రులు, విద్యార్థులు, వారికి సహకరించిన వారు సాక్షులుగా ఉన్నారు. -
గౌరీ లంకేశ్ కేసులో చార్జిషీట్ దాఖలు
బెంగళూరు: సంచలనం సృష్టించిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్(55) హత్యకేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం తొలి చార్జిషీట్‌ను బెంగళూరులోని అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలుచేసింది. ఈ చార్జిషీట్లో హిందుత్వ కార్యకర్త నవీన్ కుమార్‌ను నిందితుడిగా సిట్ పేర్కొంది. నిందితుడిపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు ఆయుధ చట్టం కింద కేసు సిట్ నమోదుచేసింది. గౌరీ ఇంటివద్ద రెక్కీ నిర్వహించిన నవీన్ ఆమె హంతకులకు ఆయుధాలను సరఫరా చేశాడని సిట్ చార్జిషీట్లో తెలిపింది. హత్యచేసేందుకు నిందితుల్ని గౌరి ఇంటివద్దకు నవీన్ తీసుకెళ్లాడని వెల్లడించింది. -
కేశవరెడ్డి విద్యాసంస్థలపై చార్జ్‌షీట్ దాఖలు
అనంతపురం: బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కేశవరెడ్డి పాఠశాలపై సీఐడీ అధికారులు గురువారం అనంతపురం జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేశవరెడ్డి విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి డిపాజిట్లు సేకరించి గడువు ముగిసినా చెల్లించకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఇందులో భాగంగా బుక్కరాయసముద్రం పోలీసుస్టేషన్లో 149/2015 కేసు నమోదైంది. ఇక్కడి నుంచి కేసు సీఐడీకి బదిలీ అయింది. సీఐడీ అధికారులు 37 మందిని విచారించారు. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా నాగిరెడ్డి కేశవరెడ్డి అలియాస్ కేశవరెడ్డితో పాటు ఆయనకు చెందిన 11 సొసైటీలను ముద్దాయిలుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి 48 డాక్యుమెంట్లను సీఐడీ అడిషనల్ ఎస్పీ శ్రీధర్, పీపీ నారాయణస్వామి ట్రంకు పెట్టెలో పెట్టి జిల్లా కోర్టుకు సమర్పించారు.