అనంతపురం: బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కేశవరెడ్డి పాఠశాలపై సీఐడీ అధికారులు గురువారం అనంతపురం జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేశవరెడ్డి విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి డిపాజిట్లు సేకరించి గడువు ముగిసినా చెల్లించకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఇందులో భాగంగా బుక్కరాయసముద్రం పోలీసుస్టేషన్‌లో 149/2015 కేసు నమోదైంది.
ఇక్కడి నుంచి కేసు సీఐడీకి బదిలీ అయింది. సీఐడీ అధికారులు 37 మందిని విచారించారు. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా నాగిరెడ్డి కేశవరెడ్డి అలియాస్ కేశవరెడ్డితో పాటు ఆయనకు చెందిన 11 సొసైటీలను ముద్దాయిలుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి 48 డాక్యుమెంట్లను సీఐడీ అడిషనల్ ఎస్పీ శ్రీధర్, పీపీ నారాయణస్వామి ట్రంకు పెట్టెలో పెట్టి జిల్లా కోర్టుకు సమర్పించారు.
కేశవరెడ్డి విద్యాసంస్థలపై చార్జ్‌షీట్ దాఖలు
Published Thu, Jul 27 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM
Advertisement
Advertisement