న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు, వ్యాపారవేత్త సి.సి.థాంపీ నిందితుడుగా ఉన్న అక్రమ నగదు లావాదేవీల(మనీ లాండరింగ్) కేసులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ చార్జి షీట్‌లో తొలిసారిగా ప్రస్తావించింది. అయితే, ఆమెను నిందితురాలిగా పేర్కొనలేదు. ఈ చార్జిషీట్‌ను గత నెలలో ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ సమరి్పంచింది. ఈ నెల 22న చార్జిషీట్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను వచ్చే 29వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో గతంలో సమర్పించిన చార్జిషీట్‌లో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరును ఈడీ చేర్చింది.
చార్జి్జషీట్‌లో ఏముందంటే..
► కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా 2005–06లో హెచ్.ఎల్.పహ్వా అనే ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి హరియాణాలోని అమీపూర్‌లో 40.08 ఎకరాలు కొన్నాడు. అదే భూమిని 2010 డిసెంబర్‌లో పహా్వకు అమ్మేశాడు.
► ప్రియాంకాగాంధీ 2006 ఏప్రిల్‌లో పహ్వా నుంచి అమీపూర్‌లో 5 ఎకరాలు కొనుగోలు చేశారు. 2010 ఫిబ్రవరిలో ఆ భూమిని తిరిగి అతడికే విక్రయించారు.
► పహ్వా సహాయంతో సి.సి.థాంపీ 2005 నుంచి 2008 మధ్య అమీపూర్‌లో 486 ఎకరాలు కొన్నాడు.
► రాబర్ట్ వాద్రా, థాంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉమ్మడి, వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
► రాబర్ట్ వాద్రాకు, థాంపీకి విక్రయించిన భూమికి గాను లెక్కలోని రాని నగదును పహ్వా స్వీకరించాడు.
► థాంపీ 2020 జనవరిలో అరెస్టయ్యాడు. వాద్రా తనకు గత పదేళ్లుగా తెలుసని ఈడీ విచారణలో అంగీకరించాడు. దుబాయ్‌లో, ఢిల్లీలో పలుమార్లు కలుసుకున్నామని వెల్లడించాడు.
ఈడీ చార్జిషీట్‌లో ప్రియాంక పేరు
Published Fri, Dec 29 2023 4:54 AM | Last Updated on Fri, Dec 29 2023 4:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment