Illegal Money
-
గురివింద బండారం బట్టబయలు
-
ఈడీ చార్జిషీట్లో ప్రియాంక పేరు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు, వ్యాపారవేత్త సి.సి.థాంపీ నిందితుడుగా ఉన్న అక్రమ నగదు లావాదేవీల(మనీ లాండరింగ్) కేసులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ చార్జి షీట్లో తొలిసారిగా ప్రస్తావించింది. అయితే, ఆమెను నిందితురాలిగా పేర్కొనలేదు. ఈ చార్జిషీట్‌ను గత నెలలో ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ సమరి్పంచింది. ఈ నెల 22న చార్జిషీట్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను వచ్చే 29వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో గతంలో సమర్పించిన చార్జిషీట్లో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరును ఈడీ చేర్చింది. చార్జి్జషీట్లో ఏముందంటే.. ► కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా 2005–06లో హెచ్.ఎల్.పహ్వా అనే ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి హరియాణాలోని అమీపూర్‌లో 40.08 ఎకరాలు కొన్నాడు. అదే భూమిని 2010 డిసెంబర్లో పహా్వకు అమ్మేశాడు. ► ప్రియాంకాగాంధీ 2006 ఏప్రిల్‌లో పహ్వా నుంచి అమీపూర్‌లో 5 ఎకరాలు కొనుగోలు చేశారు. 2010 ఫిబ్రవరిలో ఆ భూమిని తిరిగి అతడికే విక్రయించారు. ► పహ్వా సహాయంతో సి.సి.థాంపీ 2005 నుంచి 2008 మధ్య అమీపూర్‌లో 486 ఎకరాలు కొన్నాడు. ► రాబర్ట్ వాద్రా, థాంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉమ్మడి, వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ► రాబర్ట్ వాద్రాకు, థాంపీకి విక్రయించిన భూమికి గాను లెక్కలోని రాని నగదును పహ్వా స్వీకరించాడు. ► థాంపీ 2020 జనవరిలో అరెస్టయ్యాడు. వాద్రా తనకు గత పదేళ్లుగా తెలుసని ఈడీ విచారణలో అంగీకరించాడు. దుబాయ్‌లో, ఢిల్లీలో పలుమార్లు కలుసుకున్నామని వెల్లడించాడు. -
తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
-
కర్నూల్ జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ లో భారీగా నగదు, బంగారం పట్టుకున్న సెబ్ అధికారులు
-
దొరుకుతాండ్లు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. లక్షలాది రూపాయలు పట్టుబడుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. నిరంతరం నిఘా పెట్టిన నేపథ్యంలో వాహనాల్లో తరలిస్తున్న నగదు అధికారులకు చిక్కుతోంది. నోటిఫికేషన్ రాకున్నా.. ఎన్నికల సమరం ఇంకా వేడెక్కకున్నా.. డబ్బులు దొరకడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్న జిల్లా అధికారులు చెక్‌పోస్టుల వద్ద ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ.. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను క్షుణ్ణం గా పరిశీలిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివర కు రూ.1,79,07,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలులోకి తెచ్చింది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా అ క్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులు తరలించకుండా జిల్లా సరిహద్దులతోపాటు జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వీటి వద్ద నిఘాను ముమ్మరం చేశారు. తనిఖీలను కట్టుదిట్టంగా చేపట్టేందుకు అధికారికంగా వీడియోగ్రాఫర్‌ను కూడా నియమించారు. తనిఖీ లు జరిగే చోట వీడియోగ్రాఫర్ దానిని చిత్రీకరిస్తారు. 15 చెక్‌పోస్టుల ఏర్పాటు.. జిల్లావ్యాప్తంగా మొత్తం 15 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల సరిహద్దుల్లో.. జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు జిల్లాలోకి ప్రవేశించే వాహనాలను సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేయడంతోపాటు తాజాగా సరిహద్దు జిల్లా ల్లోని తహసీల్దార్లతో కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాహనాల తనిఖీ విషయంలో ఏ మైనా అనుమానాలుంటే సమీపంలోని అధికారులకు, తమకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో 15 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఎన్నికల తనిఖీ కోసం కేటాయించారు. వీరు చెక్‌పోస్టులతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేస్తారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్సై, కానిస్టేబుల్ ఉంటారు. అనుమానాస్పదంగా.. సరైన లెక్కలు లేని నగదు దొరికితే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అనంతరం ట్రెజరీ కార్యాలయానికి నగదును తరలిస్తారు. తర్వాత ఆ రశీదును రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. ఇక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరిస్తాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేయకుండా అరికట్టడంలో ఈ బృందాలు కీలకపాత్ర వహించనున్నాయి. ప్రతిరోజు వారికి సంబంధించిన నివేదికను రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తాయి. రూ.1.79కోట్లు స్వాధీనం జిల్లాలో అక్రమంగా రవాణా అవుతున్న రూ.1.79కోట్ల నగదును ఇప్పటివరకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నప్పటికీ ఎన్నికల హడావుడి అప్పుడే ప్రారంభమైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే చెక్‌పోస్టులు, నియోజకవర్గాల సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10లక్షలను, మధిర నియోజకవర్గంలో రూ.2.40లక్షలు, వైరా నియోజకవర్గంలో రూ.14లక్షలతోపాటు ఆయా నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో తరలిస్తున్న రూ.52.67లక్షలను పట్టుకున్నారు. అయితే ఇందులో వైరా నియోజకవర్గంలో పట్టుకున్న రూ.కోటికి సరైన ఆధారాలు చూపించడంతో వాటిని తిరిగి అప్పగించారు. -
అక్రమ సొమ్ముతో ‘రియల్’ బిజినెస్
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన ఐఎఫ్ఎస్ అధికారి ముత్యాల రాంప్రసాదరావు అక్రమ లీలలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అక్రమ సొమ్ముతో పశ్చిమగోదావరి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. భార్య పేరుతో.. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించి రూ.వందల కోట్ల టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని రియల్టర్లు, ఫైనాన్షియర్లు.. రాంప్రసాద్‌కు బినామీలుగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. మంగళవారం తణుకు, విశాఖ, న్యూఢిల్లీ, మీరట్‌లలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ.10.72 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు రూ.37.25 లక్షల నగదు.. పలు బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ రూ.150 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ముత్యాల రాంప్రసాదరావుపై సీబీఐ అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. రాంప్రసాదరావు అక్రమ ఆర్జనకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆయన భార్య ఆకుల కనకదుర్గ దగ్గరుండి చూసుకుంటున్నట్లు ఏసీబీ గుర్తించింది. -
మంత్రుల పేరు చెప్పి... మంత్రాంగం!
♦ జీహెచ్ఎంసీలో అవినీతి తిమింగళం ♦ బెదిరింపులకు దిగి వసూళ్లు ♦ రూ.కోట్లల్లో అక్రమ సంపాదన ♦ జీహెచ్ఎంసీ ఏసీపీ సంతోష్ వేణుపై ఆరోపణలివీ... సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ అసిస్టెంట్ సిటీప్లానర్(ఏసీపీ) సంతోష్‌వేణు అక్రమాస్తులకు లెక్కేలేదని తెలుస్తోంది. శుక్రవారం ఏసీబీ అధికారులు సిటీలోని తొమ్మిది చోట్ల ఏక కాలంలో చేసిన దాడుల్లో సంతోష్ వేణు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా తెలిసింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు దాదాపు రూ.10 కోట్లకు పైగానే ఆస్తులు కనుకొన్నారు. టౌన్‌ప్లానింగ్‌లో పనిచేస్తున సంతోష్‌వేణు అక్రమార్జనకు పక్కాగా ప్లానింగ్ వేసి అవినీతి చేసేవాడని ఆయన పనిచేసిన పలు సర్కిళ్ల ద్వారా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జీహెచ్ంఎసీ క్యాడర్‌కు చెందిన సంతోష్‌వేణు హైదరాబాద్ స్థానికుడు కావడంతో తనను ఎవరూ ఏమీ చేయరనే ధీమాతో పాటు తనకు ఇద్దరు ముగ్గురు మంత్రుల అండదండలున్నాయని చెప్పుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడంటున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్–ఎ సర్కిల్లో పనిచేస్తున్న ఆయనకు ఇటీవల ఖైరతాబాద్–బి సర్కిల్‌కు సంబంధించిన అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న ఏసీపీ ఫిల్‌్మనగర్ కల్చర ల్ సెంటర్ పోర్టికో కూలిన ఘటనలో సస్పెండ్కావడంతో అక్కడి బాధ్యతలూ సంతోష్వేణుకు అప్పజెప్పాల్సి వచ్చింది. ఈయన ఖైరతాబాద్‌కు బదిలీపై వచ్చి నెల కూడా కాలేదు. అంతకుముందు శేరిలింగంపల్లి–2 సర్కిల్లో పనిచేసినప్పుడు భారీయెత్తున సంపాదించారనే ఆరోపణలున్నాయి. ఆ సర్కిల్ పరిధిలోని చందానగర్, మియాపూర్, హఫీజ్‌పేట, మాదాపూర్ ప్రాంతాల్లోని భారీ భవంతుల నిర్మాణాలతోపాటు అక్రమాలను అడ్డగోలుగా ప్రోత్సహిస్తూ భారీగా కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. అయ్యప్పసొసైటీ, గోకుల్‌ప్లాట్స్ తదితర ప్రాంతాల్లోనూ భారీమొత్తాల్లో వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లిలో పనిచేసినప్పుడు ఆ సర్కిల్లో నలుగురి స్థానే ఈయన, మరో టీపీఎస్ మాత్రమే ఉండటంతో భారీ యెత్తున అక్రమాలకు తెరతీశారని వినిపిస్తోంది. సంతోష్ దాదాపు 35 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. గతంలో ఎస్ఓగా ఉండగా...పదోన్నతితో ఏసీపీ అయ్యారు. అక్రమాలను అడ్డగోలుగా ప్రోత్సహించడమే కాక, దారికి రానివారి భవనాలు కూల్చివేస్తామని హెచ్చరించేవాడని చెబుతున్నారు. ఉదయాన్నే నోటీసులిస్తే.. సాయంత్రంలోగా వచ్చి ఆయనతో మాట్లాడుకొని ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే కూల్చివేస్తామని హె చ్చరించేవాడని చెబుతున్నారు. శేరిలింగంపల్లి నుంచి బదిలీ అయ్యే ముందు సైతం ఎఫ్టీఎల్ పరిధిలో భవనం నిర్మించుకున్న ఒక రిటైర్డు ఉద్యోగి నుంచి, చందానగర్ నేషనల్‌హైవేలో జరుగుతున్న నిర్మాణాల నుంచి భారీ యెత్తున ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. ముడుపులు చెల్లించని వారికి బెట్టర్‌మెంట్ చార్జెస్ వంటివి అడ్డగోలుగా విధించేవారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఆబిడ్స్ సర్కిల్లో పనిచేసినప్పుడు ఒక యజమానికి రూ. 40 వేల బెటర్మెంట్ చార్జీలు విధించాల్సి ఉండగా, రూ. 4 లక్షలకు పైగా వేసినట్లు సదరు సర్కిల్లోని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇటీవల బీఆర్ఎస్కు అవకాశం కల్పించడంతో క్రమబద్ధీకరణకు అవకాశం లేని వాటిని సైతం క్రమబద్ధీకరిస్తానని లెక్కకుమిక్కిలిగా వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. మచ్చు మరకలు.. సిటీలో అవినీతి ఎక్కువ జరిగే ప్రభుత్వ విభాగాల్లో జీహెచ్ఎంసీ ఒకటి అనే ముద్ర పడింది. ఎంతోకాలంగా అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్న అక్రమాలు.. పలు సందర్భాల్లో ఏసీబీకి పట్టుబడ్డ వారే ఇందుకు ఉదాహరణలు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఘటనల్లో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏసీబీకి చిక్కిన వారు.. గుర్తించిన ఆస్తుల విలువ వివరాలిలా ఉన్నాయి. – మార్చి 10 మలోత్ పీర్సింగ్, డీఈఈ, శేరిలింగంపల్లి–2 రూ . 7 కోట్లు – మే 11 కృపాదానం, ఇన్‌ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్, సికింద్రాబాద్ రూ. 5 కోట్లు –ఏప్రిల్ 6 జనార్దన్ మహేశ్, సెక్షన్ ఆఫీసర్, టౌన్‌ప్లానింగ్, సికింద్రాబాద్ రూ. 3 కోట్లు – 2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 మంది జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులు ఏసీబీ వలలో చిక్కారు. వీరు కాక లంచాలకు పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వారు మరి కొందరున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గడచిన ఆర్నెళ్ల కాలంలోనే 11 మందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
జీహెచ్ఎంసీలో అవినీతి తిమింగళం
-
ఆర్టీఏలో అర్ధరాత్రి ‘వసూల్ రాణి’
వరంగల్: ఆమె రోడ్డెక్కిందంటే ఆ రహదారిలో వెళ్లే వాహనదారులకు హడల్.. పెన్ను పట్టిందంటే చాలు.. రాసే ఫైన్ 50 వేల రూపాయలపైనే. అయితే ఈ ఫైన్ కేవలం రశీదు కావాలని అడిగిన వ్యక్తులకే మాత్రమే. అదే రశీదు అక్కర్లేదనుకుంటే అందులో సగం డబ్బులు ఆమె చేతిలో పెడితే చాలు వాహనాన్ని వదిలేస్తారు. లేదంటే ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి ఫైన్ మొత్తం కట్టాల్సిందే. ఆమె గురించి తెలిసిన వాహనదారులు అంత మొత్తం డబ్బులు కట్టలేక.. ఫైన్‌లో సగం డబ్బులు చెల్లించి బతుకు జీవుడా అంటే తమ బండ్లు తీసుకెళుతున్నారు. సదరు అధికారిణి మామునూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వాహనదారులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన ప్రస్తుతం ఆర్టీఏలో హాట్‌టాపిక్‌గా మారింది. వరంగల్ రవాణాశాఖలో ఏఎంవీఐగా పనిచేస్తున్న సదరు అధికారిణి శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లింది. తిరిగి అర్ధరాత్రి తన అద్దె వాహనంలో డ్రైవర్, ఆనుచరులతో కలిసి వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్ధరాత్రి వరకు తిష్టివేసింది. మామునూరు గ్రామశివారులో రహదారి నుంచి వెళ్లే వాహనాలను ఆమె ఆపి తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు పలు సాకులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. కిలోమీటర్ మేర లారీలతోపాటు పలు రకాల వాహనాలు నిల్చిపోగా వందలాది వాహనదారులు మాముళ్లు సమర్పించుకున్నారు. పెనాల్టీ కట్టినట్లుగా రశీదు కావాలని నిలదీసిన వాహనదారుల పై ఆ మహిళా అధికారి మండిపడ్డారు. వాహనాల తాళం చెవులు లాక్కోవడమేగాక వాహనాలను సీజ్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఆ మహిళా అధికారిని ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఎస్కె సైదులు ఆమె సమక్షంలోనే అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా వసూళ్ల దందా నడుస్తుండగా ఓ మీడియాకు సమాచారం అందింది. వారు రంగంలోకి దిగడంతో సదరు అధికారిని గమనించి ప్రైవేట్ డ్రైవర్‌తోపాటు అక్కడి నుంచి జారుకుంది. దీంతో బాధిత వాహనదారులు మహిళా అధికారిని ఇంట్లో పని చేసే సైదులును పట్టుకుని దేహశుద్ధి చేసి మామునూరు పోలీసులకు అప్పగించారు. ఆతడి వద్ద రూ.3 వేలు ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓ చానల్ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎంవీఐ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న సైదులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత రవాణా శాఖ డీటీ సీ శివలింగయ్యకు సమాచారం అందజేశామని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై యుగంధర్ వెల్లడించారు. పోలీసు నివేదిక ఆధారంగా ఏఎంవీఐపై చర్యలు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై సదరు మహిళా ఏఎంవీఐ ఆర్ధరాత్రి అక్రమంగా మామూళ్లు వసూళ్లు చేస్తోందనే ఆరోపణలపై విచారిస్తున్నామని డీటీసీ శివలింగయ్య తెలిపారు. మామునూరు సీఐతో మాట్లాడి వివరాలు సేకరించామని, పోలీసుల నివేదికను బట్టి ఏఎంవీఐపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. - శివలింగయ్య, డీటీసీ -
ఎన్నికల వేళ డబ్బు అక్రమరవాణా