పుట్టినరోజే నాబిడ్డను కడతేర్చారు... | btech student Death Mystery in Chandragiri | Sakshi
Sakshi News home page

పుట్టినరోజే నాబిడ్డను కడతేర్చారు...

Published Sun, Oct 9 2016 2:16 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

పుట్టినరోజే నాబిడ్డను కడతేర్చారు... - Sakshi

పుట్టినరోజే నాబిడ్డను కడతేర్చారు...

అనుమానస్పద స్థితిలో విద్యానికేతన్ విద్యార్థి మృతి
అది ముమ్మాటికీ హత్యేనంటున్న తల్లిదండ్రులు
విద్యానికేతన్ ఎదుట బైఠాయించి, నిరసన తెలిపిన విద్యార్థి సంఘాలు

చంద్రగిరి:  పుట్టిన రోజు  అన్నాడు.. కొత్తబట్టలు తీసిచ్చాము.. ఎంతో సంతోషంగా నా బిడ్డ తన కాలేజ్‌లో మోహన్‌బాబు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి వచ్చిన వాడిని అన్యాయంగా ఆరోజే తోటి స్నేహితులే కడతేర్చారంటూ ఆ తల్లి పడ్డ వేదన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఏ పాపం తెలియని తన కొడుకుని హతమార్చడానికి వాళ్లకి చేతులేలా వచ్చాయంటే ఆ తల్లి ఆక్రోసం పలువురిని కదలించింది. బందువుల కథనం మేరకు..

తిరుపతి పెదకాపు వీధికి చెందిన చలపతి, నాగమణిలకు ఇద్దరు కుమారులు. వారిలో రెండవ కుమారుడు నవీన్‌కుమార్(18) విద్యానికేతన్ విద్యాసంస్థలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5వ తేదిన నవీన్ పుట్టిన రోజు కావడంతో కొత్తబట్టలు వేసుకుని కళాశాల చైర్మన్ మోహన్ బాబు వద్ద ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఎప్పటిలాగే ఇంటిలో నుంచి కళాశాలకు పయనమయ్యాడు.

అయితే నవీన్ 5వ తేది మధ్యాహ్నం  నుంచి కళాశాలకు రాలేదని కళాశాల యాజమాన్యం సమాచారం అందించింది. అప్పటి నుంచి ఎంత వెతికినా నవీన్ కనిపించ కపోవడంతో,  6వతేదిన చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా , వారు మిస్సింగ్ కేసు నమోదు చేసారు. ఈ లోగా శుక్రవారం విద్యానికేతన్‌కు ఎదురుగా ఉన్నటువంటి  గుండాలకోన మడుగులో ఓ శవం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మతుడి కుడిచేతి వేళ్లకు ఉంగరం ఉండటంతో నవీన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మతుడు తన బిడ్డేనని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో నవీన్ తల్లిదండ్రులు, బందువులు, విద్యార్థి సంఘ నాయకులు విద్యానికేతన్ వద్ద చేరుకున్నారు. ఆంబులెన్స్‌లో పోస్టమార్టంకు వెళుతున్న నవీన్ మతదేహాన్ని వారి బందువులు అడ్డుకుని నిరసనకు యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని మతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అనంత రం వారు విద్యానికేతన్ గేటు ముందు ైబైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో కళాశాల సీఈవో తులసీ నాయుడు జోక్యం చేసుకుని తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామి ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.

అనుమానాలెన్నో...
నవీన్ మృతి పట్ల పలు అనుమానాలు తావిస్తోంది. నవీన్‌ను కళాశాల నుంచి ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు అన్న విషయం అంతుపట్టడం లేదు. కళాశాలలో నవీన్‌కు ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని పలువురు విద్యార్థులు తెలుపుతున్నారు. అంతే కాకుండా మతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అది హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. నవీన్ మృతికి ప్రేమే కారణమా? లేక మరేదైనా విభేధాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

అది ముమ్మాటికీ హత్యే..
నా బిడ్డ ఎవరీ జోలికీ వెళ్లడు. ఎంతో సౌమ్యుడిగా ఉంటారు. అటువంటి వ్యక్తిని అన్యాయంగా చంపారు. తన తోటి విద్యార్థులే కొంత మంది నా బిడ్డను కళాశాల నుంచి బయటకు తీసుకువచ్చి, ఆటోలో ఎక్కించుకుని వెళ్లినట్లు సీసీ కెమారాల్లో రికార్డు అయ్యింది. నాబిడ్డను చంపిన వారిని శిక్షించాలి.                                                                        - నాగమణి, తల్లి.

యాజమాన్య వైఫల్యమేః
నవీన్ మృతికి యాజమాన్యం వైఫల్యమే కారణం. గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నా పోలీసులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కళాశాల్లో నాశిరకం సీసీ కెమారాలను పెట్టి విద్యార్థుల జీవితాలతో వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై ఏఐటీయూసీ దృష్టికి తీసుకెళ్తాం.
        -విశ్వనాథం, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement